
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్ పేరిట సోమవారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మరోవైపు శాసనసభలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
