
బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘వీరసింహారెడ్డి’ ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తమన్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య..’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. 2023 జనవరి 12న సంక్రాంతికి మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సీఈవో: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ.
Comments
Please login to add a commentAdd a comment