
సాక్షి, చెన్నై : ఎక్కడా పొంతన లేని ఈ రెండింటి గురించి ప్రస్తావించింది ఎవరో కాదు కోలీవుడ్ కమెడియన్ వివేక్. బాయ్స్, అపరిచితుడు, శివాజీ తదితర చిత్రాలతో బాగా ఫేమస్ అయిన ఈ సీనియర్ నటుడికి ఈ రెండు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తాయంట.
కాస్త దిగులుగా అనిపిస్తే చాలూ నేను రెండు పనులు చేస్తాను. ఒకటి స్వామి వివేకానందుడి సూక్తులు చదవటం.. రెండోది బాలయ్య స్టంట్లు, డైలాగులు చూసి రిలాక్స్ అవ్వటం తద్వారా తాను ఉత్తేజం అవుతానని వివేక్ రెండు రోజలు క్రితం తన ట్విట్టర్‌లో తెలియజేశారు. అయితే ‘‘ఆ కిందే సర్ ఇది చూశాక డిసైడ్ చేసుకోండి’’ అంటూ... బాలయ్య తన అభిమానని కొట్టిన వీడియోను ఓ వ్యక్తి షేర్ చేయటం విశేషం.
When ever I feel low I do 2 things!1. read Swami Vivekananda 2: watch Balakrishna sir”s dialogues n stunts! Both energize me!
— Vivekh actor (@Actor_Vivek) November 5, 2017
సుమారు 400కి పైగా చిత్రాల్లో నటించిన వివేక్ పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ప్రస్తుతం ఆయనకు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. తాజాగా కమెడియన్ సంతానం హీరోగా రూపొందిన సక్క పొడు పొడు రాజా(తెలుగు లౌక్యం రీమేక్) చిత్రంలో వివేక్ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment