ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్య | two YSRCP leaders murdered | Sakshi
Sakshi News home page

ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్య

Published Mon, Apr 6 2015 1:59 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

two YSRCP leaders murdered

అనంతపురం జిల్లా: రాయలసీమలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా హతమార్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో సోమవారం ఈ హత్యలు జరిగాయి. ఎద్దుల దూలం లాగుడు పోటీలు జరుగుతుండగా వివిధ గ్రామాలకు చెందిన వారు అక్కడ చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీకి చెందిన రామసుబ్బారెడ్డి, లాలెప్పలను గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో హతమార్చి పరారయ్యారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. పాత కక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతులిద్దరూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా  తెలియాల్సి ఉంది.
(గుంతకల్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement