![Elderly Couple Domestic Help Found Dead In Vasant Enclave - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/23/MURDER.jpeg.webp?itok=phL0yHbs)
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆదివారం వసంత్ ఎన్‌క్లేవ్‌లోని వసంత్ అపార్ట్‌మెంట్‌లో వృద్ధ దంపతులతో పాటు పనిమనిషి విగతజీవులుగా పడిఉండటాన్ని కనుగొన్నారు. మృతులను విష్ణు మాధుర్, శశి మాధుర్, ఖుష్బూ నుతియల్‌గా గుర్తించారు. మృతులను దుండగులు గొంతుకోసి పాశవికంగా హత్య చేశారు.
బాధితులకు పరిచయం ఉన్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన ఇంట్లో చోరీ జరిగిన ఆనవాళ్లు లేకపోవడం గమనార్హం. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రాధమిక విచారణ ప్రకారం ఇది తెలిసిన వారి పనేనని అనుమానిస్తున్నామని డీసీపీ దేవేంద్ర ఆర్య వెల్లడించారు. విష్ణు మాధుర్, శశి మాధుర్‌లు ప్రభుత్వ ఉద్యోగలుగా పదవీవిరమణ చేశారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment