
సాక్షి, ఒంగోలు (ప్రకాశం జిల్లా): బాలకృష్ణ చిత్రం వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై వస్తున్న వార్తలపై అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈవెంట్‌కి పోలీసులు మొదట అనుమతి ఇచ్చి తర్వాత అనుమతి నిరాకరించారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. మొదట ఏబీమ్ స్కూల్ ఆవరణలో వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్వహకులు సన్నాహాలు చేసుకున్నారని.. ఆ విషయం మేం తెలుసుకొని నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ ఈవెంట్ చేస్తే పార్కింగ్‌కి, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని నచ్చ చెప్పామన్నారు.
పక్కనే రైల్వే స్టేషన్, ఆసుపత్రులు ఉనందున్న ప్రజల రాకపోకలకు ఇబ్బందవుతుందని సూచించామని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో ఈవెంట్ జరుపుకోమని సూచించామని, దానికి నిర్వాహకులు కూడా సమ్మతించి.. ఈవెంట్ ప్లేస్ మార్చుకున్నారన్నారు. మొదట మేము అనుమతి ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నామన్న వార్తలలో వాస్తవం లేదని ఆయన తెలిపారు.
రేపు ఒంగోలు-గుంటూరు రోడ్డు అర్జున్ ఇన్‌ఫ్రాలో జరిగే వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వారు అడిగిన దాని కన్నా ఎక్కువే భద్రత ఇస్తున్నామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్‌ను కూడా డైవర్ట్ చేస్తున్నామని, ఇటువంటి ఇబ్బంది లేకుండా హీరో బాలకృష్ణ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి సహకరిస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు.
చదవండి: సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఆయన లేకపోతే..
Comments
Please login to add a commentAdd a comment