Unstoppable With Mahesh Babu Grand Finale Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చివరి ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌లో బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కాండ్ పడనుంది. గ్రాండ్ ఫినాలేలో బాలయ్య, మహేశ్‌ల మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది.
'ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతనే మహేశ్'.. అంటూ బాలయ్య తనదైన స్టయిల్‌లో మహేశ్‌ను ఆహ్వానించారు.ఇక తన కుమారుడు గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ ..తాట తీసేస్తది అంటూ మహేశ్ నవ్వులు పూయించాడు.ఓ సారి కేబీఆర్ పార్కుకి వాకింగ్‌కి వెళ్తే పాము కనిపించిందని, అప్పటి నుంచి మళ్లీ అటువైపు వెళ్లలేదంటూ సీక్రెట్ రివీల్ చేశాడు.మొత్తంగా ఆహా అనిపించేలా ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఉండనుంది స్పష్టమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment