సంక్రాంతి బరిలో దిగేందుకు పెద్ద సినిమాలు సై అంటున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, దళపతి విజయ్ వారిసు సంక్రాంతికి వస్తుండగా తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా రేసులో నిలబడ్డాడు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయిక. దునియా విజయ్, వరలక్క్క్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
చదవండి: మట్టి కుస్తీ.. అలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకుంటాడు
Comments
Please login to add a commentAdd a comment