భర్త తనకు నచ్చినట్లు షర్ట్‌ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య | Rajasthan Woman Hangs to Death After Argument With Husband Over New Shirt | Sakshi
Sakshi News home page

భర్త తనకు నచ్చినట్లు షర్ట్‌ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య

Published Thu, Oct 21 2021 2:23 PM | Last Updated on Thu, Oct 21 2021 2:36 PM

Rajasthan Woman Hangs to Death After Argument With Husband Over New Shirt - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌: భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న వివాదాలే ఒక్కోసారి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. భర్త తనకు నచ్చినట్లు షర్ట్‌ కుట్టించుకోలేదని మనస్తాపానికి గురైన భార్య.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాలు..

ఈ సంఘటన రాజస్తాన్‌, ఆర్‌కే పురం స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అంజలి సుమన్‌ అనే మహిళకు రాజస్తాన్‌కు చెందిన శుభం అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు బాగానే ఉండేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం దంపతులిద్దరికి ఓ షర్ట్‌ విషయంలో గొడవ జరగింది. భర్త తనకు నచ్చినట్లు షర్ట్‌ కుట్టించుకోలేదని అతడితో గొడవపడింది అంజలి.
(చదవండి: వివాహితతో ప్రేమ.. యువకుడిని దారుణంగా కొట్టి )

చిన్నగా ప్రారంభం అయిన వివాదం కాస్త ముదరడంతో ఆగ్రహించిన శుభం.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అంజలి భర్తకు ఫోన్‌ చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక మాట్లాడదాం అని చెప్పాడు. అరగంట తర్వాత అతడి మొబైల్‌కు ఓ కాల్‌ వచ్చింది. విషయం ఏంటంటే అంజలి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికే అంజలి ఏకంగా ప్రాణాలు తీసుకోవడం ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది.

చదవండి: అవని ఆనందం ఆకాశమంత...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement