ఖర్చెంతైనా సై!
లగ్జరీ కార్లలో హంగులకు లక్షల్లో ఖర్చు..
భారతీయ యువతరం నయా ట్రెండ్...
అరుదైన పెయింట్ నుంచి అదిరిపోయే ఇంటీరియర్ల వరకు..
కొత్తదనం కోసం పరితపిస్తున్న కస్టమర్లు
చిన్న నగరాల్లోనూ కస్టమైజేషన్ క్రేజ్
దేశంలో యువ తరంగం ఇప్పుడు లగ్జరీ కారును కొనుగోలు చేయాలన్న తమ కలను సాకారం చేసుకోవడంతోనే సరిపెట్టడం లేదు. తమకు నచ్చినట్టుగా దాన్ని ముస్తాబు చేయడం కోసం లక్షల్లో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కోరుకున్నట్లుగా కారును కస్టమైజ్ చేసుకోవడానికి సై అంటున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా ఎలా కావాలంటే అలా.. ఏది కావాలంటే అది నేరుగా ప్లాంట్లలోనే మార్పుచేర్పులు చేసి కస్టమర్ల చెంతకు చేరుస్తున్నాయి.
తాజాగా ఆడి ఇండియా భువనేశ్వర్‌లో ఒక కారు కొనుగోలుదారు కోసం ‘ఆర్‌ఎస్ క్యూ8’లో 17 రకాల మార్పులు చేసి మరీ అందించడం విశేషం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకమైన పెయింట్ షేడ్. ‘జావా గ్రీన్‘గా పిలిచే ఈ పెయింట్ వర్క్ ఒక్కదానికే కస్టమర్ ఏకంగా రూ. 12.29 లక్షలు వెచి్చంచడం మేకోవర్ మేనియాకు నిదర్శనం. ఇక కోయంబత్తూరుకు చెందిన మరో యువ కార్ లవర్... ఆడి ఫ్లాగ్íÙప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఆర్‌ఎస్ ఈ–ట్రాన్ జీటీ‘ని ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నాడు.
దీనికి కార్బన్ ఫైబర్ రూఫ్, మ్యాట్రిక్స్ డిజైన్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ (లైట్ బీమ్ ఫర్ఫెక్ట్‌గా పడేందుకు ఒక్కో హెడ్‌ల్యాంప్‌లో 10 లక్షల మైక్రో మిర్రర్లు ఉంటాయి), ఆల్–కాంటారా టెక్స్‌టైల్‌తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి పలు రకాల హంగులను జోడించేందుకు పెట్టిన ఖర్చు రూ. 36 లక్షలు. ముంబైలో మెర్సిడెజ్ బెంజ్ జీ400డీ / ఏఎంజీ జీ63 మోడళ్లకు చెందిన మూడు కార్లను 30కి పైగా కస్టమైజేషన్లతో విక్రయించింది. ఈ మార్పుల కోసం కొనుగోలుదారులు జస్ట్ రూ.1.5 కోట్లు ధారపోశారట!
యువ కస్టమర్ల హల్ చల్
అరుదైన పెయింట్ వర్క్ దగ్గర నుంచి ప్రత్యేకంగా చేతితో మలిచిన లెదర్ ఇంటీరియర్స్. నచ్చిన పరికరాలు, న్యూమరాలజీ, జ్యోతిష నమ్మకాలకు అనుగుణంగా స్పెషల్ రిజి్రస్టేషన్ నంబర్ ఇలా ప్రతిదీ సరికొత్త లగ్జరీయే. ‘జీ–వ్యాగన్స్‌లో 70%, మేబ్యాక్ మోడళ్లలో 74% కస్టమర్లు కోరుకున్న మార్పులతోనే అమ్ముడవుతున్నాయి. రంగులు, మెటీరియల్, ఫ్యాన్సీ నంబర్లు ఇలా తమ అభిరుచులకు అదనంగా చెల్లించేందుకు మా కొనుగోలుదారులు ఎప్పుడూ సిద్ధమే’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డీ సంతోష్ అయ్యర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
ఈ డిమాండ్‌కు తోడు ఇప్పుడు దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ యువరక్తంతో పరవళ్లు తొక్కుతోంది. మెర్సిడెస్ బెంజ్ భారతీయ కస్టమర్ల సగటు వయస్సు 38 ఏళ్లే. ప్రపంచవ్యాప్తంగా మనోళ్లే ఈ కంపెనీకి యువ కొనుగోలుదారులు కావడం మరో విశేషం. ’కస్టమర్లు ప్రత్యేకతకు పెద్దపీట వేస్తున్నారు. తమ కార్లను వ్యక్తిత్వ చిహ్నంగా భావిస్తున్నారు’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ «థిల్లాన్ చెబుతున్నారు. ఆడి భారతీయ కస్టమర్లు తమ కార్లలో హంగుల కోసం రూ. 70 లక్షల వరకు వెచి్చస్తున్నారు. ఇక మెర్సిడెస్ బెంజ్ విషయానికొస్తే, మేబ్యాక్, ఏఎంజీ వంటి టాప్–ఎండ్ మోడళ్ల కస్టమర్లు కారు ధరలో 20% కస్టమైజేషన్‌కు వెచ్చి స్తున్నారు. బీఎండబ్ల్యూ కస్టమర్లు రూ. 50 లక్షల వరకూ ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ మోడల్స్‌లో చాలా కార్ల ప్రారంభ ధర రూ. 1.5 కోట్లు పైనే.
కార్తీక్.. హైదరాబాద్‌లో యువ వ్యాపారవేత్త. కొత్తగా లగ్జరీ కారు కొన్నాడు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? కారు కోసం రూ. 1.5 కోట్లు ఖర్చుపెడితే.. అందులో తన అభిరుచికి తగ్గట్టుగా రకరకాల హంగులను జోడించడం కోసం సదరు కార్ల కంపెనీకి రూ. 50 లక్షలు చెల్లించాడు! కార్ల కస్టమైజేషన్ క్రేజ్‌కు ఇది జస్ట్ చిన్న ఉదాహరణ మాత్రమే...
Comments
Please login to add a commentAdd a comment