స్టార్ హీరోహీరోయిన్ల సినిమాలే కాదు వారి పర్సనల్ విషయాలపై కూడా చాలామంది ఆసక్తి కనబరుస్తారు. తమ అభిమాన హీరో ఏ రంగు దుస్తులను ఇష్టపడతాడు? ఏ బ్రాండ్ కారు అంటే ఇష్టం? వాళ్ల ఆహారపు అలవాట్లు ఏంటి? తదితర విషయాలు తెలుసుకోని, ఫ్యాన్స్ కూడా అవి ట్రై చేస్తారు. ముఖ్యంగా దుస్తుల విషయంలో మాత్రం ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోహీరోయిన్లనే ఫాలో అవుతారు. సినిమాల్లో గానీ, బయట ఏదైన ఈవెంట్‌లో గానీ తమ హీరో కొత్త డ్రెస్‌తో కనిపిస్తే చాలు.. వెంటనే అది ఏ బ్రాండ్? కాస్ట్ ఎంత? ఎక్కడ లభిస్తుంది? తదితర వివరాలన్నీ గూగుల్ సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటారు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ ధరించిన షర్ట్ ధరపై నెట్టింట భారీ చర్చ జరుగుతోంది.
సింపుల్ లుక్కే కానీ.. వెరీ కాస్ట్‌లీ
రీసెంట్‌గా మహేశ్‌బాబు ఓ మొబైల్ కంపెనీ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఎప్పటిలాగే చాలా సింపుల్‌గా, బ్లాక్ కలర్ చెక్ షర్ట్ లో మహేశ్ ఎంట్రీ ఇచ్చారు. అందరి దృష్టి మహేశ్ బాబు ధరించిన షర్ట్‌పై పడింది. చూడడానికి చాలా సింపుల్‌గా ఉన్నా..దాని ధర మాత్రం చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన ఆ షర్ట్ ధర రూ. 18 వేలు. సెలబ్రెటీలు ఈ రేంజ్ దుస్తులు ధరించడం కామనే..కానీ సగటు వ్యక్తికి మాత్రం అది షాకింగ్ రేటే. అందుకే ఆ షర్ట్ ధర ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ‘మహేశ్ బాబు సంపాదన కోట్లలో ఉంటుందని కాబట్టి అది ఆయనకు చాలా తక్కువ ధరే..కానీ సామాన్యులకు మాత్రం ఒక నెల జీతం’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
గతంలో కూడా మహేశ్ షర్ట్‌పై చర్చ
మహేశ్ బాబు డ్రెస్‌పై చర్చ జరగడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా అనేక సార్లు మహేశ్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భరత్ అనే నేను చిత్రంలో మహేశ్ బాబు ధరించిన వైట్ షర్ట్ అప్పట్లో బాగా వైరల్ అయింది. అలాగే మహర్షి చిత్రంలో కాలేజీ ఎపిసోడ్‌లో మహేశ్ వేసుకున్న షర్ట్‌పై కూడా ఓ రేంజ్‌లో చర్చ జరిగింది. పోకిరి, అతిథి సినిమాల్లోని డ్రెస్సులు అదే పేరుతో మార్కెట్‌లోకి కూడా వచ్చాయి. అప్పట్లో చాలా మంది యువత ఆ డ్రెస్సులను ధరించారు.
సంక్రాంతికి ‘గుంటూరు కారం’
మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment