Live Updates:
Time:3:20PM
►ఏపీ అసెంబ్లీ రేపటికి(బుధవారం) వాయిదా పడింది
Time: 3:00PM
అసెంబ్లీలో ఫైబర్ నెట్ స్కామ్‌పై చర్చ
►చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారు: మంత్రి గుడివాడ అమర్నాథ్
►స్కిల్ స్కామ్‌లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయి
►ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ సంస్థ తెలిపింది.
►సీమెన్స్ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు
►సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదు.
►చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్ టెండర్ కట్టబెట్టారు
►షెల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు
►హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్‌లుగా పనిచేశారు
►2016లోనే చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఎండగట్టారు
Time: 02:20PM
► శాసన మండలి రేపటికి వాయిదా
Time: 02:00PM
►చంద్రబాబు స్కిల్ స్కామ్ మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్‌గా మారింది: ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి
►లోకేష్ విదేశాల్లోచదివి స్కాంలపై స్పెషలైజేషన్ చేశాడు
►ఫేక్ ఎంవోయూలు ఎలా చేయాలో లోకేష్ బాగా నేర్చుకున్నాడు
►ఏ విధంగా స్కిల్ స్కామ్ చేశారనేది అందరికీ తెలుసు
► పక్కా ప్లానింగ్‌తోనే స్కిల్ స్కామ్ జరిగింది.
► స్కిల్ స్కామ్‌కు కథ, స్క్రీన్‌పై, దర్శకత్వం చంద్రబాబే
► చంద్రాబు కనుసన్నల్లోనేస్కిల్ స్కాం జరిగింది
Time: 01:30PM
శాసనమండలి
► రాష్ట్రంలో యూనివర్సిటీల్లో 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: మంత్రి బొత్స సత్యనారాయణ
► దేశంలోని 100 టాప్ విశ్వవిద్యాలయాల్లో ఏపీలోని విద్యాలయాలు కూడా చోటు పొందేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు
► మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండాలని సీఎం సూచించారు.
► పాఠశాలలో ఇచ్చే విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లలో విద్యకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉండేలా చర్యలుచేపడతాం.
► రాష్ట్రంలో 46 వేల స్కూళ్లు నాడు-నేడు కింద అభివృద్ధి చేయడం జరిగింది.
► ప్రస్తుతం మన బడి నాడు-నేడు రెండో దశ పనులు జరుగుతున్నాయి.
► సింగిల్ టీచర్ ఉన్న స్కూల్‌లో సైతం మన బడి నాడు-నేడు అమలు జరుగుతోంది.
► బైజూస్ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ ఇస్తామని కోరితే సీఎం అంగీకరించారు.
►బైజూస్‌కు ప్రభుత్వం ఒక రూపాయి కూడా చెల్లించలేదు
► టెండర్ల ప్రకారమే పారదర్శకంగా ట్యాబ్‌లుకొనుగోలు జరిగింది.
► బైజూస్ కంటెంట్ అంశంలో కొన్ని పత్రికలు అవాస్తవాలను రాస్తున్నాయి
Time: 12:40PM
బీసీ జనగణనపై అసెంబ్లీలో చర్చ
►దేశంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడం అవసరం
►కులాల వారీగా జనగణన జరగడం లేదు
►సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు జనగణన చేయాల్సిందే.
►సామాజిక న్యాయం చేయాలంటే కులాల వారీగా జనగణన అవసరం
► ఏపీ అసెంబ్లీకి విరామం
శాసనమండలిలో చర్చ
►గతంలో కంటే ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది: మంత్రి అంబటి రాంబాబు
►ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు రూ.55కోట్లు అవసరం ఉంది
►నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నాం
►వరదల కారణంగా డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో పనులు నిలిచిపోయాయి
►పనులు ఆగిపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి.
►జగనన్న గోరుముద్ద అద్భుతమైన పథకం
►పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నాం
►ఇంటర్ వరకూ జగనన్న గోరుముద్ద కొనసాగించాలని కోరుతున్నాం
►ఇప్పటి వరకూ రూ. 6,600 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశాం
►ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని: మంత్రి విడుదల రజిని
►ఆరోగ్యశ్రీలో గతంలో కంటే ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చాం
►విద్యా, వైద్య రంగాలకు సీఎం జగన్ పెద్దపీట: ఎమ్మెల్యే గోపిరెడ్డి
►ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతో మందికి లబ్ధి
►పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చారు
Time: 11:00AM
►విద్య, వైద్య రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
►సీఎం జగన్ విద్య, వైద్య రంగాలకే ప్రాధాన్యతనిచ్చారు.
►పేదవారికి ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకొచ్చారు
►ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు పెంచడం ఎంతోమందికి లబ్ది జరిగింది
►రోజుకు సగటున 5 వేలకు పైగా పేషెంట్లు ఆరోగ్య శ్రీ సేవలు
Time: 10:30AM
►దేవాలయాల సంక్షేమంపై సీఎం జగన్ దృష్టిపెట్టారు: మంత్రి కొట్టు సత్యనారాయణ
►అర్చకులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్
►గత ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను ఆదాయంగానే చూసింది
►ధూపదీపనైవేద్యాల స్కీమ్‌కు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నాం.
Time: 10:13AM
ప్రారంభమైన మండలి సమావేశం
►రాష్ట్ర సమగ్ర శిక్ష, కస్తూరిబా విద్యాలయాలలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగ భద్రతపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన పిడిఎఫ్ సభ్యులు
►వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్
Time: 10:06AM
►అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
Time: 10:02AM
AP రైతులకు శుభవార్త
►వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన
►వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి,కాకాణి గోవర్ధన్ రెడ్డి
►రైతులకు ఇక పై పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదన్న బెంగలేదు
►సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు
►సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించారు
►రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం ఆలోచన
►తొలిసారిగా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం
►ప్రతీ రైతు భరోసా కేంద్రాన్ని ఒక వ్యాపారకేంద్రంగా మార్చాం
►దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే CM APP ద్వారా పంటలను కొనుగోలు చేస్తున్నాం
►ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులు మంచి ధరలకు పంటలను అమ్ముకోగలుగుతున్నారు
►ప్రతీ రైతు భరోసా కేంద్రాల్లో ఈ మద్దతు ధరల ప్రకటన పోస్టర్లను ప్రదర్శిస్తాం
:::మంత్రి,కాకాణి గోవర్ధన్ రెడ్డి
Time: 09:57AM
►ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల స్కీమ్ కోసం బడ్జెట్ కేటాయించాం
►దేవాలయ వ్యవస్థను పారదర్శకంగా నడుపుతున్నాం
►ఇంకా కొన్ని దేవాలయాలను ధూపదీప నైవేద్యాల స్కీమ్ చేర్చాలి
►అర్చకులకు ప్రభుత్వం అండగా నిలవడం అభినందనీయం
:::మల్లాది
దేవాలయాల అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ
గత ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది
చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు
జగన్ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది
Time: 09:55AM
సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకం: మంత్రి ధర్మాన
►సమగ్ర సర్వేలో సాంకేతికత కూడా కీలకంగా వ్యవహరిస్తోంది
►ఫోర్జరీలకు అవకాశం లేకుండా పోయింది
►సంస్కరణల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం
►ప్రతీ పథకం ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Time: 09:40AM
►జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరిగింది
►గతంలో ఒక్కో సర్టిఫికెట్ కోసం ఒక్కో ఆఫీస్ తిరగాల్సి వచ్చేది.
►ఇప్పుడు జగనన్న సురక్షతో ఒకే చోట అన్ని సర్టిఫికెట్లు అందిస్తున్నాం
►గడపడగడపకూ ప్రభుత్వ సేవలను తీసుకెళ్లాం: ఎమ్మెల్యే కిలారు రోశయ్య
►కులం, మతం పార్టీ భేదం లేకుండా పారదర్శకంగా ప్రజలకుసంక్షేమ పథకాలను అందిస్తున్నాం
►ప్రతీ పథకంలోనూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇచ్చాం
►సచివాలయ వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలిచాం
►సచివాలయ భవన నిర్మాణాలకు ప్ర తిపక్షాలు అడ్డుపడుతున్నాయి: రామచంద్రారెడ్డి
►సచివాలయ సిబ్బంది స్పౌజ్ బదిలీ కేసులను సానుభూతితో పరిశీలించాలి.
►సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలు మారాయి: బూడి ముత్యాల నాయుడు
►సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు అన్నీ ప్రజల వద్దకే అందిస్తున్నాం
►సచివాలయాల్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం
► అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నాం
Time: 09: 20AM
►పేదలకు డీబీటీ ద్వారా ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నాం
►ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ అమలు చేశారు
►అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి
►ప్రతీ పథకంలోనూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇచ్చారు.
►సచివాలయ వ్యవస్థతో దేశానికే ఆదర్శంగా నిలిచాం
►సచివాలయాల ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం
►అసెంబ్లీలో కొనసాగుతున్న క్వశ్చన్ అవర్
సాక్షి, అమరావతి: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదలైన అసెంబ్లీలో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం పై చర్చించనున్నారు. అనంతరం వ్యవసాయ రంగంపై చర్చ జరగనుంది. ఇక శాసనమండలిలో స్కిల్ డెవెలప్‌మెంట్ స్కామ్‌పై సభ్యులు చర్చించనున్నారు. విద్యారంగంపైనా చర్చ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment