youth Interested
-
కారు.. మేకోవర్ జోరు
దేశంలో యువ తరంగం ఇప్పుడు లగ్జరీ కారును కొనుగోలు చేయాలన్న తమ కలను సాకారం చేసుకోవడంతోనే సరిపెట్టడం లేదు. తమకు నచ్చినట్టుగా దాన్ని ముస్తాబు చేయడం కోసం లక్షల్లో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కోరుకున్నట్లుగా కారును కస్టమైజ్ చేసుకోవడానికి సై అంటున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా ఎలా కావాలంటే అలా.. ఏది కావాలంటే అది నేరుగా ప్లాంట్లలోనే మార్పుచేర్పులు చేసి కస్టమర్ల చెంతకు చేరుస్తున్నాయి. తాజాగా ఆడి ఇండియా భువనేశ్వర్‌లో ఒక కారు కొనుగోలుదారు కోసం ‘ఆర్ఎస్ క్యూ8’లో 17 రకాల మార్పులు చేసి మరీ అందించడం విశేషం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకమైన పెయింట్ షేడ్. ‘జావా గ్రీన్‘గా పిలిచే ఈ పెయింట్ వర్క్ ఒక్కదానికే కస్టమర్ ఏకంగా రూ. 12.29 లక్షలు వెచి్చంచడం మేకోవర్ మేనియాకు నిదర్శనం. ఇక కోయంబత్తూరుకు చెందిన మరో యువ కార్ లవర్... ఆడి ఫ్లాగ్íÙప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ‘ని ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నాడు. దీనికి కార్బన్ ఫైబర్ రూఫ్, మ్యాట్రిక్స్ డిజైన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ (లైట్ బీమ్ ఫర్ఫెక్ట్గా పడేందుకు ఒక్కో హెడ్‌ల్యాంప్‌లో 10 లక్షల మైక్రో మిర్రర్లు ఉంటాయి), ఆల్–కాంటారా టెక్స్‌టైల్‌తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి పలు రకాల హంగులను జోడించేందుకు పెట్టిన ఖర్చు రూ. 36 లక్షలు. ముంబైలో మెర్సిడెజ్ బెంజ్ జీ400డీ / ఏఎంజీ జీ63 మోడళ్లకు చెందిన మూడు కార్లను 30కి పైగా కస్టమైజేషన్లతో విక్రయించింది. ఈ మార్పుల కోసం కొనుగోలుదారులు జస్ట్ రూ.1.5 కోట్లు ధారపోశారట! యువ కస్టమర్ల హల్ చల్ అరుదైన పెయింట్ వర్క్ దగ్గర నుంచి ప్రత్యేకంగా చేతితో మలిచిన లెదర్ ఇంటీరియర్స్. నచ్చిన పరికరాలు, న్యూమరాలజీ, జ్యోతిష నమ్మకాలకు అనుగుణంగా స్పెషల్ రిజి్రస్టేషన్ నంబర్ ఇలా ప్రతిదీ సరికొత్త లగ్జరీయే. ‘జీ–వ్యాగన్స్‌లో 70%, మేబ్యాక్ మోడళ్లలో 74% కస్టమర్లు కోరుకున్న మార్పులతోనే అమ్ముడవుతున్నాయి. రంగులు, మెటీరియల్, ఫ్యాన్సీ నంబర్లు ఇలా తమ అభిరుచులకు అదనంగా చెల్లించేందుకు మా కొనుగోలుదారులు ఎప్పుడూ సిద్ధమే’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డీ సంతోష్ అయ్యర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ డిమాండ్‌కు తోడు ఇప్పుడు దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ యువరక్తంతో పరవళ్లు తొక్కుతోంది. మెర్సిడెస్ బెంజ్ భారతీయ కస్టమర్ల సగటు వయస్సు 38 ఏళ్లే. ప్రపంచవ్యాప్తంగా మనోళ్లే ఈ కంపెనీకి యువ కొనుగోలుదారులు కావడం మరో విశేషం. ’కస్టమర్లు ప్రత్యేకతకు పెద్దపీట వేస్తున్నారు. తమ కార్లను వ్యక్తిత్వ చిహ్నంగా భావిస్తున్నారు’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ «థిల్లాన్ చెబుతున్నారు. ఆడి భారతీయ కస్టమర్లు తమ కార్లలో హంగుల కోసం రూ. 70 లక్షల వరకు వెచి్చస్తున్నారు. ఇక మెర్సిడెస్ బెంజ్ విషయానికొస్తే, మేబ్యాక్, ఏఎంజీ వంటి టాప్–ఎండ్ మోడళ్ల కస్టమర్లు కారు ధరలో 20% కస్టమైజేషన్‌కు వెచ్చి స్తున్నారు. బీఎండబ్ల్యూ కస్టమర్లు రూ. 50 లక్షల వరకూ ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ మోడల్స్‌లో చాలా కార్ల ప్రారంభ ధర రూ. 1.5 కోట్లు పైనే. కార్తీక్.. హైదరాబాద్‌లో యువ వ్యాపారవేత్త. కొత్తగా లగ్జరీ కారు కొన్నాడు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? కారు కోసం రూ. 1.5 కోట్లు ఖర్చుపెడితే.. అందులో తన అభిరుచికి తగ్గట్టుగా రకరకాల హంగులను జోడించడం కోసం సదరు కార్ల కంపెనీకి రూ. 50 లక్షలు చెల్లించాడు! కార్ల కస్టమైజేషన్ క్రేజ్‌కు ఇది జస్ట్ చిన్న ఉదాహరణ మాత్రమే... -
వెయ్.. ‘సిప్’ వెయ్
న్యూఢిల్లీ: మెజారిటీ యవత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకుంటున్నారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు సులభంగా నిర్వహించుకునే వీలు, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆర్థిక అక్షరజ్ఞానం పెరుగుతుండడం ఇందుకు వీలు కలి్పస్తున్నట్టు వైట్ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వహణలో 3.33 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.8,400 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఏడాది క్రితమే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు మొదలు పెట్టింది. తన కస్టమర్లలో 56 శాతం జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ (జెనరేషన్ వై) ఉన్నట్టు తెలిపింది. 1981–1996 మధ్య జన్మించిన వారు జెనరేషన్ వై కిందకు, 1997–2012 మధ్య జని్మంచిన వారు జెనరేషన్ జెడ్ కిందకు వస్తారు. తనకున్న 3.33 లక్షల కస్టమర్లలో 28 శాతం మేర జెనరేషన్ జెడ్, మరో 28 శాతం మేర జెనరేషన్ వై విభాగంలోని వారేనని ఈ సంస్థ తెలిపింది. అంతేకాదు 51 శాతం మంది డిజిటల్ చానల్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘జెనరేషన్ వై, జెడ్ డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వారు. కనుక వారు టెక్నాలజీ ఆధారితంగా నడిచే ఫైనాన్షియల్ సరీ్వస్ ప్రొవైడర్లకు ప్రాధాన్యత ఇవ్వడం సహజమే’’అని వైట్ఓక్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. సహేతుక రాబడులు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ, చాలా స్వల్ప మొత్తం నుంచే పెట్టుబడికి అవకాశం, ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు, సులభంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఇవన్నీ యువ ఇన్వెస్టర్లు సిప్ వేసేందుకు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. టికెట్ సైజు తక్కువే 18–35 ఏళ్ల వయసు వారు సిప్ రూపంలో చేస్తున్న పెట్టుబడి, ఇంతకంటే పెద్ద వయసులోని వారితో పోలిస్తే తక్కువగానే ఉన్నట్టు వైట్ఓక్ తెలిపింది. తమ పాకెట్ మనీ నుంచి లేదంటే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం ద్వారా వచ్చే మొత్తం నుంచి వీరు ఇన్వెస్ట్ చేస్తుండొచ్చని ప్రతీక్ పంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో 7.92 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. -
నాలుగో సింహం అవుతా..!
సాక్షి, హైదరాబాద్: పెద్దయ్యాక ఏమవుతారు..? విద్యార్థులను ఈ ప్రశ్న అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. అయితే చాలా మంది విద్యార్థులు మాత్రం పోలీస్ అవుతామని చెబుతున్నారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచే కృషి చేస్తామని కూడా అంటున్నారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై ఇటీవల జరిపిన సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి. వీరిలో దాదాపు 27 శాతం మంది బాలురు, 12 శాతం మంది బాలికలు పోలీస్ శాఖపై తమ ఆసక్తిని వెలిబుచ్చారు. 20 శాతం మంది బాలికలు అగ్రికల్చరర్, ఫుడ్ సంబంధిత రంగాల్లో భవిష్యత్తు కోరుకుంటున్నారు. విద్యార్ధి దశ నుంచే భవిష్యత్తుపై అవగాహన ఏర్పరచడంతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా పాఠశాల విద్య స్థాయి నుంచే కృషి చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ (సైకోమెట్రిక్ టెస్టు) రూపొందించారు. దాన్ని మై చాయిస్ మై ఫ్యూచర్ పేరుతో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అమల్లోకి తెచ్చి విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులను తెలుసుకుంది. సర్వేలో వెల్లడైన అంశాలను క్రోఢీకరించి రూపొందించిన నివేదికను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థుల వ్యక్తిత్వంపై నాలుగు కేటగిరీలు, కెరీర్ సంబంధ అంశాల్లో 8 కేటగిరీల్లో మొత్తం 72 ప్రశ్నలతో ఈ సర్వే సాగింది. 27 జిల్లాల్లో 194 మోడల్ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులు, 200 మంది టీచర్లతో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు ఇవే.. విద్యార్థుల్లో ఎక్కువ మంది 7 రంగాలపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు సర్వేలో తేలింది. పోలీస్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్, స్పోర్ట్స్, డిఫెన్స్, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో బాలికలు ఎక్కువ మంది అగ్రికల్చర్ అండ్ ఫుడ్, హ్యూమన్ సర్వీసెస్, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ రంగాలపై ఆసక్తి కనబరిచారు. బాలురలో పోలీసు, హ్యూమన్ సర్వీస్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హాస్పిటాలిటీ, టూరిజం రంగాలపై ఆసక్తి ప్రదర్శించారు. -
చేసేయ్... ఆన్లైన్ షాపింగ్
ఏజెన్సీలోని యువత ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్‌పై మక్కువ చూపుతున్నారు. మారుతున్న సమాజంలో మార్పులకు అనుగుణంగా వారు కూడా అలవాటు పడుతున్నారు. ఏ వస్తువు కావాలన్నా ఇంటికే నేరుగా వచ్చే సదుపాయం ఆన్లైన్ షాపింగ్‌లో ఉండడంతో గిరిజన యువత ఆసక్తి చూపుతున్నారు. కోరుకున్న వస్తువు కోరుకున్న చోటుకు ఇట్టే వచ్చేస్తుండడంతో పాటు వచ్చిన తరువాత కూడా ఇష్టం లేకుంటే తిరిగి పంపే సదుపాయం ఉండడం, ఆ మొత్తం తిరిగి తమ అకౌంటులో పడుతుండడంతో హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నారు. సాక్షి, గుమ్మలక్ష్మీపురం(విజయనగరం) : ఏవైనా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేయాలంటే అందుబాటులో ఉన్న దుకాణాలకు తిరిగి, బేరమాడి కొనుగోలు చేసే రోజులు క్రమంగా మారిపోతున్నాయి. కాలానుగుణంగా మార్పులు రావడంతో పాటు ఇంటర్నెట్, క్యాష్ ఆన్ డెలివరీ తదితర సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పరిస్థితి మారింది. ఎక్కువ శాతం మంది ముఖ్యంగా యువత ఆన్లైన్ మార్కెట్‌పై తెగ మోజు చూపిస్తున్నారు. వస్తువైనా, ఆహారమైనా, దుస్తులైనా అన్నింటికీ ఆన్లైన్ షాపింగ్స్‌పై ఆధారపడుతున్నారు. ధరలు అందుబాటులో ఉండడం, సమయం ఆదా అవుతుండటంతో ఆన్లైన్ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పట్ల యువతకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. గతంలో గంటల తరబడి దుకాణాల్లో వేచి ఉండి కావాల్సినవి కొనుగోలు చేసే వారు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంట్లో కూర్చొని తమకు నచ్చిన వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. చిన్నపాటి వస్తువు నుంచి ద్విచక్ర వాహనాలు (సైకిళ్లు), ఎల్ఈడీ టీవీలు, మొబైల్ ఫోన్లు, ఈయర్ ఫోన్లు, ఫోన్ పౌచ్‌లు, కూలింగ్ కళ్లజోళ్లు, షూలు, వంట పాత్రలు ఇలా ఏది కావాలన్నా...ఆన్లైన్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. నచ్చితే ఓకే.. లేదంటే వాపస్ ప్రస్తుతం అంతా ఆన్లైన్ వైపు చూస్తున్నారు. విభిన్న ఫీచర్లతో మార్కెట్‌ను మంచెత్తుతున్న స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండటంతో ఆన్లైన్ మార్కెటింగ్ క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. నచ్చిన వస్తువులు ఎంపిక చేసుకోవడమే తరువాయి. ఇంటి ముంగిటకు కోరినవి వచ్చి చేరుతున్నాయి. వినియోగదారులకు ఎంతో విలువైన సమయం ఆదా అవుతోంది. వస్తువు నచ్చకపోతే వాపస్ చేసి నగదును తమ అకౌంట్లోకి తిరిగి పోందుతున్నారు. అదే దుకాణాల్లో కొనుగోలు చేస్తే వస్తువు నచ్చకపోతే మరో వస్తువు తీసుకోవాల్సిందే. నగదు మాత్రం తిరిగి ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఆన్లైన్ షాపింగ్‌పై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జోమాటో తదితరవి ఆన్లైన్లో సేవలు అందిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి ఆదరణ పొందుతున్నాయి. మనకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో నమోదు చేయగానే వందల కొద్ది మోడల్స్, వాటి రంగులు, ధరలు, ఫొటోలతో సహా నమూనాలు చూపిస్తున్నాయి. దీంతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మంచి వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు వీలుంది. ఆన్లైన్ సేవలు ఏజెన్సీ ప్రాంతానికి కూడా విస్తరించాయంటే వాటికి ఆదరణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈజీ మార్కెటింగ్ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ మేక్ ఇట్ ఈజీగా మారిపోయింది. పనులపై బిజిబిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో ఆన్లైన్ షాపింగ్‌తో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కోరుకున్న వస్తువు ఇంటికి చేరుతోంది. కొత్త కొత్త వెరైటీలు లభిస్తుండటంతో అందరూ అటువైపు వెళ్తున్నారు. – నిమ్మక సుశాంత్, తాడికొండ క్యాష్ ఆన్ డెలివరీ విధానం మేలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వేల రూపాయల విలువ చేసే వస్తువులకు బదులుగా కొన్ని సందర్భాల్లో ప్యాకింగ్ లోపల అట్టలు, కాగితాలు ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆన్లైన్లో ఎక్కువ మొత్తంలో షాపింగ్ చేసే వ్యక్తులు సాధ్యమైనంత వరకు క్యాష్ ఆన్ డెలివరీ విధానం ద్వారానే షాపింగ్ చేసుకోవడమే మంచిది. దీని వల్ల ఆన్లైన్ మోసాలు సాధ్యమైనంత వరకు జరగకుండా ఉంటాయి –కె.వెంకటరావు, ఎస్ఐ, ఎల్విన్‌పేట -
బోధనా రంగంలో సెట్ అవుదాం..!
