Live Updates
AP Assembly Session: పేద ప్రజల కలలు నీరు కార్చిన కూటమి సర్కార్
- మండలిలో వైఎస్సార్‌సీపీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడ్డ మంత్రులు
- మెడికల్ కాలేజీల వ్యవహారంపై ఆవేశంతో ఊగిపోయిన మంత్రి సత్యదేవ్.. వైఎస్సార్‌సీపీ వాకౌట్
- మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వైఎస్సార్‌షీపీ ఎమ్మెల్సీలు
దీపం పథకం కోటి 50 లక్షల మంది లబ్ధిదారులని సివిల్ సప్లై మంత్రి ప్రకటించారు..
కేటాయించిన 896 కోట్లు ఎక్కడ సరిపోతాయి?
సంవత్సరానికి మూడు గ్యాస్ సిలెండర్ అని చెప్పారు.. 10 నెలల కాలంలో ఒకటి కేటాయించారు..
మేము అడిగిన ప్రశ్నకు మంత్రి సమాదానం చెప్పలేదు..
ఉచితం అంటే లబ్ది దారుల అకౌంట్ లో వేయాలి.. కానీ గ్యాస్ కంపెనీకి వేయడం అంటే మతలబు ఉంది
టీడీపీ MLA లకే అనుమానాలు ఉన్నాయి అంటే పధకం లోపభూయిష్టంగా ఉంది..
దీపం 2 పధకం అమలు చేయాలి..
మూడు సిలిండర్లు కి 4150 కోట్లు అవసరం అవుతుంది..
:::వరుదు కళ్యాణి
17 మెడికల్ కాలేజీల్లో 5 ప్రారంభించారు.. మిగిలినవి ఎప్పుడు ప్రారంభిస్తామని ప్రశ్నించాం
మెడికల్ కాలేజ్ లో ఏ మోడల్ అమలు చేస్తున్నారో చెప్పలేదు
1993 లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ తర్వాత.. వైఎస్ జగన్ వచ్చే వరకు మెడికల్ కాలేజ్ లు రాలేదు
మెడికల్ విద్య కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇతర దేశాలు వెళ్తున్నారని అలా జరగకూడదని జగన్ 17 కాలేజ్ లు ప్రాంభించారు..
జగన్ కి పేరు వస్తుందని 17 కాలేజ్ లపై నిర్లక్ష్యం వహిస్తున్నారు
750సీట్లు వస్తే వద్దని చంద్రబాబు కేంద్రానికి ఒక లేఖ రాశారు
మెడికల్ సీట్లపై నిర్లక్ష్య వైఖరికిగానే వాకౌట్ చేశాం
:::మొండితోక అరుణ్, వైస్సార్సీపీ MLC
మంత్రి గారు మెడికల్ కాలేజ్ పై ప్రశ్నిస్తే కించ పరుస్తూ మాట్లాడారు
మంత్రిగారి వైఖరికి నిరసనగా సభ వాకౌట్ చేశాం
నిధులు లేవనే పేరుతో పేద ప్రజల కలలు నీరు కార్చారు
మండలిలో మాట్లాడే అవకాశం లేకనే మీడియాతో మాట్లాడుతున్నాం
:::సిపాయి సుబ్రహ్మణ్యం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల వాకౌట్
- మెడికల్ కాలేజీల చర్చ సందర్భంగా శాసన మండలిలో గందరగోళం
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన మంత్రి సత్యకుమార్
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలపై ఊగిపోతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సత్యకుమార్
- నిరసనగా బయటకు వచ్చేసిన ఎమ్మెల్సీలు
మెడికల్ కాలేజీల చర్చ కాస్త రచ్చగా..
- శాసనమండలిలో రచ్చగా మారిన మెడికల్ కాలేజీలపై చర్చ
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలకు తగిన సమాధానం ఇవ్వలేకపోయిన ప్రభుత్వం
- మండలిలో ఊగిపోతూ మాట్లాడిన మంత్రి సత్య కుమార్
- మంత్రి వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నిరసన
- సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పాలి: ఎమ్మెల్సీ బొత్స
- మెడికల్ కాలేజీలకు నాబార్డు నుండి లోన్ తెచ్చాం: ఎమ్మెల్సీ బొత్స
- 50 శాతం కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదు: ఎమ్మెల్సీ బొత్స
- పులివెందుల మెడికల్ కాలేజి నిర్మాణం జరిగితే విమర్శించడం ఏంటి?: ఎమ్మెల్సీ బొత్స
- అందరిని రెచ్చగొట్టేలా.మంత్రి మాట్లాడటం సమంజసం కాదు: ఎమ్మెల్సీ బొత్స
- మంత్రి సత్య కుమార్ సభ ని తప్పుదోవ పట్టించారు: ఎమ్మెల్సీ బొత్స
- మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతున్నాం: ఎమ్మెల్సీ బొత్స
- మంత్రి సత్య కుమార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిరసన గా వాకౌట్ చేస్తున్నాం: ఎమ్మెల్సీ బొత్స
మెడికల్ కాలేజీల్లో గుజరాత్ ఫార్ములానా?
- మెడికల్ కాలేజీల నిర్మాణలపై ఎమ్మెల్సీ లక్ష్మణరావు మండిపాటు
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్ల ను నీటి కౌన్సెలింగ్ ద్వారా చెయ్యాలి
- మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వ మే పూర్తి చేస్తారా లేదా?: అరుణ్ కుమార్
- సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములా ని అనుసరిస్తున్నారు: అరుణ్ కుమార్
- గుజరాత్ ఫార్ములా ని అమలు చేస్తున్నారా..?: అరుణ్ కుమార్
పెన్షన్ మోసం మాటేంటి?
- 50 ఏళ్ల పైబడ్డ మహిళలకు పెన్షన్ పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రశ్న
- 50 ఏళ్ళు పైబడ్డ వారికి పెన్షన్ ఇస్తామని మోసం చేశారు
- బడ్జెట్ లో ఎక్కడ 50 ఏళ్ళు పైబడ్డ వారికి పెన్షన్ ఇస్తామన్నారు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి ఇస్తామని బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు
సున్నా వడ్డీ ప్రారంభించేది ఎప్పుడు?
- డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాల పై ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్న
- సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా
- గతంలో చంద్రబాబు 2016 లో సున్నా వడ్డీ ని నిలిపేశారు
- గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేస్తున్నారా లేదా చెప్పాలి
- డ్వాక్రా మహిళలకు 10 లక్షలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు
- ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు నుండి ప్రారంభిస్తుంది
- నిలదీసిన ఎమ్మెల్సీ లు కల్యాణి, సాయి కల్పలత
మండలిలో నీళ్లు నమిలిన మంత్రి నాదెండ్ల
- దీపం పథకం పై మండలి లో ఎమ్మెల్సీ లు వరుదు కల్యాణి, సాయి కల్పలత ఆగ్రహం
- దీపం పథకం లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా సమాధానం దాటవేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
- మంత్రి సమాధానం పై ఎమ్మెల్సీ లు వరుదు కల్యాణి, కల్పలత ఆగ్రహం
- దీపం 2 పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్ల ను ఎగనామం పెట్టడమా..?
- దీపం పథకం లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు..?
- 9 నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా..?
- కోటి 54 లక్షల మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదు
- లబ్ధిదారుల సంఖ్య ఎంతో చెప్పని మంత్రి నాదెండ్ల మనోహర్
- లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందే అని పట్టుబడిన ఎమ్మెల్సీలు
బాబూ.. లిక్కర్ కంట్రోల్ ఏది?
- మద్యం బెల్టు షాపులు పై శాసన మండలి లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ల ఆగ్రహం
- రాష్ట్రంలో విచ్చల విడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి
- నిబంధనలకు విరుద్ధం గా పర్మిట్ రూమ్ లు పెడుతున్నారు
- మద్యం అమ్మకాలు పై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారు
- నిలదీసిన ఎమ్మెల్సీ లు మాధవరావు, రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్
ముగిసిన ప్రశ్నోత్తరాలు
- ముగిసిన ప్రశ్నోత్తరాలు
- సమయభావం కారణముగా జీరో అవర్ రద్దు చేసిన స్పీకర్
- బడ్జెట్‌పై మూడో రోజు చర్చ ప్రారంభం
మండలిలో కొనసాగుతున్న నిరసన
- శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ నిరసన
- వాయిదా తీర్మానం తిరస్కరించడంతో నినాదాలు చేస్తున్న ఎమ్మెల్సీలు
- నిన్న సైతం సోషల్ మీడియా అరెస్ట్ తీర్మానం తిరస్కరణ.. ఆ వెంటనే ఆందోళన
- స్వల్ప వాయిదా అనంతరం బడ్జెట్ చర్చలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
- ఎమ్మెల్సీల ప్రసంగానికి అడ్డుతగిలిన మంత్రులు.. గందరగోళం
మంత్రులపై అయ్యన్న సీరియస్
- ఏపీ మంత్రులను కోప్పడిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
- సభకు ఆలస్యంగా రావడంపై మండిపడ్డ అయ్యన్న
- ప్రశ్నోత్తరాలను సీరియస్‌గా తీసుకోవాలంటూ మందలింపు
- ప్రశ్న సమయంలో ఓ మంత్రి లేకపోవడంతో అయ్యన్న ఆగ్రహం
- క్షమాపణ చెప్పి.. ఇంకోసారి ఆలస్యంగా రానని చెప్పిన సదరు మంత్రి
- మొదటిరోజు సమావేశాల్లో.. అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యేలపైనా అయ్యన్న సీరియస్
మండలి ప్రారంభమైన కాసేపటికే.. గందరగోళం
- ప్రారంభమైన ఏపీ శాసనమండలి
- పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల పై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీ లు వరుదు కల్యాణి, మంగమ్మ, కల్పలత
- వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ల వాయిదా తీర్మానం తిరస్కరించిన కౌన్సిల్
- వాయిదా తీర్మానం మండలి చైర్మన్ తిరస్కరించడంతో.. సభలో నినాదాలు
- తక్షణమే చర్చించాలని డిమాండ్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లు
అసెంబ్లీలో ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు
అసెంబ్లీలో ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు
బడ్జెట్‌పై చర్చ పక్కదారి
- బడ్జెట్‌పై చర్చను అడ్డుకున్న కూటమి నేతలు
- మండలిలో వైఎస్సార్‌సీపీని అడ్డుకున్న మంత్రులు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతుండగా.. మహిళా మంత్రుల్ని ఉసిగొల్పిన లోకేష్
- చర్చను పక్కదారి పట్టిస్తూ తన తల్లి ప్రస్తావన తెచ్చిన లోకేష్
- ఇవాళ అయినా చర్చ సజావుగా జరగాలని కోరుకుంటున్న వైఎస్సార్‌సీపీ
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
- నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- బడ్జెట్‌పై జరగనున్న చర్చ
- నిన్న మండలిలో బడ్జెట్‌పై చర్చ అడ్డుకున్న కూటమి