Akkineni fans
-
బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే.. అక్కినేని ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. తన అభిమాన హీరో, గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ విషయాలను ప్రస్తావిస్తూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’. అని బాలకృష్ణ అన్నారు. (చదవండి: బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్) దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య వ్యాఖ్యలపై ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు మండిపడ్డారు. ‘బాలయ్య స్టేజ్‌పై ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. మహానటుల గురించి జోక్‌గా మాట్లాడుకోవడం చాలా పెద్ద తప్పు. ఏన్నాఆర్ నాకు బాబాయ్ లాంటివాడు అని చెప్పుకునే బాలకృష్ణ.. ఆయన వర్థంతి రోజు(జనవరి 22).. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ పెట్టుకోవడం ఏంటి? అభిమానం ఉంటే ఒక్క నిమిషం మౌనం పాటించాలి. నాగార్జున ఎప్పుడైనా నందమూరి హీరోల గురించి మాట్లాడారా? బతికున్నంత కాలం నటించిన గొప్ప వ్యక్తి నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తిని కించపరచడం అంటే తెలుగు ఇండస్ట్రీని అవమానించినట్లే. బాలకృష్ణ వెంటనే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలి’ అని సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. కాగా, బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు హీరో నాగచైతన్య, నిఖిల్ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు. -
శిల్పాకు అక్కినేని ఫ్యాన్స్ మద్దతు
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ సీపీకి మద్దతు పెరుగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య రోజురోజుకు ఎగబాకుతోంది. ఆయనకు నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు నిన్న మద్దతు ప్రకటించారు. తాజాగా అక్కినేని అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా మోహన్‌రెడ్డికి ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించించింది. అక్కినేని అభిమానులు అందరూ శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కినేని ఫ్యాన్స్ ఆలిండియా అధ్యక్షుడు ఏవీ రామరాజు విజ్ఞప్తి చేశారు. కాగా, సూపర్‌స్టార్ కృష్ణ, 'ప్రిన్స్' మహేశ్‌బాబు అభిమానులు వైఎస్సార్ సీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారని నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. -
ఏయన్నార్ పంచెలతో... సోగ్గాడి పంచ్‌లు
‘‘ఏయన్నార్ అంటే పంచెకట్టు... పంచెకట్టు అంటే ఏయన్నార్. అంతలా నాన్న గారి పంచెకట్టు బాగా పాపులర్. నాన్న పంచెకట్టుతో చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. నాన్న పాత సినిమాల్లో వాడిన పంచెలను నేనీ సినిమా కోసం వాడాను. అలాగే 1959లో నాన్న కొన్న రిస్ట్‌వాచ్‌ను కూడా నేను ఉపయోగించాను. అందుకే ఈ ‘బంగార్రాజు’ గెటప్ అక్కినేని అభిమానులకు తీపి గుర్తుగా నిలిచిపోతుంది’’ అంటున్నారు నాగార్జున. కళ్యాణ్‌కృష్ణ కురసాలను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగార్జున నిర్మించిన ఈ చిత్రం రానున్న సంక్రాంతికి రానుంది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ నాయికలుగా నటించారు.