
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే’. ఆహాలో ప్రసారమైన ఈ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. టీఆర్‌పీ రేటింగ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేసిన ఈ షో రెండో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఆ అవైటెడ్ మూమెంట్ ఇప్పుడు వచ్చేసింది. ఈ క్రమంలో తాజాగా ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’కు సంబంధించి ఆహా ఓ సాలిడ్ అప్‌డేట్‌ను వెల్లడించింది. అతి త్వరలోనే ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్-2ను ప్రారంభం అవుతుందని, దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ షోపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. పండగ మొదలయ్యేది అప్పుడే అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఈ టాక్ షో దసరా నుంచి ప్రారంభం కానుందని తెలుస్తుంది. మరి ఈ సూపర్‌హిట్ షో సీజన్-2కి వచ్చే ఫస్ట్ గెస్ట్ ఎవరన్నది చూడాల్సి ఉంది.
It's that time of the year and festival begins soon!🥳🎉
— ahavideoin (@ahavideoIN) September 16, 2022
Debbaku thinking maarpiovala.#UnstoppableWithNBK2 athi thvaralo...🔥#nandamuribalakrishna@realmeIndia @tnldoublehorse #chandanabrothers @Fun88India #mansion_house pic.twitter.com/LQHw2MzAMP
Comments
Please login to add a commentAdd a comment