
నిత్యావసర ధరలపై చర్చ జరపాలని కోరినఎమ్మెల్సీలు .. తిరస్కరించిన చైర్మన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర ధరలపై వైఎస్సార్‌సీపీ శాసనమండలిలో వాయిదా తీర్మానం కోరింది. శుక్రవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభమవగానే ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, మంగమ్మ, కల్పలతలు నిత్యావసర ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు.
పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు తమ స్థానాల వద్ద నిలబడి ఈ అంశంపై చర్చ జరపాలని మండలి చైర్మన్‌ను కోరగా, ప్రస్తుతం ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఇదే అంశంపై చర్చను కోరితే అనుమతి ఇస్తానంటూ హామీ ఇచ్చారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు, రఘువర్మలు ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల ఏర్పాటు కోరుతూ మరో వాయిదా తీర్మానం కోరగా, చైర్మన్ తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment