మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer Movie). శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైంది. రిలీజైన తొలి రోజే ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే.. మరికొందరేమో ఫర్వాలేదని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ మూవీపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) ప్రశంసలు కురిపించింది. ఈ సినిమా సక్సెస్ అయినందుకు అభినందనలు తెలిపింది. నువ్వు నిజమైన గేమ్ ఛేంజర్.. లవ్ యూ అంటూ తన భర్తను కొనియాడింది. ఈ మేరకు తన ట్విటర్‌లో పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో జాతీయ మీడియాలో వచ్చి గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ టైటిల్స్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా.. ఈ చిత్రంపై మొదటి నుంచి మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సముద్ర ఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Congratulations my dearest husband @AlwaysRamCharan
You truly are a game changer in every way.
Love u 🥰 ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/qU6v54rRbh— Upasana Konidela (@upasanakonidela) January 10, 2025
Comments
Please login to add a commentAdd a comment