అల్లు అర్జున్‌కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ | Vijay Devarakonda Gifts Allu Arjun Ahead Pushpa 2 Release | Sakshi
Sakshi News home page

Allu Arjun: అప్పుడు ఇప్పుడు.. సేమ్ సీన్ రిపీట్

Published Fri, Nov 29 2024 7:30 AM | Last Updated on Fri, Nov 29 2024 9:55 AM

Vijay Devarakonda Gifts Allu Arjun Ahead Pushpa 2 Release

అల్లు అర్జున్ 'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి కాగా.. చివరి దశ ప్రమోషన్లలో టీమ్ అంతా ఫుల్ హడావుడిగా ఉంది. ఇలాంటి టైంలో బన్నీకి ఎప్పటిలానే క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. గతంలో పుష్ప తొలి భాగం రిలీజ్ టైంలో ఇచ్చినట్లే ఇప్పుడు మళ్లీ సీన్ రిపీట్ చేశాడు.

(ఇదీ చదవండి: పుష్ప 2: ఐదు కట్స్‌ చెప్పిన సెన్సార్‌ బోర్డ్‌.. నిడివి ఎంతంటే?)

తన సొంత 'రౌడీ' బ్రాండ్‌ కలెక్షన్స్‌ నుంచి అల్లు అర్జున్‌కి ఇప్పటికే పలుమార్లు విజయ్ దేవరకొండ డ్రస్సులు ఇచ్చాడు. ఇప్పుడు బన్నీ కోసం మరో బహుమతి పంపాడు. 'పుష్ప' పేరుతో ఉన్న టీ షర్ట్‌లను ఇచ్చాడు. దీంతో వాటిని ఫొటో తీసిన అల్లు అర్జున్.. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. 'నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు థ్యాంక్యూ' అని బన్నీ రాసుకొచ్చాడు. 'లవ్‌ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి' అని విజయ్‌ రిప్లై ఇచ్చాడు.

డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. రూ.1000 కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ అనే టాక్ నడుస్తోంది. ఇందుకు తగ్గట్లే పాట్నా, చెన్నై, కోచిలో భారీ స్థాయిలో ఈవెంట్స్ పెట్టారు. ముంబైలో శుక్రవారం ప్రెస్‌మీట్‌ జరగనుంది. డిసెంబరు 1న బెంగళూరులో ఈవెంట్ ఉంది. మరి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఉందా లేదా అనేది ప్రస్తుతానికి సందేహంగా ఉంది.

(ఇదీ చదవండి: 'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్‌ న్యూస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement