Customized manufacturing
-
కారు.. మేకోవర్ జోరు
దేశంలో యువ తరంగం ఇప్పుడు లగ్జరీ కారును కొనుగోలు చేయాలన్న తమ కలను సాకారం చేసుకోవడంతోనే సరిపెట్టడం లేదు. తమకు నచ్చినట్టుగా దాన్ని ముస్తాబు చేయడం కోసం లక్షల్లో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కోరుకున్నట్లుగా కారును కస్టమైజ్ చేసుకోవడానికి సై అంటున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా ఎలా కావాలంటే అలా.. ఏది కావాలంటే అది నేరుగా ప్లాంట్లలోనే మార్పుచేర్పులు చేసి కస్టమర్ల చెంతకు చేరుస్తున్నాయి. తాజాగా ఆడి ఇండియా భువనేశ్వర్‌లో ఒక కారు కొనుగోలుదారు కోసం ‘ఆర్ఎస్ క్యూ8’లో 17 రకాల మార్పులు చేసి మరీ అందించడం విశేషం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకమైన పెయింట్ షేడ్. ‘జావా గ్రీన్‘గా పిలిచే ఈ పెయింట్ వర్క్ ఒక్కదానికే కస్టమర్ ఏకంగా రూ. 12.29 లక్షలు వెచి్చంచడం మేకోవర్ మేనియాకు నిదర్శనం. ఇక కోయంబత్తూరుకు చెందిన మరో యువ కార్ లవర్... ఆడి ఫ్లాగ్íÙప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ‘ని ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నాడు. దీనికి కార్బన్ ఫైబర్ రూఫ్, మ్యాట్రిక్స్ డిజైన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ (లైట్ బీమ్ ఫర్ఫెక్ట్గా పడేందుకు ఒక్కో హెడ్‌ల్యాంప్‌లో 10 లక్షల మైక్రో మిర్రర్లు ఉంటాయి), ఆల్–కాంటారా టెక్స్‌టైల్‌తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి పలు రకాల హంగులను జోడించేందుకు పెట్టిన ఖర్చు రూ. 36 లక్షలు. ముంబైలో మెర్సిడెజ్ బెంజ్ జీ400డీ / ఏఎంజీ జీ63 మోడళ్లకు చెందిన మూడు కార్లను 30కి పైగా కస్టమైజేషన్లతో విక్రయించింది. ఈ మార్పుల కోసం కొనుగోలుదారులు జస్ట్ రూ.1.5 కోట్లు ధారపోశారట! యువ కస్టమర్ల హల్ చల్ అరుదైన పెయింట్ వర్క్ దగ్గర నుంచి ప్రత్యేకంగా చేతితో మలిచిన లెదర్ ఇంటీరియర్స్. నచ్చిన పరికరాలు, న్యూమరాలజీ, జ్యోతిష నమ్మకాలకు అనుగుణంగా స్పెషల్ రిజి్రస్టేషన్ నంబర్ ఇలా ప్రతిదీ సరికొత్త లగ్జరీయే. ‘జీ–వ్యాగన్స్‌లో 70%, మేబ్యాక్ మోడళ్లలో 74% కస్టమర్లు కోరుకున్న మార్పులతోనే అమ్ముడవుతున్నాయి. రంగులు, మెటీరియల్, ఫ్యాన్సీ నంబర్లు ఇలా తమ అభిరుచులకు అదనంగా చెల్లించేందుకు మా కొనుగోలుదారులు ఎప్పుడూ సిద్ధమే’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డీ సంతోష్ అయ్యర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ డిమాండ్‌కు తోడు ఇప్పుడు దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ యువరక్తంతో పరవళ్లు తొక్కుతోంది. మెర్సిడెస్ బెంజ్ భారతీయ కస్టమర్ల సగటు వయస్సు 38 ఏళ్లే. ప్రపంచవ్యాప్తంగా మనోళ్లే ఈ కంపెనీకి యువ కొనుగోలుదారులు కావడం మరో విశేషం. ’కస్టమర్లు ప్రత్యేకతకు పెద్దపీట వేస్తున్నారు. తమ కార్లను వ్యక్తిత్వ చిహ్నంగా భావిస్తున్నారు’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ «థిల్లాన్ చెబుతున్నారు. ఆడి భారతీయ కస్టమర్లు తమ కార్లలో హంగుల కోసం రూ. 