బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్‌తో మరింత సూపర్ హిట్‌గా నిలిచింది షో. దేశవ్యాప్తంగా ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ ఎపిసోడ్‌లోని పార్ట్-1 ఇప్పటికే స్ట్రీమింగ్ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా నిలిచిన ఈ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌కు ప్రభాస్ కాల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.
ఇదే క్రమంలో ప్రభాస్‌ని ఆటపట్టించిన రామ్ చరణ్ త్వరలోనే డార్లింగ్ మీ అందరికి గుడ్‌న్యూస్ చెబుతాడంటూ హింట్ ఇచ్చాడు. దీంతో అంతలోనే అందుకున్న బాలకృష్ణ.. ఆ అమ్మాయి చౌదరినా లేక శెట్టినా, లేక సనన్ హా? అంటూ ఇరికించే ప్రయత్నం చేయగా అది తాను చెప్పలేనని మీకే ఊహించుకోండంటూ క్లూ వదిలాడు.
దీంతో ‘రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్’ నువ్వు నా ఫ్రెండువా ? శత్రువా ?అంటూ ప్రభాస్ ఫన్నీగా బదులిచ్చాడు. ఇక ఎప్పుడూ బయట కలిసి కనిపించని.. ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న ఇంతలా బండింగ్ ఉందా? ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటున్నారంటూ వారి మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Charan and prabhas phone call#RamCharan#Prabhas pic.twitter.com/RsOzTX1VqV
— Ra_1 (@MahiCharan31) December 29, 2022
Mari intha close a #RamCharan and #Prabhas 😳 pic.twitter.com/OyBVV5HNew
— Teja (@tejarebel10) December 29, 2022
Comments
Please login to add a commentAdd a comment