బోధనా రంగంపై శ్రీకాకుళం జిల్లా యువత ఆసక్తి చూపుతోంది. ఆకర్షణీయమైన జీతాలు లభించడం, పని ఒత్తిడి తక్కువగా ఉండడంతో పీజీ చేసిన యువకులు నెట్, సెట్లు రాసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. పరీక్షల్లో నెగ్గేందుకు రాత్రీ పగలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 15 వేల మంది దరఖాస్తు చేసుకోగా అందులో జిల్లాకు చెందినవారే పదివేల మంది అభ్యర్థులు ఉండడం గమనార్హం. ఎచ్చెర్ల: ఒకప్పుడు బోధనా రంగం అంటే పెదవి విరిచిన యువత నేడు ఈ రంగంలో చేరేందుకు సై అంటున్నారు. పీజీ పూర్తి చేసిన యువతీయువకులు నేషనల్ ఎలిజిబులిటీ టెస్టు (నెట్), ఆంధ్రప్రదేశ్ స్టేట్ అర్హత పరీక్ష (ఏపీ సెట్)ల్లో విజేతగా నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. 13 ఏళ్ల తరువాత 2012 అగస్టులో ప్రభుత్వం ఏపీసెట్ నిర్వహించగా, ఈ ఏడాది మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిష న్ కూడా ఏటా నెట్‌ను డిసెంబర్, జూన్ నెల ల్లో నిర్వహిస్తుండడంతో పరీక్షలపై యువత మొగ్గుచూపుతోంది. సెట్‌కు రాష్ట్రంలో సుమా రు లక్షా 15 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో పదివేల మంది అభ్యర్థు లు జిల్లాకు చెందినవారే ఉండడం గమనార్హం. గతంలో వంద, రెండు వందలు మాత్రమే ఉన్న సంఖ్య వేలకు చేరుకుంది. ఈ ఏడాది ఏపీ సెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో సెట్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీకి అప్పగించింది. ఏపీ సెట్ పరీక్ష జనవరి 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సెట్, నెట్ పాసైన అభ్యర్థులకే అవకాశం వివిధ సబ్జెక్టుల బోధనకు ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పీహెచ్డీ కంటే నెట్, ఏపీ సెట్ అర్హత సాధించినవారికే ప్రాధాన్యమిస్తున్నారుు. పీహెచ్డీ ఉన్నా నెట్, సెట్‌ను తప్పని సరిగా వర్సిటీలు పరిగణలోకి తీసుకుంటున్నారుు. పీహెచ్‌డీలు ధనవంతులకు అనుకూలమైనవని, నెట్, సెట్లు ప్రతిభతో నెగ్గేవన్న ముద్ర ఉండడమే దీనికికారణం. నెట్ అర్హత సాధించిన వారు దేశంలో యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఉన్న అన్ని విద్యాసంస్థల్లో నిర్వహించే బోధకుల రిక్రూట్ మెంట్‌కు అర్హులు. డిగ్రీ కళాశాల అధ్యాపకులు, వర్సిటీల్లో రిక్రూట్ నిర్వహించే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు మూడు నుంచి ఐదేళ్లు శ్రమించి పీహెడీ పూర్తి చేయడం కంటే నెట్‌కు సిద్ధంకావడమే మంచిదని భావిస్తున్నారు. నెట్ అర్హత సాధించిన వారికి పీహెచ్‌డీకోసం కౌన్సిలాఫ్ సైన్టిఫిక్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ సెంటర్ ఫెలోషిప్ మంజూరు చేస్తుంది. దీంతో వారు ప్రైవేటు,ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగంచేస్తూనే పార్టుటైంగా కూడా డాక్టరేట్ చేయవచ్చు. పరీక్షలో ఒకటే విధానం పరీక్షా విధానాన్ని పరిశీలిస్తే నెట్, ఏపీ సెట్ ఇంచుమింగుగా ఒకే విధానంలో ఉంటుం ది. నెట్‌కు పోటీతో పాటు ప్రశ్నలు కఠినం గా ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ 100 మార్కులకు ఉంటుంది. ఒక్కోప్రశ్నకు రెండు మార్కులు కాగా 60 ప్రశ్నల్లో 50కి జవాబు రాయాలి. సివిల్స్ ప్రిలిమ్స్ స్థాయిలో ఈ పరీక్ష ఉంటుంది. రెండో పేపర్లో 100 మార్కులకి 50 ప్రశ్నలు ఉంటా యి. సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహనే ఈ పరీక్ష ఉద్ధేశ్యం. మూడో పేపర్లో 150 మార్కులకి 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్లో అభ్యర్థిలో సబ్జెక్టు విశ్లేషణా సామర్థ్యా న్ని లోతుగా పరీక్షిస్తారు. సంపూర్ణ విషయ పరిజ్ఙానం ఉన్నవారు మాత్రమే ఈ పరీక్షలో విజయం సాధిస్తారు. ఏటా పెరుగుతున్న పోటీ జిల్లా నుంచి నెట్ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ ప్రవేశ పరీక్ష కు ప్రతిసారి 10 వేల మంది వరకు హాజరవుతుండగా, విజేతలుగా 100 లోపు మాత్రమే నిలుస్తున్నారు. ఏపీ సెట్‌కు 10 వేల మంది వరకు 2012లో హాజరుకాగా జిల్లాలో ఎనిమిది శాతం మంది అర్హత సాధించారు. చాలా మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచే స్తూనే ఈ సెట్లకు సిద్ధమవుతూ విజేతలుగా నిలుస్తున్నారు. లోతైన విశ్లేషణా సామర్థ్యం అవసరం నెట్లో విజయం సాధించాలంటే లోతైన విశ్లేషణా సామర్థ్యం అవసరం. జనరల్ స్టడీస్ కోసం వార్తా పత్రికలు, నెల వారీ మ్యాగ్జైన్లు చదవాలి. మనోరమ ఇయర్ పుస్తకం జనరల్ స్టడీస్‌కు ఉపయోగ పడుతుంది. పోస్టుగ్రాడ్యుయేషన్ సబ్జెక్టులో పూర్తిస్థాయి అవగాన ఉంటే రెండు మూడు పేపర్లలో మంచి స్కోర్ చేయొచ్చు. ఎంపిక కావాలంటే సంపూర్ణ సామర్థ్యం అవసరం. - మల్ల పూర్ణసూరిగణేష్, నెట్ విజేత, శ్రీ వెంకటేశ్వర మేనేజ్మెంట్ కళాశాల హెచ్ వోడీ కంఠస్థ పద్ధతితో ప్రయోజనం ఉండదు సబ్జెక్టుపై అవగాహన ఉండాలి. మూడు పేపర్లలోనూ స్కోర్ చేయగలగాలి. ప్రిపరేషన్ పక్కాగా ఉండాలి. పాత ప్రశ్న పత్రాలను, వస్తున్న ప్రశ్నల చాప్టర్లను పరిశీలించాలి. అవసరమైతే సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవాలి. ఒక్క సారి విఫలమైనా నిరాశ చెందకూడదు. మనలోపాలను సమీక్షించుకొని ముందుకు సాగినప్పుడే విజేతలుగా నిలుస్తాం. - కూన మురళీమోహన్, నెట్ విజేత, శ్రీకాకుళం వేగంతో పాటు కచ్చితత్వం అవసరం నెట్ పరీక్షలో విజేతగా నిలవాలంటే వేగంతో పాటు, కచ్చితత్వం ఉండాలి. అప్పుడే విజేతగా నిలుస్తాం. చదివేటప్పుడే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెల్సుకోవాలి. సందేహాలు అంటూ ఉండ కుండా జాగ్రత్త పడాలి. జనరల్ స్టడీస్ విషయంలో స్నేహితులలో కల్సి గ్రూప్ డిస్కషన్స్ వల్ల ప్రయోజనం ఉంటుంది. కనీసం ఏడాది పాటు శ్రమించి చదివితే విజయం సాధించవచ్చు. అరకొర ప్రిపరేషన్‌తో నె ట్‌కు హాజరు కావడం వల్ల ప్రయోజనం ఉండదు. - కాద విజయ్‌కుమార్, నెట్ విజేత, శ్రీకాకుళం ఎంతో శ్రమించాలి నెట్, ఏపీసెట్‌లో విజయం సాధించాలం టే ఎంతో శ్రమించాలి. ఏపీసెట్ రెగ్యులర్‌గా నిర్వహించడం లేదు. దీని వల్ల నెట్‌కు విపరీతమైన పోటీ పెరుగుతుంది. ఏపీసెట్ 13 ఏళ్ల తరువాత 2012 ఆగస్టులో నిర్వహించారు. నెట్ పరీక్ష విధానం, ఏపీసెట్ పరీక్షా విధానం ఒకేలా ఉం టుంది. అందువల్ల ఒక్క పరీక్షకు అంకిత భావంతో చదివితే రెండీంటినీ సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. - హనుమంతు స్వప్నరేఖ, ఏపీసెట్ విజేత, శ్రీశివానీ బోధకురాలు అవగాహన పద్ధతితో ప్రయోజనం ప్రతి అంశ ంపై అవగాహన ఉండాలి. సబ్జెక్ట్, జనరల్ స్టడీస్‌పై పట్టు అవసరం. సంపూర్ణ విషయ పరిజ్ఞానం ఉంటేనే నెట్, ఏపీ సెట్లలో విజయం సాధ్యమవతుంది. ప్రస్తుతం ఈ పరీక్షలకు పోటీ రోజురోజుకూ పెరుగుంది. అదే స్థాయిలో ప్రశ్నపత్రం కూడా కఠినం అవుతుం ది. అభ్యర్థులు పక్కా వ్యూహరచనతో చదివితేనే విజయం సాధ్యమవుతుంది. - డాక్టర్ శ్రీసుధ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరీక్ష రాయడం కూడా కీలకమే పరీక్షకు ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే పరీక్ష రాయడం మరో ఎత్తు. పోటీ పరీక్ష ల్లో కచ్చితత్వం, వేగం ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. ఎంత చదివినా కొన్ని ప్రశ్నలకు ఆలోచ నాత్మకంగా జవాబు రాయాలి. పూర్వపు ప్రశ్న పత్రాలు, మోడల్ ప్రశ్న పత్రాలు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. పరీక్షలు ముందు ఎన్ని ఎక్కు వ మోడల్ ప్రశ్న పత్రాలు చేస్తే అంత ప్రయోజనం చేకూరుతుంది. - డాక్టర్ గంజి సంజీవయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