
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరిలో ఎవరి సినిమాలు విడుదలైన ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. బన్నీ, విజయ్‌ల ఫ్రెండ్‌షిప్ బహుమతులు ఇచ్చిపుచ్చుకునేంతగా పెరిగింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా నేడు(డిసెంబర్17) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్ అవ్వాలని అల్లు అర్జున్‌కు విజయ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ని పంపించాడు.
చదవండి: Pushpa Review : ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే.. ?
తన రౌడీ క్లబ్ క్లాతింగ్ నుంచి కస్టమైజ్‌డ్ చేయించిన బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్‌ను బన్నీకి బహుమతిగా అందించాడు. ‘రౌడీ లవ్స్ అల్లు అర్జున్’ అని ప్రత్యేకంగా ప్రింట్ చేయించి ఇచ్చాడు. ఇదే షర్ట్‌ను అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలైన సందర్భంగా తన కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లే సమయంలో వేసుకున్నాడు. విజయ్ పంపించిన షర్ట్‌తోపాటు, ఆల్ ద బెస్ట్ చెబుతూ రాసిన చిన్న లెటర్‌ను అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. థ్యాంక్యూ సో మచ్ బ్రదర్.. అంటూ పేర్కొన్నాడు.
చవండి: Pushpa Special Song: ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ పాటలే, దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్
కాగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పను రూపొందించారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం అనన్య పాండేతో కలిసి లైగర్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.
చదవండి: Ranbir Kapoor-Alia Bhatt: పెళ్లిపై స్పందించిన రణ్‌బీర్-అలియా భట్
Comments
Please login to add a commentAdd a comment