70 లక్షల వరకు వెచి్చస్తున్నారు. ఇక మెర్సిడెస్ బెంజ్ విషయానికొస్తే, మేబ్యాక్, ఏఎంజీ వంటి టాప్–ఎండ్ మోడళ్ల కస్టమర్లు కారు ధరలో 20% కస్టమైజేషన్‌కు వెచ్చి స్తున్నారు. బీఎండబ్ల్యూ కస్టమర్లు రూ. 50 లక్షల వరకూ ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ మోడల్స్‌లో చాలా కార్ల ప్రారంభ ధర రూ. 1.5 కోట్లు పైనే. కార్తీక్.. హైదరాబాద్‌లో యువ వ్యాపారవేత్త. కొత్తగా లగ్జరీ కారు కొన్నాడు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? కారు కోసం రూ. 1.5 కోట్లు ఖర్చుపెడితే.. అందులో తన అభిరుచికి తగ్గట్టుగా రకరకాల హంగులను జోడించడం కోసం సదరు కార్ల కంపెనీకి రూ. 50 లక్షలు చెల్లించాడు! కార్ల కస్టమైజేషన్ క్రేజ్‌కు ఇది జస్ట్ చిన్న ఉదాహరణ మాత్రమే... -
పుష్ప మూవీ: బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపించిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరిలో ఎవరి సినిమాలు విడుదలైన ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. బన్నీ, విజయ్‌ల ఫ్రెండ్షిప్ బహుమతులు ఇచ్చిపుచ్చుకునేంతగా పెరిగింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా నేడు(డిసెంబర్17) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా బ్లాక్బాస్టర్ హిట్ అవ్వాలని అల్లు అర్జున్‌కు విజయ్ సర్ప్రైజ్ గిఫ్ట్‌ని పంపించాడు. చదవండి: Pushpa Review : ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే.. ? తన రౌడీ క్లబ్ క్లాతింగ్ నుంచి కస్టమైజ్డ్ చేయించిన బ్లాక్ కలర్ స్వెట్‌షర్ట్‌ను బన్నీకి బహుమతిగా అందించాడు. ‘రౌడీ లవ్స్ అల్లు అర్జున్’ అని ప్రత్యేకంగా ప్రింట్ చేయించి ఇచ్చాడు. ఇదే షర్ట్‌ను అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలైన సందర్భంగా తన కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లే సమయంలో వేసుకున్నాడు. విజయ్ పంపించిన షర్ట్‌తోపాటు, ఆల్ ద బెస్ట్ చెబుతూ రాసిన చిన్న లెటర్‌ను అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. థ్యాంక్యూ సో మచ్ బ్రదర్.. అంటూ పేర్కొన్నాడు. చవండి: Pushpa Special Song: ఐటెం సాంగ్స్ అన్ని నాకు డివోషనల్ పాటలే, దేవిశ్రీ షాకింగ్ కామెంట్స్ కాగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పను రూపొందించారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం అనన్య పాండేతో కలిసి లైగర్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. చదవండి: Ranbir Kapoor-Alia Bhatt: పెళ్లిపై స్పందించిన రణ్‌బీర్-అలియా భట్ -
ఉల్క శకలాలతో తయారుచేసిన ఈ అరుదైన ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా..!
సాధారణంగా మనం తీసుకున్న స్మార్ట్ఫోన్లకు రక్షణ కోసమో, లేదా మరింత అందాన్ని స్మార్ట్ఫోన్లకు తీసుకరావడానికి వివిధ రకాల మొబైల్ కవర్స్‌తో మన ఫోన్లను ముస్తాబు చేస్తాం. లగ్జరీ వర్షన్ స్మార్ట్ఫోన్లకు మరింత అందాన్ని తేవడంకోసం కస్టమైజ్డ్ డిజైన్లతో స్మార్ట్ ఫోన్‌కు మరింత లూక్ వస్తోంది. స్మార్ట్ఫోన్లకు కస్టమైజ్డ్ లూక్‌ను తీసుకురావడంలో, అందంగా మొబైల్ కేసులను తయారుచేయడంలో కేవియర్ దిట్ట. కాగా తాజాగా కస్టమైజ్డ్ లూక్‌తో డిజైన్ చేసిన ఐఫోన్ ఫస్ట్ లూక్‌ను కేవియర్ ఆవిష్కరించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఉల్క శకలాలు, విలువైన లోహాలు, ఖరీదైన స్టోన్లను ఉంచాలని కంపెనీ యోచిస్తోంది. ఈ లగ్జరీ బ్రాండ్ లైనప్‌కు “పరేడ్ ఆఫ్ ది ప్లానెట్స్”గా పేరు పెట్టారు. అంతరిక్ష నౌకలకు వాడే టైటానియం లోహంతో ఐఫోన్ బ్యాక్‌ను కవర్ చేయనున్నారు. అంతేకాకుండా డబుల్ గోల్డ్ ప్లేటింగ్‌తో తయారుచేయబడిన గోల్డెన్ వెర్షన్ ఫోన్‌ను కూడా లాంచ్ చేశారు. ఐఫోన్ మోడళ్ల ధర $ 14,290 (సుమారు రూ. 10.60 లక్షలు)నుంచి మొదలవుతుంది. టైటానియంతో చేసిన మోడల్ ధర $ 12,750 (సుమారు రూ. 9.46 లక్షలు) గా కేవియర్ నిర్ణయించింది. ఈ మోడళ్లకు సంబంధించిన వీడియోను కూడా కంపెనీ రిలీజ్ చేసింది. చదవండి: ఆవిష్కరణ: ప్లాస్టిక్ అవుతుంది వెనీలా ఫ్లేవర్! -
‘యారో’ హీరో..
నగరవాసి రూపొందించిన బైక్ జాతీయస్థాయి పోటీల్లో గుర్తింపు పొందింది. సిటీ యూత్ కస్టమైజ్డ్ బైక్స్ మోజును చాటిచెప్పింది. కస్టమైజ్డ్ బైక్స్‌కు సంబంధించి ‘ఇండియా బైక్ వీక్’ (ఐబీడబ్ల్యూ) పోటీ ఇటీవల గోవాలో జరిగింది. ఇందులో సిటీకి చెందిన మోహిత్ చావ్డా అండ్ టీమ్ రూపొందించిన ‘యారో’ బైక్ ది బెస్ట్‌గా నిలిచి ‘బిల్డ్ ఆఫ్ విన్నర్’ ట్రోఫీ అందుకుంది. ఆ బైక్ కథా కమామీషు... లక్షల ఖరీదైన బైక్స్ సిటీ రోడ్స్ మీద దౌడ్ తీయడం సర్వసాధారణమైపోయింది. సిటీజనులు ఇప్పుడు బైక్ ఎంత ఖరీదైందని చూడడం లేదు. ఎంత వైవిధ్యంగా ఉందనే చూస్తున్నారు. దీంతో కస్టమైజ్డ్ బైక్స్‌కి ప్రాధాన్యత పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమైజ్డ్ బైక్స్‌కు సంబంధించిన జాతీయస్థాయి కాంటెస్ట్ ఇటీవల గోవాలో జరిగింది. ఈ పోటీలో నగరవాసి రూపొందించిన బైక్ ‘బిల్డ్ ఆఫ్ విన్నర్’ ట్రోఫీ అందుకుంది. సిటీకి ఈ ట్రోఫీ దక్కడం ఇదే తొలిసారి. దీంతో బైక్‌ల వాడకంలోనే కాదు... బైక్స్‌ను సృష్టించడంలోనూ ముందున్నామని నిరూపించింది సిటీ. ఇండియా బైక్ వీక్ (ఐబీడబ్ల్యూ)... ఆసియాలోనే అతి పెద్ద బైకర్స్ ఈవెంట్. ఈ ఈవెంట్ ప్రతిఏటా గోవాలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల బైక్‌లు, వాటి యాక్ససరీస్ విక్రయ సంస్థలు, పోటీలు, అదరగొట్టే రాక్షోస్, విందు వినోదాల వేదిక ఈ ఈవెంట్. నవంబరు నెలాఖరులో గోవాలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కి 20వేల మంది వరకు హాజరైతే... ఈసారి కూడా నగరవాసులు పెద్ద సంఖ్యలోనే వెళ్లారు. ఇందులో కస్టమైజ్డ్ బైక్స్‌కి సంబంధించిన కాంటెస్ట్‌లో నగరవాసి సృష్టించిన బైక్ ‘యారో’ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో బైక్‌ను క్రియేట్ చేసిన మోహిత్ చావ్డా అండ్ టీమ్ తమ బైక్ విశేషాలను ‘సాక్షి’తో పంచుకుంది. వైవిధ్యమే గుర్తింపు.. ఈ బైక్‌ను డిజైన్ చేసిన మాదాపూర్ నివాసి మోహిత్ 2014లో డెక్కన్ కస్టమ్ మోటార్ సైకిల్స్‌తో ప్రారంభించి, ఇప్పుడు నిజాంపేటలో 36 మోటోను ప్రత్యేకంగా కస్టమైజ్డ్ బైక్స్ కోసం నెలకొల్పారు. ‘బుర్రలో తిరిగే ఆలోచనల్ని ఆవిష్కరించడమే మోటార్ సైకిళ్ల రూపకల్పన. మనం ఎప్పుడు వైవిధ్యంగా ఏది సృష్టించినా నిస్సందేహంగా దానికి గుర్తింపు వస్తుంది’ అంటారు మోహిత్. ఈ బైక్‌ని విక్రయిస్తారా? అంటే ఆఫర్‌ని బట్టి ఆలోచిస్తామన్నారు. ఈ బైక్ సిటీ రోడ్ల మీద కనిపిస్తే కంగ్రాట్స్ చెప్పడం మరచిపోకండి. కేవలం 23 రోజుల్లో. ‘రెంచ్ అనేది మా పెయింట్ బ్రష్. రా స్టీల్ కాన్వాస్. కస్టమైజ్డ్ బైక్స్ ప్రదర్శించేందుకు ఐబీడబ్ల్యూ కరెక్ట్ వేదిక. ఆ విషయం తెలిసి వెంటనే మేం అనుకుంటున్న డిజైన్‌తో ఎంట్రీ పంపించాం. అలా దేశవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల నుంచి షార్ట్ లిస్ట్ చేశారు. ఈ పోటీలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటేమో మోడిఫైడ్ బైక్స్.. అంటే ఉన్న బైక్స్‌ని కొత్తగా తీర్చిదిద్డడం. రెండోది అతి క్లిష్టమైంది బిల్డ్ ఆఫ్... అంటే పూర్తిగా కొత్త బైక్‌ని క్రియేట్ చేయడం. ఈ విభాగంలో మాకు అవకాశం దక్కింది. దాంతో పని ప్రారంభించి కేవలం 23 రోజుల్లోనే ‘యారో’ని సృష్టించి, బిల్డ్ ఆఫ్ విన్నర్ ట్రోఫీ గెలుచుకున్నాం. మా బృందంలో మహ్మద్ అబూ సుఫియాన్, గౌతమ్ (ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్), సయ్యద్ జైన్, సయ్యద్ అల్తాఫ్ (మెకానికల్), ప్రీతమ్ (డిజైనింగ్, బ్రాండింగ్), దేవిరెడ్డి, సంతోష్, జగ్మీత్ సింగ్ సభ్యులు. మేం రూపొందించిన కేఫ్ రేసర్ స్టైల్ బైక్ కోసం 1985 యమహా ఆర్డీ 350 టార్క్‌ని వాడాం. క్రియేట్ చేసిన బైక్‌లో ఇంజిన్, ఛాసిస్ మాత్రమే పునర్వినియోగం అయ్యాయి. మిగిలినవన్నీ మేం తయారు చేసినవేన’ని చెప్పారు బైక్ డిజైనర్ మోహిత్ చావ్డా. -
మీ షాపింగ్ మీ ఇష్టం..!
► కోరుకున్నట్టు వస్త్రాలు, నగలకు ‘బుజ్జు.కామ్’ ► అవసరాలు, అభిరుచుల మేరకు కస్టమైజ్డ్ తయారీ ► యూకే, సింగపూర్, కెనడాలకూ త్వరలో విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్లైన్ షాపింగ్ అంటే అందరికీ సరదానే. కాకపోతే ఆన్లైన్లో ఉన్న వస్త్రాలు, నగల వంటి వాటిలో మనకు నచ్చిన వాటిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. కస్టమైజ్డ్ నగల కోసం బ్లూస్టోన్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లున్నా అవి ఆభరణాలకే పరిమితం. కాకపోతే హైదరాబాదీ స్టార్టప్ ‘బుజ్జు.కామ్’లో మాత్రం.. మన అవసరాలు, అభిరుచులను చెప్పేస్తే వస్త్రాలు, నగలు అన్నీ కస్టమైజ్డ్వి పొందొచ్చు. అంతేకాదు. మన అవసరాలు, అభిరుచులు చెబితే వాటిని బట్టి మనకు ఎలాంటి నగలు, వస్త్రాలు సెట్ అవుతాయో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ తరవాత వాటిని డిజైన్ చేయించుకోవచ్చు. బుజ్జు.కామ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నరేంద్ర రెడ్డి మాటల్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్ గురించి మరిన్ని వివరాలు... అందంతో పాటు పరిపూర్ణమైన వస్త్రాలు, నిండైన ఆభరణాలు ఉంటేనే మహిళలకు నిజమైన సౌందర్యం వస్తుందనేది నా అభిప్రాయం. అందుకే మన కట్టు, బొట్టును విదేశీయులూ గౌరవిస్తారు. ఈ సౌందర్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకే ఏడాదిన్నర క్రితం రూ.1.2 కోట్ల పెట్టుబడులతో బుజ్జు.కామ్‌ను ప్రారంభించాం. సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలుదారుల అభిరుచి, అవసరాల మేరకు ట్రెండ్‌కు తగ్గట్టుగా డిజైన్ చేసివ్వడమే ‘బుజ్జు.కామ్’ ప్రత్యేకత. కొనుగోలు చేసిన ఉత్పత్తులను బంధుమిత్రులు, స్నేహితులతో పంచుకొని వారి చేత కూడా షాపింగ్ చేయిస్తే వారికి బజ్ పాయింట్లు ఇచ్చి.. వారు ఆ తరవాత చేసే కొనుగోళ్లలో డిస్కౌంట్లు ఇస్తాం. ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ గిఫ్ట్‌లను కూడా అందజేస్తాం. విస్తరణ బాటలో.. ఈ ఏడాది ముగింపు నాటికి సింగపూర్, కెనడా, యూకే దేశాల్లోనూ బుజ్జు.కామ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకోసం నిధుల సమీకరణపై దృష్టి సారించాం. త్వరలోనే బుజ్జు.కామ్‌లో పిల్లలు, పురుషుల దుస్తులు, పాదరక్షలను కూడా విక్రయిస్తాం. ఎక్స్‌క్లూజివ్ డిజైన్లు.. మన దేశంతో పాటు అమెరికాలో కూడా బుజ్జు.కామ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో 10 వేల మంది, అమెరికాలో 4 వేల మంది రిపీటెడ్ కస్టమర్లున్నారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో మహిళలకు సంబంధించిన చీరలు, చుడీదార్లు, డిజైనర్ వస్త్రాలతో పాటు ఆభరణాలనూ కొనుగో లు చేసే వీలుంది. పోచంపల్లి, గద్వాల్, కొత్తకోట, నారాయణగిరి, ధర్మవరం, ఉప్పాడ, కేరళ, కల కత్తా, కాంచీపురాలకు చెందిన వస్త్రాలు మా సైట్లో లభిస్తాయి. ఇతర షాపింగ్ సైట్లతో పోలిస్తే బుజ్జు.కామ్‌లో 50% ధర తక్కువగా ఉంటుంది. వస్త్రాలు, నగల తయారీదారులతో నేరుగా ఒప్పందం చేసుకోవడం వల్లే ఇది సాధ్యమయింది. ఎక్స్‌క్లూజివ్ డిజైన్లను అందించేందుకు ఆప్కో, పోచంపల్లి సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాం.