మీడియాతో మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, అమరావతి : నేతల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివేదిక తెప్పించుకున్నారన్నారు. శాసన మండలి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహించరని స్పష్టం చేశారు. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. (శాసన మండలిలో టీడీపీ హడావుడి)
ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెనకాడమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు వెల్లడించారు. నాయకులు ఒకరిపై మరొకరు సవాల్ విసురుకోవడం మానుకోవాలని హితవు పలికారు. నరసాపురంలో జరిగిన సంఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పెవరిది అనే దానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటుందని, పార్టీ అనుమతి లేనిదే ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే వర్తిస్తుందని తెలిపారు. సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు. (ఎన్‌ఆర్‌సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం)
ఎంపీ వ్యవహారం అందరూ చూశారు: ప్రసాదరాజు
ఎమ్మెల్యేలను పందులు గుంపుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు పోల్చడం సరికాదని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తించారని, ఇబ్బంది ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎంపీ వ్యవహారాన్ని అందరూ చూశారని, ధైర్యం ఉంటే ఆయనే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ లేకపోతే రఘురామ కృష్ణంరాజు గడ్డి పరకతో సమానమన్నారు. (‘ఎంతమందికి చికిత్స అయినా ప్రభుత్వం సిద్ధం’)
Comments
Please login to add a commentAdd a comment