లక్నో: పాఠాలు నేర్పే గురువులు తమను వదిలి వెళ్తుంటే.. పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ అడ్డుకునే దృశ్యాలను చాలానే చూశాం.. చూస్తున్నాం. అదే సమయంలో ఆ వృత్తికి కళంకం తెస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. తరగతి గదిలో అదీ.. పిల్లలందరి ముందే ఓ టీచర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
స్టూడెంట్స్‌లోని ఓ పిల్లాడితో చేతులను మసాజ్ చేయించుకుంది. హాయిగా కుర్చీలో రిలాక్స్ అవుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో.. సదరు టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తర ప్రదేశ్ హర్దోయ్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఉర్మిలా సింగ్ ఆ స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తోంది. వీడియో వైరల్ అయిన వెంటనే ఆమెపై వేటు వేస్తూ జిల్లా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
వీడియో తనదాకా వచ్చిందని, ఆమెపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కానీ, ఆమె వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు ఉంటాయని చెప్పారు హర్దోయ్ విద్యాధికారి బీపీ సింగ్. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆమెను స్కూల్ నుంచి తొలగిస్తేనే.. తమ పిల్లలను బడికి పంపుతామంటూ ధర్నా చేపట్టారు అక్కడ.
Teacher having bicep Massage by students, Viral video from Hardoi UP govt school. pic.twitter.com/MF8lEQPvEZ
— Grading News (@GradingNews) July 27, 2022
ఇదీ చూడండి: ‘సార్.. ప్లీజ్ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’
Comments
Please login to add a commentAdd a comment