ఎమ్మెల్సీలుగా రామసుబ్బారెడ్డి, ఫరూక్‌ | Ramasubbareddy, Farooq as MLCs | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీలుగా రామసుబ్బారెడ్డి, ఫరూక్‌

Published Thu, Jul 27 2017 2:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

Ramasubbareddy, Farooq as MLCs

సాక్షి, అమరావతి: గవర్నర్‌ కోటాలో ఏపీ శాసనమండలి సభ్యులు(ఎమ్మెల్సీలు)గా నియమితులైన రామసుబ్బారెడ్డి(వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు), ఎన్‌ఎండీ ఫరూక్‌(కర్నూలు జిల్లా నంద్యాల)లతో మండలి ఇన్‌చార్జి చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం బుధవారం ప్రమాణం చేయించారు.

అనంతరం ఫరూక్‌ మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో టీడీపీ గెలుపు కోసం ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారని.. మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలోనే ఉండి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement