నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఫినాలేలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ రేపు(ఫిబ్రవరి 4న) 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..
ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా సోషల్ మీడియా ఇది వీపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ రేపు(శుక్రవారం) ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన తక్కువ వ్యవధిలో మంచి వ్యూస్‌ను రాబట్టింది ఈ ప్రోమో. ఇందులో బాలయ్య మహేశ్ బాబును ఆటపట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది.
చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే..
మహేశ్ సంబంధించిన ఆసక్తికర సీక్రెట్స్‌ను రాబట్టడానికి బాలయ్య చేసిన సందడి బాగా ఆకట్టుకుంటోంది. ఇక నువ్వు చిన్నప్పుడు చాలా నాటీ బాయ్ అంట కదా అనగానే మహేశ్ సిగ్గు పడటం.. దీనికి చేసేవి చేస్తూనే చెప్పాడానికి సిగ్గు పడతావంటూ బాలయ్య వేసిన పంచ్ డైలాగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం నెటజన్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నటసింహం, సూపర్ స్టార్‌ల అల్లరి చూడాలంటే ఈ ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment