
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగ ప్రపంచవ్యాప్తంగా నేడు(జనవరి 12) థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేశారు.
(ఇది చదవండి: ‘వీరసింహారెడ్డి’ మూవీ ట్విటర్ రివ్యూ)
థియేటర్లో రచ్చ రచ్చ చేశారు. సినిమా ప్రదర్శనలో ఉండగానే కాగితాలు చించి విసిరేస్తూ హంగామా సృష్టించారు. దీంతో బాలయ్య అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం ప్రేక్షకులను బయటకు పంపించివేసింది. గతంలో తెలుగు సినిమాలను చాలా ప్రదర్శించామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని యాజమాన్యం వెల్లడించింది. మరో థియేటర్‌లో జై బాలయ్య అని అరవొద్దంటూ యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment