
సాక్షి, రాజమండ్రి: టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూలే విగ్రహానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ మార్గాని భరత్ రామ్ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు బీసీ నేతలకు పార్లమెంట్ పదవులు ఇచ్చి గౌరవించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాసన మండలిలో టీడీపీ తీరును ఆయన ఎండగట్టారు. మండలిలో నిర్ణయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, శాసనసభ నిర్ణయమే అంతిమం అని తెలిపారు. (వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: తమ్మినేని)
ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారని స్పీకర్ ధ్వజమెత్తారు. అంతిమ నిర్ణయాలు ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో ఏర్పాటైన శాసనసభలోనే జరుగుతాయని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. (అందుకే వర్ల రామయ్యను బరిలోకి..)