
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో మంగళవారం రాత్రి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఆహా ఓటీటీ అన్‌స్టాపబుల్ సీజన్–2 ఈవెంట్ లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కానూరు 100 అడుగుల రోడ్డులో ప్రత్యేంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఆయన అభిమానులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి రామయ్య సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారంలో అన్‌స్టాపబుల్ ఈవెంట్ సీజన్ వన్‌ను విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు సీజన్–2 అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.