బోధనా రంగంపై శ్రీకాకుళం జిల్లా యువత ఆసక్తి చూపుతోంది. ఆకర్షణీయమైన జీతాలు లభించడం, పని ఒత్తిడి తక్కువగా ఉండడంతో పీజీ చేసిన యువకులు నెట్, సెట్‌లు రాసేందుకు ఉత్సుకత చూపుతున్నారు. పరీక్షల్లో నెగ్గేందుకు రాత్రీ పగలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 15 వేల మంది దరఖాస్తు చేసుకోగా అందులో జిల్లాకు చెందినవారే పదివేల మంది అభ్యర్థులు ఉండడం గమనార్హం.
ఎచ్చెర్ల: ఒకప్పుడు బోధనా రంగం అంటే పెదవి విరిచిన యువత నేడు ఈ రంగంలో చేరేందుకు సై అంటున్నారు. పీజీ పూర్తి చేసిన యువతీయువకులు నేషనల్ ఎలిజిబులిటీ టెస్టు (నెట్), ఆంధ్రప్రదేశ్ స్టేట్ అర్హత పరీక్ష (ఏపీ సెట్)ల్లో విజేతగా నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. 13 ఏళ్ల తరువాత 2012 అగస్టులో ప్రభుత్వం ఏపీసెట్ నిర్వహించగా, ఈ ఏడాది మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిష న్ కూడా ఏటా నెట్‌ను డిసెంబర్, జూన్ నెల ల్లో నిర్వహిస్తుండడంతో పరీక్షలపై యువత మొగ్గుచూపుతోంది. సెట్‌కు రాష్ట్రంలో సుమా రు లక్షా 15 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో పదివేల మంది అభ్యర్థు లు జిల్లాకు చెందినవారే ఉండడం గమనార్హం. గతంలో వంద, రెండు వందలు మాత్రమే ఉన్న సంఖ్య వేలకు చేరుకుంది. ఈ ఏడాది ఏపీ సెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో సెట్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీకి అప్పగించింది. ఏపీ సెట్ పరీక్ష జనవరి 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
సెట్, నెట్ పాసైన అభ్యర్థులకే అవకాశం
వివిధ సబ్జెక్టుల బోధనకు ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పీహెచ్‌డీ కంటే నెట్, ఏపీ సెట్ అర్హత సాధించినవారికే ప్రాధాన్యమిస్తున్నారుు. పీహెచ్‌డీ ఉన్నా నెట్, సెట్‌ను తప్పని సరిగా వర్సిటీలు పరిగణలోకి తీసుకుంటున్నారుు. పీహెచ్‌డీలు ధనవంతులకు అనుకూలమైనవని, నెట్, సెట్‌లు ప్రతిభతో నెగ్గేవన్న ముద్ర ఉండడమే దీనికికారణం. నెట్ అర్హత సాధించిన వారు దేశంలో యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ) గుర్తింపు ఉన్న అన్ని విద్యాసంస్థల్లో నిర్వహించే బోధకుల రిక్రూట్ మెంట్‌కు అర్హులు. డిగ్రీ కళాశాల అధ్యాపకులు, వర్సిటీల్లో రిక్రూట్ నిర్వహించే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు మూడు నుంచి ఐదేళ్లు శ్రమించి పీహెడీ పూర్తి చేయడం కంటే నెట్‌కు సిద్ధంకావడమే మంచిదని భావిస్తున్నారు. నెట్ అర్హత సాధించిన వారికి పీహెచ్‌డీకోసం కౌన్సిలాఫ్ సైన్టిఫిక్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ సెంటర్ ఫెలోషిప్ మంజూరు చేస్తుంది. దీంతో వారు ప్రైవేటు,ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగంచేస్తూనే పార్టుటైంగా కూడా డాక్టరేట్ చేయవచ్చు.
పరీక్షలో ఒకటే విధానం
పరీక్షా విధానాన్ని పరిశీలిస్తే నెట్, ఏపీ సెట్ ఇంచుమింగుగా ఒకే విధానంలో ఉంటుం ది. నెట్‌కు పోటీతో పాటు ప్రశ్నలు కఠినం గా ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ 100 మార్కులకు ఉంటుంది. ఒక్కోప్రశ్నకు రెండు మార్కులు కాగా 60 ప్రశ్నల్లో 50కి జవాబు రాయాలి. సివిల్స్ ప్రిలిమ్స్ స్థాయిలో ఈ పరీక్ష ఉంటుంది. రెండో పేపర్‌లో 100 మార్కులకి 50 ప్రశ్నలు ఉంటా యి. సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహనే ఈ పరీక్ష ఉద్ధేశ్యం.
మూడో పేపర్‌లో 150 మార్కులకి 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్‌లో అభ్యర్థిలో సబ్జెక్టు విశ్లేషణా సామర్థ్యా న్ని లోతుగా పరీక్షిస్తారు. సంపూర్ణ విషయ పరిజ్ఙానం ఉన్నవారు మాత్రమే ఈ పరీక్షలో విజయం సాధిస్తారు.
ఏటా పెరుగుతున్న పోటీ
జిల్లా నుంచి నెట్ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ ప్రవేశ పరీక్ష కు ప్రతిసారి 10 వేల మంది వరకు హాజరవుతుండగా, విజేతలుగా 100 లోపు మాత్రమే నిలుస్తున్నారు. ఏపీ సెట్‌కు 10 వేల మంది వరకు 2012లో హాజరుకాగా జిల్లాలో ఎనిమిది శాతం మంది అర్హత సాధించారు. చాలా మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచే స్తూనే ఈ సెట్‌లకు సిద్ధమవుతూ విజేతలుగా నిలుస్తున్నారు.
లోతైన విశ్లేషణా సామర్థ్యం అవసరం
నెట్‌లో విజయం సాధించాలంటే లోతైన విశ్లేషణా సామర్థ్యం అవసరం. జనరల్ స్టడీస్ కోసం వార్తా పత్రికలు, నెల వారీ మ్యాగ్‌జైన్లు చదవాలి. మనోరమ ఇయర్ పుస్తకం జనరల్ స్టడీస్‌కు ఉపయోగ పడుతుంది. పోస్టుగ్రాడ్యుయేషన్ సబ్జెక్టులో పూర్తిస్థాయి అవగాన ఉంటే రెండు మూడు పేపర్లలో మంచి స్కోర్ చేయొచ్చు. ఎంపిక కావాలంటే సంపూర్ణ సామర్థ్యం అవసరం.
- మల్ల పూర్ణసూరిగణేష్, నెట్ విజేత,
శ్రీ వెంకటేశ్వర మేనేజ్‌మెంట్ కళాశాల హెచ్ వోడీ
కంఠస్థ పద్ధతితో ప్రయోజనం ఉండదు
సబ్జెక్టుపై అవగాహన ఉండాలి. మూడు పేపర్లలోనూ స్కోర్ చేయగలగాలి. ప్రిపరేషన్ పక్కాగా ఉండాలి. పాత ప్రశ్న పత్రాలను, వస్తున్న ప్రశ్నల చాప్టర్లను పరిశీలించాలి. అవసరమైతే సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవాలి. ఒక్క సారి విఫలమైనా నిరాశ చెందకూడదు. మనలోపాలను సమీక్షించుకొని ముందుకు సాగినప్పుడే విజేతలుగా నిలుస్తాం.
- కూన మురళీమోహన్,
నెట్ విజేత, శ్రీకాకుళం
వేగంతో పాటు కచ్చితత్వం అవసరం
నెట్ పరీక్షలో విజేతగా నిలవాలంటే వేగంతో పాటు, కచ్చితత్వం ఉండాలి. అప్పుడే విజేతగా నిలుస్తాం. చదివేటప్పుడే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెల్సుకోవాలి. సందేహాలు అంటూ ఉండ కుండా జాగ్రత్త పడాలి. జనరల్ స్టడీస్ విషయంలో స్నేహితులలో కల్సి గ్రూప్ డిస్కషన్స్ వల్ల ప్రయోజనం ఉంటుంది. కనీసం ఏడాది పాటు శ్రమించి చదివితే విజయం సాధించవచ్చు. అరకొర ప్రిపరేషన్‌తో నె ట్‌కు హాజరు కావడం వల్ల ప్రయోజనం ఉండదు.
- కాద విజయ్‌కుమార్, నెట్ విజేత, శ్రీకాకుళం
ఎంతో శ్రమించాలి
నెట్, ఏపీసెట్‌లో విజయం సాధించాలం టే ఎంతో శ్రమించాలి. ఏపీసెట్ రెగ్యులర్‌గా నిర్వహించడం లేదు. దీని వల్ల నెట్‌కు విపరీతమైన పోటీ పెరుగుతుంది. ఏపీసెట్ 13 ఏళ్ల తరువాత 2012 ఆగస్టులో నిర్వహించారు. నెట్ పరీక్ష విధానం, ఏపీసెట్ పరీక్షా విధానం ఒకేలా ఉం టుంది. అందువల్ల ఒక్క పరీక్షకు అంకిత భావంతో చదివితే రెండీంటినీ సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
- హనుమంతు స్వప్నరేఖ, ఏపీసెట్ విజేత,
శ్రీశివానీ బోధకురాలు
అవగాహన పద్ధతితో ప్రయోజనం
ప్రతి అంశ ంపై అవగాహన ఉండాలి. సబ్జెక్ట్, జనరల్ స్టడీస్‌పై పట్టు అవసరం. సంపూర్ణ విషయ పరిజ్ఞానం ఉంటేనే నెట్, ఏపీ సెట్‌లలో విజయం సాధ్యమవతుంది. ప్రస్తుతం ఈ పరీక్షలకు పోటీ రోజురోజుకూ పెరుగుంది. అదే స్థాయిలో ప్రశ్నపత్రం కూడా కఠినం అవుతుం ది. అభ్యర్థులు పక్కా వ్యూహరచనతో చదివితేనే విజయం సాధ్యమవుతుంది.
- డాక్టర్ శ్రీసుధ, అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ
పరీక్ష రాయడం కూడా కీలకమే
పరీక్షకు ప్రిపరేషన్ ఒక ఎత్తు అయితే పరీక్ష రాయడం మరో ఎత్తు. పోటీ పరీక్ష ల్లో కచ్చితత్వం, వేగం ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. ఎంత చదివినా కొన్ని ప్రశ్నలకు ఆలోచ నాత్మకంగా జవాబు రాయాలి. పూర్వపు ప్రశ్న పత్రాలు, మోడల్ ప్రశ్న పత్రాలు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. పరీక్షలు ముందు ఎన్ని ఎక్కు వ మోడల్ ప్రశ్న పత్రాలు చేస్తే అంత ప్రయోజనం చేకూరుతుంది.
- డాక్టర్ గంజి సంజీవయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ
బోధనా రంగంలో సెట్ అవుదాం..!
Published Thu, Nov 27 2014 2:22 AM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM
Advertisement
Advertisement