డేరింగ్ అండ్ బోల్డ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోడా పోడీ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెండితెరపై తన బౌండరిలను చేరిపేసుకుని నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో డిగ్లామర్స్ రోల్స్‌కే కాదు విలన్ పాత్రలకు సైతం సై అంటుంది. అలా సినిమాల్లో లేడీ విలన్‌గా విజృంభిస్తోంది. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగు, తమిళం, మలయాళంలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.
చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ
ఇక రీసెంట్‌గా ఆమె తెలుగులో బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రంలో నటించింది. ఇందులో సొంత అన్నయ్యను చంపే చెల్లెలిగా ప్రతినాయకి పాత్రలో మెప్పించింది. ఇందులో తన నటనకు ఆమె ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత తనని చంపేస్తారని మూవీ షూటింగ్ సమయంలో భయాందోళనకు గురయ్యానంది. తాజాగా జరిగిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో వరలక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ సినిమాలో బాలయ్యను పొడిచి చంపే సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడ్డాను.
చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు
ఆ సీన్ చూశాక.. బాలయ్య అభిమానులు నాపై పగ పెంచుకుని చంపుతారేమో అని ఆందోళనకు గరయ్యా. షూటింగ్‌లో ఈ సీన్ చేసేటప్పుడు నేను భయంతో ఇబ్బంది పడ్డాను. అది చూసి బాలయ్య నాలో ధైర్యం నింపారు. ఈ సీన్ చేస్తున్నప్పుడు నేను భయపడుతుంటే ‘ఎందుకు భయం?’ అని అడిగారు. ఇది చూశాక మీ ఫ్యాన్స్ నెగిటివ్‌గా తీసుకుంటారేమో, నాపై విరుచుకుపడతారమో అని ఆయనతో అన్నాను. దీనికి బాలయ్య స్పందిస్తూ.. ‘నెగెటివ్‌గా ఏం తీసుకోరని.. పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటారు’ అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మీరందరూ ఆ సీన్‌ని పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నందకు ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment