Akkineni Fans Fires On Nandamuri Balakrishna Controversy Comments - Sakshi
Sakshi News home page

అలాంటి వారిపై జోకులేంటి?..బాలయ్యపై అక్కినేని ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Tue, Jan 24 2023 2:59 PM | Last Updated on Tue, Jan 24 2023 9:05 PM

Akkineni Fans Fires On Nandamuri Balakrishna Movie Controversy Comments - Sakshi

నందమూరి బాలకృష్ణపై అక్కినేని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఫైర్‌ అవుతున్నారు. తన అభిమాన హీరో, గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదివారం జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌ విషయాలను ప్రస్తావిస్తూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’. అని బాలకృష్ణ అన్నారు.

(చదవండి: బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ ఫైర్‌)

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాలయ్య వ్యాఖ్యలపై ఆల్‌ ఇండియా అక్కినేని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సర్వేశ్వరరావు మండిపడ్డారు. ‘బాలయ్య స్టేజ్‌పై ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. మహానటుల గురించి జోక్‌గా మాట్లాడుకోవడం చాలా పెద్ద తప్పు. ఏన్నాఆర్‌ నాకు బాబాయ్‌ లాంటివాడు అని చెప్పుకునే బాలకృష్ణ.. ఆయన వర్థంతి రోజు(జనవరి 22).. వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌ పెట్టుకోవడం ఏంటి? అభిమానం ఉంటే ఒక్క నిమిషం మౌనం పాటించాలి. నాగార్జున ఎప్పుడైనా నందమూరి హీరోల గురించి మాట్లాడారా? బతికున్నంత కాలం నటించిన గొప్ప వ్యక్తి నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తిని కించపరచడం అంటే తెలుగు ఇండస్ట్రీని అవమానించినట్లే. బాలకృష్ణ వెంటనే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలి’ అని సర్వేశ్వరరావు డిమాండ్‌ చేశారు. 

కాగా, బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు హీరో నాగచైతన్య, నిఖిల్‌ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్‌ ట్వీట్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement