modifications work
-
ఈయూ అనుభవం నేర్పే పాఠాలు
జన్యుమార్పిడి(జీఎం) పంటలపై కేంద్రప్రభుత్వం ఆమోదయోగ్యమైన విధానాన్ని తేవాలని సుప్రీంకోర్టు కోరింది. జీఎం పంటలను చాలా రాష్ట్రాల వ్యవ సాయ సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మనుషులు, జంతువులు, మొక్కల మీద వీటి ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం, జీఎం జనరే టర్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ పంటలను సులభంగా ఆమోదించడానికి దూరంగా ఉన్నాయి. ఒకనాటి హరిత విప్లవం ఫలితంగా ఉత్పాదకత పెరిగింది. కానీ ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే జీఎం సాంకేతికతకు సంబంధించిన ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.జన్యుమార్పిడి పంటలపై ఒక జాతీయ విధానాన్ని రూపొందించాలని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను ఇటీవల సుప్రీంకోర్టు కోరింది. గత రెండు దశాబ్దాలుగా దేశంలో జన్యుమార్పిడి పంటల ప్రవేశాన్ని సంశయవాదులు అడ్డుకోగలిగారు. పర్యావరణం, వ్యవ సాయ వైవిధ్యం, మానవులు, జంతువుల ఆరోగ్యంపై జన్యుమార్పిడి పంటల ప్రభావాలపై 18 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ సంఘాల నాయకులు గత వారం ఒక జాతీయ సదస్సును నిర్వహించారు. జన్యుమార్పిడి పంటలను వారు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారు.జన్యుమార్పిడి జీవులకు సంబంధించి తగిన ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించడానికి భారతదేశం పోరాడుతోంది. యూరో పియన్ యూనియన్(ఈయూ) తన సభ్య దేశాలలో జన్యుమార్పిడి ఉత్పత్తులు, విత్తనాల ప్రవేశాన్ని నియంత్రించడానికి చాలా కాలం కుస్తీ పట్టింది. సమగ్రమైనది కానప్పటికీ, మంచి విధానాన్నిరూపొందించగలిగింది. ఇది భారత్‌కు పాఠాలను అందిస్తుంది.ప్రపంచం ఇప్పటివరకు మూడు ‘హరిత విప్లవాలను’ చూసిందని వ్యవసాయ వృద్ధి చరిత్ర చెబుతోంది. మొదటిది 1930లలో యూరప్, ఉత్తర అమెరికాలో ప్రారంభమైంది. ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, వ్యవసాయ నిర్వహణను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఇది మొక్కజొన్న, ఇతర సమశీతోష్ణ వాతా వరణ పంటలలో త్వరిత దిగుబడిని పెంచింది. రెండో హరిత విప్లవం కొన్ని భారతీయ రాష్ట్రాలతోపాటు 1960లు, 1970లలో చోటు చేసు కుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ఉష్ణమండలంలోపండించే పంటలకు అదే విధమైన సాంకేతికతను బదలాయించింది. స్థానిక పరిశోధనలను ఉపయోగించడం ద్వారా ఈ సాంకేతికతలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి.జన్యుమార్పిడి ఉత్పత్తులు, ముఖ్యంగా వ్యవసాయంలో జన్యు ఇంజినీరింగ్ ఉపయోగించి ఉత్పత్తి చేసిన విత్తనాలు 1970లలో కని పించాయి. వీటిని 1990లలో ప్రధానంగా ఉత్తర అమెరికాలో వాణిజ్యీ కరించారు. ఈ సాంకేతికతను ప్రబోధించినవారు వ్యవసాయ ఉత్పాద కతలో ఇది మరొక అపారమైన పెరుగుదలకు దారితీస్తుందనీ, ఆహార సరఫరాలో గుణాత్మక మెరుగుదలను అందజేస్తుందనీ పేర్కొన్నారు. మొదటి రెండు హరిత విప్లవాలకూ, మూడవ దానికీ మధ్య ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, నిశ్చయాత్మకమైన కుతూహలంతో దీనిని ప్రపంచం స్వీకరించలేదు. మానవులు, జంతువులు, మొక్కల ఆరోగ్యంపై ఈ సాంకేతికతలోని ప్రతికూల ప్రభావాలపై ఎన్నో సందేహాలు ఉన్నాయి.అందుకే వీటి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రమైన నియంత్రణలను రూపొందించాయి. అయితే అమెరికా, కెనడా, అర్జెంటీనా, బ్రెజిల్ చాలా వరకు వ్యవసాయ బయోటెక్ అను వర్తనాలను అనుమతించాయి. భారత్‌తో సహా చాలా ఇతర దేశాలు ఈ విషయంలో సరైన మార్గం కోసం పోరాడుతున్నాయి.యూరోపియన్ దేశాలు ఈ సాంకేతికతను మొట్టమొదట గట్టిగా వ్యతిరేకించి, తర్వాత తీవ్రమైన నియంత్రణ విధానాన్ని అనుసరించాయి. చాలా యూరోపియన్ ప్రభుత్వాలు, యూరోపియన్ యూని యన్ కూడా జన్యుమార్పిడి జీవులతో ముడిపడి ఉన్న ప్రమాదాల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడా నికి బదులుగా ముందు జాగ్రత్త విధానాన్ని స్వీకరించాయి.ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం, ‘అదే’ తరహా ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలంటే, బలమైన శాస్త్రీయ సాక్ష్యం అవసరమని అమెరికా వాదిస్తోంది (అదే తరహా ఉత్పత్తిఅంటే నేరుగా పోటీ పడే లేదా ప్రత్యామ్నాయ ఉత్పత్తి). దిగుమతి దారులు లేదా దిగుమతి చేసుకునే దేశాలు తప్పనిసరిగా జీఎం విత్తనం లేదా ఉత్పత్తి మానవ లేదా జంతువు లేదా మొక్కల ఆరోగ్యానికి సుర క్షితం కాదని తిరస్కరించలేని శాస్త్రీయ ఆధారాలను అందించాలి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విత్తనం లేదా ఉత్పత్తి ‘సురక్షి తమైనది’ అని రుజువు చేయాల్సిన బాధ్యత జీఎం విత్తన ఉత్పత్తిదారు లపై లేదా దాని ఎగుమతిదారులపై లేదు; అది ‘సురక్షితం కానిది’ అని నిరూపించాల్సిన బాధ్యత దిగుమతిదారులపై ఉంది. మరో మాటలో చెప్పాలంటే, సురక్షితమని నిరూపించడం విక్రేత బాధ్యత కాదు, అది కొనుగోలుదారు బాధ్యత. కాబట్టి, హానికారకం అని రుజువయ్యేంత వరకూ అది సరైనదే అని అన్ని దేశాలూ భావించాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదించిన స్వేచ్ఛా వాణిజ్య విధానంలో, బలమైన శాస్త్రీయ సాక్ష్యం లేనప్పుడు అమెరికా నుండి జన్యుమార్పిడి దిగుమతులను ఈయూ నియంత్రించలేదు. అయితే అమెరికా దృక్పథంతో విభేదిస్తూ, ఈయూ తన సభ్య దేశాలచే జన్యుమార్పిడి విత్తనాలు/ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించింది. ఈ పంట రకాల ఆమోదాన్ని తాత్కాలికంగా నిలుపుదల (1998–2004) చేస్తూ దాని చర్యలను ప్రారంభించింది.ఈ నిలుపుదలను ఆగ్రహించిన అమెరికా, అర్జెంటీనా, కెనడా దేశాలు ఈయూ నియంత్రణ విధానానికి వ్యతిరేకంగా 2003లోప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక దావాను ప్రారంభించాయి. ఈయూ విధానం చట్టవిరుద్ధమైన వాణిజ్య పరిమితులను సృష్టిస్తోందని పేర్కొ న్నాయి. దాంతో డబ్ల్యూటీవో వివాద పరిష్కార ప్యానెల్ 2006 సెప్టెంబరులో ఫిర్యాదు చేసిన దేశాలకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. డబ్ల్యూటీవో నిబంధనలకు అనుగుణంగా తన ఆమోద ప్రక్రియను తేవాలని యూరోపియన్ యూనియన్ను కోరింది.డబ్ల్యూటీవో నిర్ణయానికి ముందే యూరోపియన్ యూనియన్ తన విధాన ప్రక్రియను మార్చుకుంది. అయితే అది ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంది. సభ్య దేశాల శాస్త్రీయ సంస్థలతో సన్నిహిత సంప్రదింపుల ద్వారా నష్టంపై అంచనా వేయడం జరిగింది. ఈ అభిప్రాయాన్ని బహిరంగ సంప్రదింపుల కోసం ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈయూ నిబంధనల ప్రకారం, అనేక రకాల కారణాల ఆధారంగాపంట సాగును నిలిపివేయడానికీ, నిషేధించడానికీ లేదా పరిమితం చేయడానికీ సభ్య దేశాలకు హక్కు ఉంటుంది. పర్యావరణం, వ్యవ సాయ విధాన లక్ష్యాలు, సామాజిక–ఆర్థిక ప్రభావం వంటివి కారణా లుగా చూపొచ్చు. ఫలితంగా, ఐరోపాలో వాణిజ్యీకరణ కోసం చాలా తక్కువ వ్యవసాయ బయోటెక్ అప్లికేషన్లను ఆమోదించారు.ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం నుండి స్థిరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈయూ సభ్యదేశాలు, ఇతర యూరప్ దేశాలు జన్యుమార్పిడి పంటలను, ముఖ్యంగా ఆహార గొలుసులో భాగమైన వాటిని సులభంగా ఆమోదించడానికి నిరంతరం దూరంగా ఉన్నాయి. ఈయూ, ఇతర దేశాల విముఖత అనేది ప్రభుత్వాలపై డబ్ల్యూటీవో, జన్యుమార్పిడీ టెక్నాలజీ జనరేటర్ల ఒత్తిడిని బలహీనపరిచింది. ఇది భారతదేశం తన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకోవడానికి ఎంతో సాయపడుతుంది.జన్యుమార్పిడి జీవులపై సముచితమైన, ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యతను సుప్రీంకోర్టు సరిగ్గానేకేంద్రానికి అప్పగించింది. భారతీయ విధాన రూపకర్తలు తప్పనిస రిగా యూరోపియన్ అనుభవాన్ని పరిశీలించాలి. ఇంతకుముందు మనం హరిత విప్లవ సాంకేతికతను అంగీకరించాం. దీని ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది; కానీ కొన్ని దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు లేకుండా పోలేదు. అందుకే ఈసారి, జన్యుమార్పిడిసాంకేతికతకు సంబంధించిన సానుకూల, ప్రతికూల ప్రభావాలను సమగ్రంగా అంచనా వేయాలి.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీమాజీ ప్రొఫెసర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
కారు.. మేకోవర్ జోరు
దేశంలో యువ తరంగం ఇప్పుడు లగ్జరీ కారును కొనుగోలు చేయాలన్న తమ కలను సాకారం చేసుకోవడంతోనే సరిపెట్టడం లేదు. తమకు నచ్చినట్టుగా దాన్ని ముస్తాబు చేయడం కోసం లక్షల్లో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కోరుకున్నట్లుగా కారును కస్టమైజ్ చేసుకోవడానికి సై అంటున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా ఎలా కావాలంటే అలా.. ఏది కావాలంటే అది నేరుగా ప్లాంట్లలోనే మార్పుచేర్పులు చేసి కస్టమర్ల చెంతకు చేరుస్తున్నాయి. తాజాగా ఆడి ఇండియా భువనేశ్వర్‌లో ఒక కారు కొనుగోలుదారు కోసం ‘ఆర్ఎస్ క్యూ8’లో 17 రకాల మార్పులు చేసి మరీ అందించడం విశేషం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకమైన పెయింట్ షేడ్. ‘జావా గ్రీన్‘గా పిలిచే ఈ పెయింట్ వర్క్ ఒక్కదానికే కస్టమర్ ఏకంగా రూ. 12.29 లక్షలు వెచి్చంచడం మేకోవర్ మేనియాకు నిదర్శనం. ఇక కోయంబత్తూరుకు చెందిన మరో యువ కార్ లవర్... ఆడి ఫ్లాగ్íÙప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ‘ని ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నాడు. దీనికి కార్బన్ ఫైబర్ రూఫ్, మ్యాట్రిక్స్ డిజైన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ (లైట్ బీమ్ ఫర్ఫెక్ట్గా పడేందుకు ఒక్కో హెడ్‌ల్యాంప్‌లో 10 లక్షల మైక్రో మిర్రర్లు ఉంటాయి), ఆల్–కాంటారా టెక్స్‌టైల్‌తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి పలు రకాల హంగులను జోడించేందుకు పెట్టిన ఖర్చు రూ. 36 లక్షలు. ముంబైలో మెర్సిడెజ్ బెంజ్ జీ400డీ / ఏఎంజీ జీ63 మోడళ్లకు చెందిన మూడు కార్లను 30కి పైగా కస్టమైజేషన్లతో విక్రయించింది. ఈ మార్పుల కోసం కొనుగోలుదారులు జస్ట్ రూ.1.5 కోట్లు ధారపోశారట! యువ కస్టమర్ల హల్ చల్ అరుదైన పెయింట్ వర్క్ దగ్గర నుంచి ప్రత్యేకంగా చేతితో మలిచిన లెదర్ ఇంటీరియర్స్. నచ్చిన పరికరాలు, న్యూమరాలజీ, జ్యోతిష నమ్మకాలకు అనుగుణంగా స్పెషల్ రిజి్రస్టేషన్ నంబర్ ఇలా ప్రతిదీ సరికొత్త లగ్జరీయే. ‘జీ–వ్యాగన్స్‌లో 70%, మేబ్యాక్ మోడళ్లలో 74% కస్టమర్లు కోరుకున్న మార్పులతోనే అమ్ముడవుతున్నాయి. రంగులు, మెటీరియల్, ఫ్యాన్సీ నంబర్లు ఇలా తమ అభిరుచులకు అదనంగా చెల్లించేందుకు మా కొనుగోలుదారులు ఎప్పుడూ సిద్ధమే’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డీ సంతోష్ అయ్యర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ డిమాండ్‌కు తోడు ఇప్పుడు దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ యువరక్తంతో పరవళ్లు తొక్కుతోంది. మెర్సిడెస్ బెంజ్ భారతీయ కస్టమర్ల సగటు వయస్సు 38 ఏళ్లే. ప్రపంచవ్యాప్తంగా మనోళ్లే ఈ కంపెనీకి యువ కొనుగోలుదారులు కావడం మరో విశేషం. ’కస్టమర్లు ప్రత్యేకతకు పెద్దపీట వేస్తున్నారు. తమ కార్లను వ్యక్తిత్వ చిహ్నంగా భావిస్తున్నారు’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ «థిల్లాన్ చెబుతున్నారు. ఆడి భారతీయ కస్టమర్లు తమ కార్లలో హంగుల కోసం రూ. 70 లక్షల వరకు వెచి్చస్తున్నారు. ఇక మెర్సిడెస్ బెంజ్ విషయానికొస్తే, మేబ్యాక్, ఏఎంజీ వంటి టాప్–ఎండ్ మోడళ్ల కస్టమర్లు కారు ధరలో 20% కస్టమైజేషన్‌కు వెచ్చి స్తున్నారు. బీఎండబ్ల్యూ కస్టమర్లు రూ. 50 లక్షల వరకూ ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ మోడల్స్‌లో చాలా కార్ల ప్రారంభ ధర రూ. 1.5 కోట్లు పైనే. కార్తీక్.. హైదరాబాద్‌లో యువ వ్యాపారవేత్త. కొత్తగా లగ్జరీ కారు కొన్నాడు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? కారు కోసం రూ. 1.5 కోట్లు ఖర్చుపెడితే.. అందులో తన అభిరుచికి తగ్గట్టుగా రకరకాల హంగులను జోడించడం కోసం సదరు కార్ల కంపెనీకి రూ. 50 లక్షలు చెల్లించాడు! కార్ల కస్టమైజేషన్ క్రేజ్‌కు ఇది జస్ట్ చిన్న ఉదాహరణ మాత్రమే... -
ఏపీ వ్యాప్తంగా అందుబాటులోకి ఆటో మ్యుటేషన్
-
లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు!
సాక్షి, ఖమ్మం: లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్టుడి రూపాన్ని పోలి ఉండటంపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఉత్వర్వులు, యాదవ సంఘాల అభ్యంతరాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహం కిరీటంలోని నెమలి పింఛం, వెనుక భాగాన విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగించి ఈ నెల 28న ఆవిష్కరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు శ్రీకృష్ణావతారంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం చేరుకుంది. భారీ వాహనంలో 54 అడుగుల విగ్రహాన్ని గురువారం లకారం ట్యాంక్‌బండ్ వద్దకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని స్థానికులు పెద్ద సంఖ్యలో తిలకించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ‘తానా’, ఎన్ఆర్ఐలు, పలువురు పారిశ్రామికవేత్తల సహకారంతో భారీ విగ్రహా న్ని నిజామాబాద్‌కు చెందిన కళాకారుడు వర్మ రూపొందించారు. కోర్టు ఉత్తర్వులు.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకోవడంపై హైకోర్టు గురువారం స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ విగ్రహ ఏర్పాటు ను సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆల్ ఇండియా యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళాపీఠం, శ్రీకృష్ణ జేఏసీ సహా పలువురు లంచ్‌మోషన్ రూపంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ప్రతిష్టించడాన్ని నిషేధిస్తూ 2016లో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని ఆదేశించింది. చదవండి: రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్‌ట్రానిక్’ విస్తరణ -
పెట్రోల్ రేట్ల పెంపుతో ఇంజన్ పీకేసి.. ఇలా సెట్ చేశాడు
Janagaon Electric Bike: పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా దాదాపు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన ధరలతో కొందరు తమ వాహనాలను మూలన పడేయగా మరికొందరు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారు. కానీ జనగామకు చెందిన విద్యాసాగర్ విభిన్నమైన మార్గం ఎంచుకున్నాడు. జనగామకు చెందిన కూరపాటి విద్యాసాగర్ ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోలు ధరలు భారంగా మారాయి. జనగామలో కూడా పెట్రోలు ధర లీటరు వంద దాటింది. పెట్రోలు ధరలు పెరగడమే తప్ప తగ్గకపోవడంతో తన భైకుకు ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను తీసేయాలని నిర్ణయించుకున్నాడు. రూ.10 వేల ఖర్చుతో 30ఏహెచ్ కెపాసిటీ కలిగిన నాలుగు బ్యాటరీలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూ.7500 ఖర్చు చేసి ఆన్లైన్లో మోటారు కొన్నాడు. స్థానిక మెకానిక్ అనిల్ సహకారంతో పెట్రోల్ ఇంజన్ స్థానంలో బైక్‌కి బ్యాటరీలు, మోటార్ అమర్చాడు. ఈ లోకల్ మేడ్ ఎలక్ట్రిక్ వెహికల్ 5 గంటలపాటు ఛార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల ప్రయాణిస్తోంది. బ్యాటరీలతో నడుస్తున్న విద్యాసాగర్ బైక్ ఇప్పుడు జనగామలో ట్రెండింగ్‌గా మారింది. బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకోవడానికి ఒకటి నుంచి ఒకటిన్నర యూనిట్ కరెంటు ఖర్చవుతోంది, కేవలం రూ.10తో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నా. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేశాను - విద్యాసాగర్ -
ఫ్యాకల్టీ భర్తీకి చట్ట సవరణ చేయాల్సిందే
► అప్పుడే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీకి మార్గం సుగమం ► మార్పులపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ వర్సిటీల పోస్టుల భర్తీలో గతంలో అనేక అక్రమాలు జరిగినట్లు, వైస్ చాన్స్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. త్వరలో రాష్ట్రంలోని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,504 అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అక్రమాలకు తావులేని విధానాన్ని తీసుకురావాలని భావి స్తోంది. ఇందులో భాగంగా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థతో వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలను చేపట్టాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిలో భాగంగా టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నియామకాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. అయితే స్వయంప్రతిపత్తి కలిగిన వర్సిటీలు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాయా? టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీకి అంగీకరిస్తాయా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. వేతనాలు చెల్లిస్తున్నది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదని, పైగా అక్రమాలకు తావులేకుండా టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ విధానం తెస్తున్నందునా వ్యతిరేకించే పరి స్థితి లేదని అధ్యాపక వర్గాలే పేర్కొంటున్నాయి. కాలయాపనకు చెక్ ప్రస్తుతం వర్సిటీ వీసీ చైర్మన్‌గా ఉండే రిక్రూట్మెంట్ బోర్డు చేపడుతున్న నియామకాల ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతోంది. దీంతో సమయానికి అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఆశ్రీత పక్షపాతం, అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వాటన్నింటికి చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. చట్ట సవరణతోనే సాధ్యం ప్రస్తుతం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో చట్టం ఉంది. వాటిల్లో నియామకాల అధికారం వీసీ చైర్మన్‌గా ఉండే రిక్రూట్మెంట్ బోర్డుకే ఉంది. ప్రస్తుతం ఆ నిబంధనను సవరించాల్సి ఉంది. రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో టీఎస్పీఎస్సీనే నియామక అథారిటీ అనేది చేర్చితేనే టీఎస్పీఎస్సీ ద్వారా ఫ్యాకల్టీ భర్తీ సాధ్యం అవుతుంది. లేదంటే కష్టమే. ఈ నేపథ్యంలో అన్ని యూనివర్సిటీల చట్టాలకు సవరణ చేయాలా? అన్నది ఆలోచిస్తోంది. మరోవైపు ఎలాగూ అన్ని వర్సిటీలకు కలిపి కామన్ యూనివర్సిటీ యాక్ట్ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అందులోనే మార్పులు చేసి టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయాలా? అన్న ఆలోచనలు చేస్తోంది. ఏదేమైనా త్వరలోనే దీనిపై ఓ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. ఖాళీ పోస్టులకు సంబంధించి యూనివర్సిటీల నుంచి ఇండెంట్లు వచ్చేలోగా నిర్ణయాన్ని ఖరారు చేసేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఉన్నత విద్యలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం నియమించిన సుబ్రహ్మణ్యన్ కమిటీ కూడా నియామకాల్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థతోనే నియామకాలు చేపట్టాలని సిఫారసు చేసినట్లు యూనివర్సిటీల అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దానిని కూడా పరిశీలించి పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.