
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సుగుణ సుందరి..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ వీడియో లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ ప్రకటించింది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment