Maa Bava Manobhavalu Song Release From Veera Simha Reddy - Sakshi
Sakshi News home page

Veera Simha Reddy: ‘మా బావ మనోభావాలు..’సాంగ్‌ వచ్చేసింది.. బాలయ్య స్టెప్పులు అదుర్స్‌

Published Sat, Dec 24 2022 6:25 PM | Last Updated on Sat, Dec 24 2022 7:13 PM

Maa Bava Manobhavalu Song Release From Veera Simha Reddy - Sakshi

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్‌ సాంగ్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

 'మా బావ మనోభావాలు' అంటూ సాగే ఈ పాట..మాస్‌ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేలా ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌.. థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేసేలా  ఈ పాటను కంపోజ్‌ చేశాడు. హీరోయిన్లు హానీ రోజ్, చంద్రికా రవిలతో బాలయ్య వేసే స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి  లిరిక్స్‌ అందించగా.. సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ చక్కగా ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా  జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement