potula sunita
-
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ఇలా..!
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దళిత మహిళ అయిన హోంమంత్రి తానేటి వని తపై దాడులకు దిగటం సిగ్గుచేటని అన్నారు.విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు పా ల్పడ్డారని, మాచర్ల నియోజకవర్గంలోని శిరి గిరిపాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమపై దాడి చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. హోంమంత్రి తానేటి వనితపై దాడిని మహిళా లో కం సీరియస్‌గా తీసుకుందని, మహిళలంతా ఏకమై ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చె ప్పేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించటం ఖాయమని పోతుల సునీత చెప్పారు.మహిళలపై టీడీపీ దాడులు దుర్మార్గం..ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మహిళలపై టీడీపీ కూటమి నేతలు దుర్మార్గంగా దాడులకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల మహిళలపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలమీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆమె గురువారం లేఖ రా శారు.ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించడంతో దళితులు, మహిళలు భ యాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా కుమారుడు మహిళలపై దాడి చేయడం దారుణమన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలిపై, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ నేతలు దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. -
ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పోతుల సునీత, చల్లా భగీరథరెడ్డిలతో చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఇద్దరికీ అభినందనలు తెలిపి, మండలి నియమ నిబంధనలు వివరించారు. వారికి ధ్రువీకరణ పత్రాలు, బుక్‌లెట్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా, అసెంబ్లీ సహాయ కార్యదర్శి విజయరాజు, తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మండలి చైర్మన్ కాగా, శాసన మండలి ఆవరణలో చైర్మన్ ఎం.ఎ. షరీఫ్ బుధవారం కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు. ఆయనతోపాటు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, పలువురు సహాయ, అసిస్టెంట్ కార్యదర్శులు, ఉద్యోగులు, మార్షల్స్ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డీఎంహెచ్‌వో యాస్మిన్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రత్న మన్మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఘర్షణ
ఒంగోలులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. మీటింగ్ ముగిసిన తర్వాత బయటకు వెళ్తున్న మంత్రి రావెలకు వినతి పత్రం ఇచ్చేందుకు చీరాల టీడీపీ నేత పోతుల సునీత వర్గీయులు ప్రయత్నించారు. అయితే ఆయన తర్వాత చూద్దాం అంటూ దాటవేశాడు. దీంతో పోతుల వర్గీయులు మంత్రి కారును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రావెల అనుచరులు వారిపై దాడి చేశారు. ఈ ఘటనతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనతో పోతుల వర్గీయులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. -
బాహాబాహీ
చీరాల: జన్మభూమి కార్యక్రమం చీరాలలో అపహాస్యమైంది. ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన వేదిక కాస్తా..వీధి తగాదాకు నెలవైంది. తమ గోడు చెప్పుకుందామని వచ్చిన ప్రజలు రాజకీయ నేతల మధ్య జరిగిన ఘర్షణ చూసి..వీరా తమ తలరాత మార్చే నేతలంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రొటోకాల్ రేపిన వివాదంతో ఎమ్మెల్యే ఆమంచి, టీడీపీ ఇన్చార్జ్ పోతుల సునీతల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. నేతలు, వారి అనుచరులు అధికారుల ముందే పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన మండలంలోని విజయనగర్ కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని కాలనీలో ఏర్పాటు చేశారు. సభలో తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో జీ సాంబశివరావు ప్రారంభించి వేదికపైకి సర్పంచ్ దుడ్డు రూపవతి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, తహశీల్దార్ బీ సత్యనారాయణలను పిలిచారు. తర్వాత సర్పంచ్ రూపావతిని అధ్యక్షత వహించాలని ఎంపీడీవో కోరారు. అప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీత వేదిక వద్ద ఉన్నారు. ఆమంచి వర్గీయులు ‘ఆమంచి జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. టీడీపీ సర్పంచ్ రూపావతి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతుల సునీతను వేదికపైకి రావాలని ఆహ్వానించారు. ఎటువంటి ప్రొటోకాల్ లేకున్నా..సునీతను వేదికపైకి ఆహ్వానించడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. కేవలం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరుకావాల్సిన ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ని వేదికపైకి పిలవడంపై తొలుత మాటల యుద్ధం నడవగా..చివరకు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ నేతలను పిలవడం ఏమిటని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. అయితే సర్పంచ్ మాత్రం ‘నేనే గ్రామానికి పెద్ద. మా నేత వేదికపైకి వస్తే మీకేంటి’ అని అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీనికి ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ ఇది రాజకీయ కార్యక్రమం కాదని..ప్రొటోకాల్ సక్రమంగా అమలు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆమంచి, పోతుల వర్గీయులు కుర్చీలు, కర్రలతో దాడులకు దిగారు. ఆమంచి వర్గీయులు కొందరు సర్పంచ్‌పై దాడి చేశారు. సునీత వర్గీయులు కూడా ఆమంచి వర్గీయులపై దాడులు చేశారు. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుని, తోసుకున్నారు. ఆమంచి, సునీత మధ్య దూషణల పర్వం కొనసాగింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఆగ్రహానికి గురైన సునీత విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఆమంచి వర్గీయురాలు అనుకొని చేయిచేసుకోవడంతో పాటుగా దుర్భాషలాడారు. టూటౌన్ సీఐ అబ్దుల్సుబాన్, ఎస్సై రాములు నాయక్, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ మహిళా కానిస్టేబుల్‌పై సునీత దాడిచేస్తున్నా నిలువరించలేకపోయారు. చివరకు సునీతను పోలీసులు పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. జన్మభూమి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్యెల్యే పట్టుబట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అధికారులు ఈనెల 10 తేదీకి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఒన్‌టౌన్ సీఐ బీమానాయక్ సునీత, ఆమంచిలతో చర్చించి గ్రామ సభ నుంచి వెళ్లాలని సూచించగా ఇరువర్గాలు ఒకరి తరువాత ఒకరు సభాప్రాంగణం నుంచి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఘర్షణలో గ్రామసర్పంచ్ డి.రూపవతిపై ఎమ్యెల్యే ఆమంచి వర్గీయులు దాడిచేయడంతో గాయాలయ్యాయి. దీంతో సర్పంచ్‌ని వైద్యసేవల నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె పోలీసులకు ఫిర్యాదు చే శారు. పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న ఘర్షణలో ఎమ్యెల్యే ఆమంచి సోదరుడు స్వాములు కూడా ఉన్నారు. గ్రామంలో పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా ఏఎస్పీ వి.రామానాయక్ గ్రామాన్ని సందర్శించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న సర్పంచ్ డి.రూపవతిని పరామర్శించి సంఘటన వివరాలు సేకరించారు. చంద్రబాబు ఆదేశాలతోనే జన్మభూమిలో పాల్గొంటున్నాం: పోతుల సునీత జన్మభూమి- మాఊరు కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జులు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకే జన్మభూమిలో పాల్గొన్నాం. కానీ ఎమ్యెల్యే ఆమంచి చేతకాని వ్యక్తిగా ప్రవర్తించారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకుని మా పార్టీ వారిపై దాడి చేయించారు. అధికారులను బెదిరించారు. ఇటువ ంటి వ్యక్తులకు భయపడేది లేదు. పోలీసులు సర్పంచ్‌పై దాడిచేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఇది పార్టీ కార్యక్రమమా? - ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ జన్మభూమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం. టీడీపీ సమావేశంలాగా సునీత వేదికపైకి రావడం సరికాదు. అధికారుల అలసత్వం, అవగాహనా లోపం వలనే ఇలా జరిగింది. శనివారం దేవినూతల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జ్ సునీతను వేదికపైకి ఆహ్వానించకుండా ఉండాల్సింది. ఇకపై ఆమె మరో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాల వేదికపైకి రాకుండా ఉండాలి. సర్పంచ్ రూపావతి జన్మభూమి కార్యక్రమాన్ని ఆటంకపరిచారు. జన్మభూమిలో పంచాయతీ అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నాం. మరలా ఇదే గ్రామంలో జన్మభూమిలో పాల్గొని అభివృద్ధికి చర్యలు చేపడతాను. -
నైతికంగా నాదే విజయం
హైదరాబాద్: నైతికంగా తనదే విజయం అని సార్వత్రిక ఎన్నికలలో ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన పోతుల సునీత అన్నారు. చీరాలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ను టీడీపీలో చేర్చుకోవద్దని పార్టీ అధిష్టానాన్ని ఆమె కోరారు. గతంలో ఆమంచి టీడీపీ కార్యకర్తలను దూరంగా ఉంచారని ఆమె ఆరోపించారు. ఆమంచి అవినీతిపై విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారులను మేనేజ్ చేశారని ఆమె ఆరోపించారు. ఆ ఎన్నికలలో నైతికంగా తనదే విజయం అని పోతుల సునీత చెప్పారు. టిడిపిలో చేరడం కోసం ఆమంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే చీరాల ప్రాంత కార్యకర్తలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు కూడా చీరాలకు చెందిన టిడిపి కార్యకర్తలు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేశారు. -
అది ప్రజా తీర్పుకాదు...
