
అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. రేపు ఒంగోలులో జరగబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో రాత్రి 8.17 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
వీరసింహుడి ఉగ్రరూపం చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందేనంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇక వీరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే ఇందులో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
వీరసింహుడి ఉగ్రరూపం 🔥#VeeraSimhaReddyTrailer on 6th Jan at 8:17 PM 🔥#VeeraSimhaReddyOnJan12th#VeeraSimhaReddy
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2023
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth @shreyasgroup pic.twitter.com/mZShvqH6Iv
చదవండి: లాభాలు తెచ్చే సత్తా లేదు కానీ కోట్ల పారితోషికం కావాలి
Comments
Please login to add a commentAdd a comment