Sankranti Movies
-
Sankranthi 2025: కర్చీఫ్ మడతపెట్టి...!
సంక్రాంతికి ‘కుర్చీని మడతపెటి...’ అంటూ ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు చేసిన సందడి ఇంకా వినబడుతోంది. పండగ వెళ్లి మూడు నెలలు కూడా కాకముందే వచ్చే సంక్రాంతి కోసం కర్చీఫ్ మడతపెట్టి, పండగ బరిలో సీట్ రిజర్వ్ చేసుకున్నారు కొందరు స్టార్స్. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటనలు రావడం, చివరి నిమిషంలో కొన్ని సినిమాలు తప్పుకోవడం మామూలే. ఇక 2025 సంక్రాంతి రేసులో ఇప్పటివరకూ షురూ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. విశ్వంభర వస్తున్నాడు సంక్రాంతికి పండక్కి చాలా హిట్స్ సాధించారు చిరంజీవి. 2023లో ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతికి వచ్చి మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. మళ్లీ 2025లో ‘విశ్వంభర’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. జనవరి 10న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌లో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారనీ టాక్. అలాగే ఈ చిత్రంలో చిరంజీవిది హనుమంతుడి భక్తుడి పాత్ర అట. భార్య.. మాజీ ప్రేయసి.. మధ్యలో మాజీ పోలీసాఫీసర్ ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ ‘సైంధవ్’ రిలీజైంది. వచ్చే సంక్రాంతికి కూడా రానున్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి.. ఇలా ఈ మూడు పాత్రల చుట్టూ సాగే క్రైమ్ కామెడీ మూవీ ఇది. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘శతమానం భవతి పేజీ 2’ ఉందని, 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ‘దిల్’ రాజు ప్రకటించారు. ఇప్పుడు వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లోని సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. మళ్లీ బంగార్రాజు వస్తాడా? ‘నా సామిరంగ’ అంటూ ఈ ఏడాది సంక్రాంతికి హిట్ సాధించారు నాగార్జున. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో ‘సంక్రాంతికి కలుద్దాం’ అన్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి కూడా నాగార్జున ఓ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని ఊహించవచ్చు. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’, 2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్) సినిమాలతో హిట్స్ అందుకున్నారు నాగార్జున. సో.. 2025 సంక్రాంతికి ‘బంగార్రాజు 3’ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నారట. మరి.. నాగార్జున ఏ సినిమాను రిలీజ్ చేస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. లక్మణ్ భేరి రెడీ రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి, చివరి నిమిషంలో ఇండస్ట్రీ మేలు కోసం అంటూ వాయిదా పడింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజైంది. ఈసారి పక్కాగా సంక్రాంతికి రావాలనుకుంటున్నారు రవితేజ. అందుకే తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాలో లక్మణ్ భేరి పాత్రలో కనిపిస్తారు రవితేజ. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని టాక్. మరోవైపు 2021 సంక్రాంతికి ‘క్రాక్’ సినిమాతో వచ్చి రవితేజ హిట్ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇంకా... ప్రభాస్ హీరోగా నటిస్తున్న‘రాజా సాబ్’ 2025 సంక్రాంతికి వచ్చే చాన్స్ ఉందని ఇటీవల పేర్కొన్నారు ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌పై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇకపై ప్రతి సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ. మరి.. వచ్చే సంక్రాంతికి ప్రశాంత్ నుంచి వచ్చే సినిమాపై ఇంకా ప్రకటన రాలేదు. ఇలా సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయని తెలిసింది. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో డబ్బింగ్ చిత్రాలు ఉంటుంటాయి. ఇలా అజిత్ హీరోగా నటించనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతి విడుదలకు ఖరారైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా 2025 సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇంకా కన్నడ ఫిల్మ్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: ది లెజెండ్ చాప్టర్ 1’ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. -
సంక్రాంతి బరిలో రవితేజ... మహేష్ బాబు తప్పుకుంటాడా!
-
సంక్రాంతి బరిలో...
హిట్ ఫిల్మ్ ‘గీత గోవిందం’ (2018) తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్స్ లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ . ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైందని వెల్లడించి, ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా శనివారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: కేయూ మోహనన్స్ . -
సంక్రాంతి సంబరం... బాక్సాఫీస్ సమరం
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా సంక్రాంతి సమరానికి బాక్సాఫీస్ ముస్తాబవుతోంది. థియేటర్ అనే గ్రౌండ్లో ప్రేక్షకులే సాక్షిగా బాక్సాఫీస్ బరిలో కలెక్షన్స్ పందేనికి కత్తులు కట్టిన కోడి పుంజుల్లా రెడీ అయ్యారు నలుగురు స్టార్ హీరోలు. వీరితో పాటు యంగ్ హీరో కూడా వస్తున్నాడు. పండగ సందర్భంగా సినిమాలు రావడం సినీ ప్రేమికులకు సంబరం... బాక్సాఫీస్‌కి వసూళ్ల సమరం. ఇక.. ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంక్రాంతి ఈ నెల 13న ఆరంభమవుతుంది. కానీ సినిమా సంక్రాంతి మాత్రం రెండు రోజులు ముందుగానే అంటే జనవరి 11న స్టార్ట్ అవుతుంది. తమిళ హీరోలు విజయ్ నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’), అజిత్ ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’) చిత్రాలు జనవరి 11నే విడుదల కానున్నాయి. విజయ్, రష్మికా మందన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వారసుడు’. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఓ సంపన్న ఉమ్మడి కుటుంబంలో చోటు చేసుకునే వివిధ సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ‘నేర్కొండ పార్వై’ (హిందీ ‘పింక్’ తమిళ రీమేక్), ‘వలిమై’ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్ల కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం ‘తెగింపు’ (తమిళంలో ‘తునివు’). ఈ యాక్షన్ ఫిల్మ్ కథాంశం బ్యాంకు రాబరీ నేపథ్యంలో ఉంటుంది. బ్యాంకును హైజాక్ చేసిన ఓ వ్యక్తి, ఆ బ్యాంకు కస్టమర్లను హోస్టేజ్‌గా చేసి తన లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తాడు. ‘తెగింపు’ ప్రధానాంశం ఇదే అని తెలుస్తోంది. కాగా జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’గా వస్తున్నారు బాలకృష్ణ. ‘అఖండ’ వంటి హిట్ తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన ఈ ‘వీరసింహారెడ్డి’లో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న వస్తున్నారు చిరంజీవి. ఆయన టైటిల్ రోల్లో నటించి, హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు కొల్లి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు. శ్రుతీహాసన్ నాయిక. శ్రీకాకుళంలో నివాసం ఉండే వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కు, మరో ఏరియాలో ఉండే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ (రవితేజ)లకు మధ్య ఉన్న అనుబంధం, పగ అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లే నిర్మించారు. ఇక ప్రతి సంక్రాంతికి పెద్ద స్టార్స్ మధ్య చిన్న హీరోల సినిమాలూ రిలీజ్ అవుతాయి. ఈ సంక్రాంతికి ఈ జాబితాలో నిలిచిన మూవీ ‘కళ్యాణం కమనీయం’. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఆళ్ల అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. శివ (సంతోష్), శ్రుతి (ప్రియా) ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే శివకు జాబ్ లేకపోవడం వారి మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది చిత్రం ప్రధానాంశం. మరి.. ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమాకు ప్రేక్షకులు ‘సంక్రాంతి హిట్’ ట్యాగ్ ఇస్తారో చూడాలి. -
ఒక్క పాటతో పూర్తి
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘వీరసింహారెడ్డి’ ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమన్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య..’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. 2023 జనవరి 12న సంక్రాంతికి మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సీఈవో: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ. -
టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం
అనువాద చిత్రాల వివాదం ముదిరేలా కనబడుతోంది. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించే విషయమై, ఇతర సమస్యల గురించి చర్చలు జరపడానికి ఆ మధ్య తెలుగు సినిమాల షూటింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిందనే టాక్ వినిపించింది. అయితే ‘వారిసు’ తమిళ సినిమా కాబట్టి షూటింగ్ ఆపలేదని ‘దిల్’ రాజు పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ‘వారిసు’ తమిళ సినిమాయే అనే ముద్ర పడిపోయింది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారిసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా సంక్రాంతి సందర్భంగానే నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే అనిల్ సుంకర నిర్మించిన ‘ఏజెంట్’ సంక్రాంతి రిలీజ్‌కే ముస్తాబు అయ్యింది. వీటితో పాటు తమిళంలో అజిత్ ‘తునివు’ కూడా సంక్రాంతి రిలీజ్‌కే రెడీ అవుతోంది. దాంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల థియేటర్ల సంఖ్య గురించిన అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక–నిర్మాతలు అసహనంగా ఉన్నారని టాక్. ఒకవేళ తెలుగులో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమిళంలోనూ తెలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించ కూడదన్నట్లుగా కోలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్స్‌లో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపడం అనేది జరిగే పని కాదని ‘తోడేలు’ ఈవెంట్లో అల్లు అరవింద్ పేర్కొన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాల రిలీజ్‌లను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్స్‌లో తొలి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌ను కోరుతూ లేఖ రాశాం’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : సమ్మర్ సినిమాలన్ని వాయిదా
సినిమాలకు బెస్ట్ సీజన్ అంటే నాలుగు... సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి. ఉగాది, క్రిస్మస్లకు కూడా సినిమాలు వస్తుంటాయి. అయితే వసూళ్లకు మొదటి నాలుగు పండగలే ప్రధానం. 2020లో సంక్రాంతి సందడి బాగానే సాగింది. అయితే కరోనా దెబ్బకు సమ్మర్ సంబరం మిస్సయింది. దసరా, దీపావళికి కూడా సినిమా పండగ లేదు. సంవత్సరాంతంలో మెల్లిగా సినిమాల విడుదల ఆరంభమైంది. 2021లో సంక్రాంతి సందర్భంగా వెండితెరకు బోలెడన్ని బొమ్మలు వచ్చాయి. కానీ ఈసారి కూడా సమ్మర్ సంబరం పోయే పోచ్! కరోనా సెకండ్ వేవ్‌తో వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. గత సమ్మర్‌కి మార్చి చివర్లో థియేటర్లకు లాక్‌పడింది.. ఈ సమ్మర్ కూడా సందడి మిస్. వేసవి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. పరీక్షలను పూర్తి చేసుకున్న విద్యార్థులు, తమ పిల్లలతో సరదాగా సమయం గడిపేందుకు పెద్దలు ప్రధానంగా ఎంచుకునేది థియేటర్స్‌లో సినిమా చూడడం. అందుకే సంక్రాంతి తర్వాత నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడే సీజన్ సమ్మరే. కానీ కరోనా కారణంగా గత ఏడాది సమ్మర్‌కి బాక్సాఫీసు కుదేలయింది. ఈ సమ్మర్‌కి అయినా సినిమాల సందడి ఉంటుందనుకుంటే సెకండ్ వేవ్ కారణంగా ఈసారీ నిరాశే. మార్చి మొదటివారం నుంచి ఏప్రిల్ 9 వరకు థియేటర్స్ వంద శాతం సీటింగ్‌తో నడిచాయి. ఈ సమయంలో ‘వైల్డ్ డాగ్, వకీల్‌సాబ్, రంగ్ దే, జాతిరత్నాలు’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు షెడ్యూల్ అయిన సినిమాల్లో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ (ఏప్రిల్ 16), నాని ‘టక్ జగదీష్’ (ఏప్రిల్ 23), కంగనా రనౌత్ ‘తలైవి’ (ఏప్రిల్ 23), రానా ‘విరాటపర్వం’ (ఏప్రిల్ 30) ఇప్పటికే అధికారికంగా వాయిదా పడ్డాయి. అలాగే మే నెలలో విడుదలకు షెడ్యూల్ అయిన పెద్ద చిత్రాల్లో చిరంజీవి ‘ఆచార్య’ (మే 13) కూడా వాయిదా పడింది. ఇవే కాదు.. వెంకటేశ్ ‘నారప్ప’ (మే 14), బాలకృష్ణ ‘అఖండ’ (మే 28), రవితేజ ‘ఖిలాడి’ (మే 28) చిత్రాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇలా ఈ సమ్మర్ కూడా వెండితెరపై బొమ్మ పడకుండా ముగిసిపోయేలా ఉంది. వెండితెర వెలవెల చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది వేసవికి సినిమా పండగ లేకుండాపోయింది. 2020 మార్చి 13న విడుదలైన సినిమాలు ఓ మూడు నాలుగు రోజులు థియేటర్లలో ఉండి ఉంటాయేమో! ఆ తర్వాత కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ వల్ల సినిమా థియేటర్లకు లాక్ పడింది. 13న ఓ పది చిన్న సినిమాల వరకూ విడుదలయ్యాయి. వాటిలో ‘బగ్గిడి గోపాల్, మద, అర్జున’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమాల విడుదలకు బ్రేక్ పడటంతో సమ్మర్ సంబరం మిస్సయింది. ఈసారి కూడా అదే జరిగింది. ఏప్రిల్ 2న నాగార్జున ‘వైల్డ్ డాగ్’, 9న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ విడుదలయ్యాయి. ఆ తర్వాత విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ వేసవి కూడా వెండితెర వెలవెలపోవడం సినీప్రియులకు బాధాకరం. నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి.. సినిమాని నమ్ముకున్న అందరికీ బాధాకరమే. ఓటీటీలో సినీ హవా తీసిన సినిమా హార్డ్ డిస్క్లోనే ఉండిపోతే నిర్మాతల హార్ట్ హెవీ అయిపోతుంది. పెరిగే వడ్డీలు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఈ పరిస్థితుల్లో కొందరు చిన్న నిర్మాతలకు ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్ ఓ ఊరట అయింది. గతేడాది లాక్డౌన్లో నేరుగా ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతారామం’. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి చిన్న, మీడియమ్ బడ్జెట్ చిత్రాలు బోలెడన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యాయి. వాటిలో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫొటో’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి చిత్రాలులొచ్చాయి. ఇలా ఆ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకూ ఓటీటీలో విడుదలై, ఇంటికే వచ్చిన సినిమాలెన్నో. పరిస్థితులు చూస్తుంటే ఇకముందు కూడా ఓటీటీ హవా కొనసాగేలా ఉంది. స్మాల్.. మీడియమ్‌లు కూడా... వేసవిలో పెద్ద సినిమాలే కాదు..పెద్ద సినిమాల మధ్యలో చిన్న, మీడియమ్ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఆ సినిమాలు కూడా ఈసారి వాయిదా పడ్డాయి. అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, తేజా సజ్జా ‘ఇష్క్’, శ్రీకాంత్ ‘తెలంగాణ దేవుడు’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’ వంటి ఆ జాబితాలో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 30న రిలీజ్‌కు సిద్ధమైన అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్’ అనూహ్యంగా ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోలోగా.. ధైర్యంగా... గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. -
సినీ పండగ కళ
సంక్రాంతి మనకు పెద్ద పండగ. సినిమావాళ్లకు ఇంకా పెద్ద పండగ. ఆల్రెడీ థియేటర్స్‌లో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. త్వరలో రాబోయే సినిమాల మీటరేంటో.. మ్యాటరేంటో.. పోస్టర్స్, ప్రోమో రూపంలో వచ్చాయి. సంక్రాంతికి సందడి తీసుకొచ్చిన సినిమాల విశేషాలేంటో చూద్దాం. ► రవితేజ డబుల్ యాక్షన్ చేస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ దర్శకుడు. సంక్రాంతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ► 2019లో ‘ఎఫ్2’కి సంక్రాంతి అల్లుళ్లుగా సందడి చేశారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ‘ఎఫ్ 3’ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసారి ఈ తోడల్లుళ్ల ఫుల్ టార్గెట్ డబ్బు సంపాదనే అట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ► విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్ అగర్వాల్, రుహానీ శర్మ ముఖ్య పాత్రలు చేశారు. భారీ ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు జెఫ్రీ చిన్ దర్శకుడు. ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ► ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మారారు అఖిల్. పూజా హెగ్డే జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు. ► సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతీ శెట్టి కథానాయిక. విజయ్ సేతుపతి విలన్. బుచ్చిబాబు సన దర్శకుడు. ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలయింది. ► రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకుడు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ► మాఫియా నేపథ్యంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకుడు. ఈ సినిమాలో సుదీప్ కీలక పాత్రలో నటించనున్నారు. సుదీప్ లుక్‌ను విడుదల చేశారు. ► బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లాక్ రోజ్’. మోహన్ భరద్వాజ్ దర్శకుడు. సంక్రాంతికి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ► ‘వెయ్యి అబద్ధాలు ఫేమ్ ఎస్తేర్ ముఖ్య పాత్రలో ‘హీరోయిన్’ అనే సినిమా ప్రకటించారు. తిరుపతి ఎస్ఆర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఎస్తేర్ శృంగార తారగా నటించనున్నారు. ► వశిష్ట సింహా, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’ పోస్టర్ విడుదలయింది. ►