చీరాల, న్యూస్‌లైన్: చీరాల నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో నవోదయం పార్టీ తరుఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ గెలుపు ప్రజాతీర్పు కాదని టీడీపీ నాయకులు పోతుల సునీత, పాలేటి రామారావు ఆరోపించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ నాటి నుంచి చీరాల నియోజకవర్గ ఎన్నికల అధికారి, డీఆర్డీఏ పీడీ పద్మజ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతి రౌండు ఫలితం వెల్లడించాల్సి ఉండగా ఎనిమిది రౌండ్ల వరకు మాత్రమే ప్రకటించారన్నారు. ముందు ఒక మెజార్టీని ప్రకటించి కొంత సమయం తరువాత 11వేల మెజార్టీ ఆటో గుర్తు అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌కు వచ్చినట్లుగా చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. అలానే పోస్టల్ బ్యాలెట్ బాక్సుకు తాళాలు లేకుండా తెచ్చారని ఆరోపించారు. అందులో 200 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆటో గుర్తుకే వచ్చాయని, ఇది ఎలా సాధ్యపడిందన్నారు. ఇదే విషయాన్ని ఆర్వోకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. 60 ఈవీఎంలు తారుమారు అయ్యాయని, ఇవి టీడీపీకి పట్టున్న పాపాయిపాలెం, దేవాంగపురి, ఈపూరుపాలెం గ్రామాలవని అన్నారు. అందులో టీడీపీకి అతి తక్కువ ఓట్లు రావడం అనుమానాలకు తావిస్తుందన్నా రు. ఈవీఎంలకు ఉండాల్సిన నంబర్లు, చీటీల నంబర్లు, ఎన్నిక జరిగిన రోజు ఉన్న నంబర్లుకు తేడా ఉందన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ ఆర్వోపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల కౌంటింగ్‌లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేపట్టి రీ పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్రిక్త పరిస్థితులు చీరాల అర్బన్, న్యూస్‌లైన్: చీరాలలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో టీడీపీ వర్గీయులు గడియారం స్తంభం సెంటర్‌కు చేరుకున్నారు. చీరాల అసెంబ్లీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ కార్యకర్తలు బాహాటంగా విమర్శలకు దిగారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో వెంటనే ఒన్ టౌన్, టూ టౌన్ సీఐలు రంగప్రవేశం చేసి ధర్నాలు, ర్యాలీలు చేయకూడదంటూ పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం టీడీపీ వర్గీయులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
చీరాల టీడీపీలో సీటు రచ్చ
చీరాల, న్యూస్‌లైన్: చీరాల టీడీపీలో సీటు చిచ్చు రగులుతోంది. నాలుగేళ్లుగా పార్టీ వైపు కన్నెత్తి చూడని సరికొత్త నాయకులు, స్థానికేతరులు సీటు కోసం పోటీ పడుతున్నారు. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి నాలుగేళ్లుగా ఇన్చార్జి లేక, పార్టీని నడిపే నాథుడు లేక ఇప్పటికే క్యాడర్ బలహీనమైంది. టీడీపీకి పట్టున్న గ్రామీణ ప్రాంతాల్లో సైతం దెబ్బతింది. నావికుడు లేని నావలా మారింది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీటు మాకంటే మాకంటూ తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో ఉన్న కొద్ది క్యాడర్ కూడా నిట్టనిలువుగా చీలింది. సీటు కోసం ప్రయత్నిస్తున్న పరిటాల రవి అనుచరుడు పోతుల సురేష్ భార్య పోతుల సునీత, మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) బలనిరూపణకు సిద్ధమయ్యారు. తమ అనుచరులతో వారు హైదరాబాద్‌లో అధినేత ఎదుట ఇప్పటికే పలుమార్లు తిష్ట వేశారు. దీనికి తోడు పార్టీకి సీనియర్ నేతలుగా ఉన్న మాజీ ఎంపీ చిమటా సాంబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొడుగుల గంగరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుద్దంటి చంద్రమౌళి, కొత్తగా వచ్చిన గొర్ల శ్రీనివాసయాదవ్, పులి వెంకటేశ్వర్లు వంటి వారు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇన్చార్జి లేకపోయినా అండదండగా ఉన్నామని, తమకే పార్టీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. శుక్రవారం చిమటా సాంబు తన సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీగా వెళ్లి జిల్లా నాయకుడిని తనకే సీటు ఇవ్వాలని కోరారు. అయితే పోతుల సునీత, మునగపాటి బాబుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎవరి బలం వారిదే.. పార్టీలో ఉన్న సీనియర్లు అంతా మునగపాటి బాబు వైపు నిలబడగా, ఒక సామాజిక వర్గంలోని నాయకులు సునీత వైపు నిలబడ్డారు. జిల్లా నాయకత్వం కూడా అదే పంథాలో ఉంది. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కరణం బలరాం మునగపాటి బాబును సిఫార్సు చేస్తుండగా, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సునీత వైపు మొగ్గు చూపుతున్నారు. పరస్పర విమర్శలు: సీట్ల వ్యవహారంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఏర్పడి రెండుగా చీలిపోయారు. పోతుల సునీత స్థానికేతరురాలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి.. ఆమె భర్త పోతుల సురేష్‌పై అనేక కేసులున్నాయని బాబు వర్గం ప్రచారం చేస్తోంది. సునీత వర్గం కూడా అదే స్థాయిలో మునగపాటి బాబు స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన వ్యక్తని, ఆయన 2009లో టీడీపీకి రాజీనామా చేశారని ఆరోపణలు చేయడంతో పాటు కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. పోతుల సునీతది పద్మశాలి సామాజికవర్గం, ఆమె భర్త సురేష్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో చీరాల స్థానం అనుకూలంగా ఉంటుందని భావించి చీరాల వైపు అడుగులు వేశారు. వాస్తవంగా ఆమెది తెలంగాణ ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని గ్రామం. 2004 ఎన్నికల్లో ఆలంపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైంది. ఆ తర్వాత 2009లో ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గానికి ఇన్చార్జి లేకపోవడంతో ఆమె దృష్టి చీరాలపై పడింది. అయితే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులను మాత్రం తన వైపునకు తిప్పుకోలేకపోయింది. కేవలం కొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో నెట్టుకొస్తున్నారు. దీంతో సీనియర్ నాయకులుగా ఉన్న కొందరు ఆమె స్థానికేత రురాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. అలానే మునగపాటి వెంకటేశ్వర్లు (బాబు) గతం నుంచి టీడీపీలో ఉన్నారు. వేటపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా, వేటపాలెం పంచాయతీ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల తర్వాత ఆయన తన రెండు పదవులకు రాజీనామా చేసి పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ సీటు కోసం రేసులో ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న అతికొద్ది క్యాడర్ ఎవరి వైపు అడుగులు వేయాలో అమోమయంలో ఉన్నారు.