తనకు దొరికిన తిమింగలం వాంతి ముద్దతో సిరిపోర్న్ నియామ్రిన్
బ్యాంకాక్: వాంటింగ్.. కక్కు వినగానే ముఖం అదోలా పెడతాం. ఆ దృశ్యం చూడాలన్న కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కక్కుతో లక్కు కలిసొచ్చిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా. వాంతికి చేసుకుంటే.. అదృష్టం కలసిరావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి. థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపోర్న్ నియామ్రిన్(49) కొద్ది రోజుల క్రితం బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తోంది. సడెన్‌గా ఆమె కాళ్లకు ఏదో తగిలింది. సముద్రపు జీవి అనుకుంటూ కిందకు వంగి చూసింది. నీచు వాసన వస్తుండటంతో చేపల జాతికి చెందిన జీవిగా భావించింది. ధైర్యం చేసి పట్టుకోగా చేతికి గట్టగా తగిలింది.. దాంతో ఇది ఏదో విలువైన వస్తువే అయి ఉంటుందని భావించి.. దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లింది నియామ్రిన్.
ఇంటికి పక్కల వారిని పిలిచి.. తాను తీసుకొచ్చిన వస్తువు/పదార్థం ఏంటో గుర్తించాల్సిందిగా కోరింది నియామ్రిన్. వారు దాన్ని నిశితంగా పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. నియామ్రిన్ దరిద్రం తీరిపోయిందని.. త్వరలోనే ఆమె కోటీశ్వరురాలు కాబోతుందని తెలిపారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక నియామ్రిన్ తడబడింది. ఆ తర్వాత వారు చెప్పిన విషయం విని ఆమెకు షాక్‌తో నోట మాట రాకుండా పోయింది.
ఇంతకు నియామ్రిన్‌కు బీచ్‌లో దొరికిన వస్తువు ఏంటంటే తిమింగలం వాంటింగ్. కక్కిన తర్వాత అది ఇలా గట్టిగా మారిపోయింది. ఇక మార్కెట్‌లో తిమింగలం వాంతికి ఫుల్ డిమాండ్. భారీగా ధర పలుకుతుంది. ఇక నియామ్రిన్‌కు దొరికిన తిమింగలం వాంతి ముద్ద 12 ఇంచుల వెడల్పు, 24 ఇంచుల పొడవు ఉంది. దీని ధర సుమారు1.86 లక్షల పౌండ్లు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 1.8 కోట్ల రూపాయలు.
నియామ్రిన్ మాట్లాడుతూ ‘‘ఇది నిజంగా తిమింగలం వాంతేనా.. కాదా అనే విషయం గురించి చెప్పడానికి నిపుణులను ఆహ్వానించాను. ఇది నిజమైన తిమింగలం వాంతికే అంటే.. ఇక నా ఆర్థిక స్థితి ఎంతో మెరుగవుతుంది. దీన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో నా చుట్టు ఉన్న వారికి సాయం చేస్తాను. ఇది నాకు భారీగా డబ్బు ఇస్తుందని భావిస్తున్నాను. ప్రస్తుతం దీన్ని నా ఇంట్లోనే భద్రంగా దాచాను’’ అని తెలిపింది.
స్పెర్మ్ తిమింగలాలు వ్యవస్థలో ఈ వాంతికి తయారవుతుంది. దీనికి ఇంత డిమాండ్ ఎందుకంటే.. పర్‌ఫ్యూమ్స్ తయారిలో వినియోగిస్తారు. ఇలా తయారు చేసిన పర్‌ఫ్యూమ్స్ ఎక్కువ సేపు సువాసన వెదజల్లుతాయి.
Comments
Please login to add a commentAdd a comment