
నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో టీఆర్పీ రేటింగులోనూ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తేజస్విని.. బాలయ్య స్ట్రిప్ట్ వర్క్‌కి సంబంధించి కీలక వ్యవహారాలనూ కూడా చూసుకుంటుందట.
అన్‌స్టాపబుల్ షో అంత పెద్ద హిట్ కావడం వెనుక ఆమె పాత్ర కూడా ఎంతో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం. బాలయ్య హీరోగా నటించే ఓ సినిమాకు ఆమె నిర్మాత బాధ్యతలు స్వీకరించబోతున్నారట. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. మరి తేజస్విని నిర్మాతగా సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment