ప్రకాశం జిల్లాలో ముగ్గురి దారుణ హత్య | triple muder in prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో ముగ్గురి దారుణ హత్య

Published Tue, Jun 28 2016 2:10 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

ప్రకాశం జిల్లాలో ముగ్గురి దారుణ హత్య - Sakshi

ప్రకాశం జిల్లాలో ముగ్గురి దారుణ హత్య

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో ముగ్గురిని హతమార్చిన సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే పర్చూరు మండలం చెన్నుబొట్ల గ్రామానికి చెందిన కీర్తిపాటి రత్తయ్య కుటుంబానికి అదే గ్రామానికి చెందిన బోసు, శ్యాంసన్‌కు పాత కక్షలు ఉన్నాయి. గతంలో రత్తయ్య కొడుకుని బోసు శ్యాంసన్‌ కత్తితో పొడిచారు. దీంతో వారి కుటుంబాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గు మంటుంది. ఈ నేపథ్యంలో మేనత్త, మేనమామ, మేనల్లుడిపై ఇద్దరు అన్నదమ్ములు కత్తులతో తెగబడ్డారు. ముగ్గురిని వెంటాడి నడిరోడ్డుపై నరికి చంపారు. కాగా నిందితులు బోస్, శ్యామ్ సన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు రత్తయ్య, సుశీల, బాబు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెన్నబొట్లలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ ప్రేమ్ కాజల్ సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement