
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీగా మారింది. మండలిలో బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడికి దిగారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నలు కురిపించారు. 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. రూ. 5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
అయితే వరుదు కల్యాణి ప్రసంగిస్తుండగా హోంమంత్రి అనిత అడ్డుతగిలారు. వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మంత్రులు అనిత, సవిత, బాల వీరంజనేయులు ఆటంకం కలిగించారు. ఎమ్మెల్సీ కల్యాణిని సభలో మాట్లాడకుండా అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.
మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా మంత్రులే అభ్యంతరం తెలపడం ఏంటని ఆగ్రహించించారు.
వైస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలు పెట్టగా.. సంబంధం లేని సబ్జెక్ట్‌ను ఎందుకు తీసుకొచ్చారని బొత్స ప్రశ్నించారు. సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ ఆయన సూచించారు. దీంతో గందరగోళం నడుమ సభను చైర్మన్ రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment