బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 2కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ గురువారం రాత్రి 9 గంటలకి ఆహాలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ఆహా యాప్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాష్ అయ్యింది.
దీంతో ఓవర్ లోడ్ కారణంగా ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఇక ఈ విషయంపై ఆహా సంస్థ వెంటనే స్పందించింది. ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తాం అని ఆహా ట్విటర్ లో పేర్కొంది.
"డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ప్రేమతో మా యాప్ క్రాష్ అయింది. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము. మేము సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నాము. త్వరలో మళ్లీ ప్రారంభం అవుతుంది" అని ఆహా ట్విట్ చేసింది.
Your love is boundless darlingsss! Our app is offline but our love isn't.
— ahavideoin (@ahavideoIN) December 29, 2022
Give us just a little time while we fix it. We will be up and running in a jiffy!#PrabhasOnAHA#UnstoppableWithPrabhas#NandamuriBalakrishna
Comments
Please login to add a commentAdd a comment