
మెగాహీరో రామ్‌చరణ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం నుంచి స్వామి మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లడంతో పలువురు విమర్శించారు. కానీ, కొందరైతే అందులో తప్పేముందని చరణ్‌కు సపోర్ట్‌గా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
రామ్‌చరణ్‌పై విమర్శులు చేయడాన్ని ఉపాసన తప్పపట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్ ఫోటోను షేర్ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు. దేవుడిపై విశ్వాసం ఉంటే అందరినీ ఏకం చేస్తుందని ఆమె చెప్పారు. 'భక్తి ఎవరినీ చిన్నాభిన్నం చేయదు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మన బలం ఉంది. వన్ నేషన్.. వన్ స్పిరిట్' అని తెలిపారు.

రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కడప దర్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో వారిద్దరూ కలిసి కొత్త సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా వారు అక్కడకు వచ్చారు. గతంలో మగధీర విడుదల సమయంలో కూడా చరణ్ దర్గాను సందర్శించి అక్కడి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సినిమా చరణ్ కెరిర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. దీంతో కడప దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చరణ్ పేర్కొన్నారు. జనవరి 10న శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది.