Additional SP
-
Hyderabad: గుండెపోటుతో డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు మృతి
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు కుమారుడు చంద్రతేజ్ (20) మృతి చెందాడు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వారి స్వగ్రామం నల్లగొండ జిల్లాకు తరలించారు. కాగా చంద్రతేజ్ ఓ ప్రైవేటు కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. స్వతహాగా వ్యాపరంలో రానిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి తండ్రి వెంకటేశ్వర్లుకు కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ లోపే చిన్న కుమారుడు మృతితో చంద్రతేజ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
సాక్షి, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా, తిరుమలకు ఆ వాహనాలను నిషేధిస్తామని తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిందన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం కారణాల వద్ద స్వల్ప రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్డులో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని, డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు, సలహాలు ఇచ్చే విదంగా చర్యలు చేపట్టామన్నారు. ఇక ఘాట్ రోడ్డులో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తామని, ఘాట్ రోడ్డులో పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే, ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య అన్నారు. చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది! -
వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై స్పందించిన అడిషనల్ ఎస్పీ
సాక్షి, ఒంగోలు (ప్రకాశం జిల్లా): బాలకృష్ణ చిత్రం వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై వస్తున్న వార్తలపై అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈవెంట్‌కి పోలీసులు మొదట అనుమతి ఇచ్చి తర్వాత అనుమతి నిరాకరించారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. మొదట ఏబీమ్ స్కూల్ ఆవరణలో వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్వహకులు సన్నాహాలు చేసుకున్నారని.. ఆ విషయం మేం తెలుసుకొని నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ ఈవెంట్ చేస్తే పార్కింగ్‌కి, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని నచ్చ చెప్పామన్నారు. పక్కనే రైల్వే స్టేషన్, ఆసుపత్రులు ఉనందున్న ప్రజల రాకపోకలకు ఇబ్బందవుతుందని సూచించామని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో ఈవెంట్ జరుపుకోమని సూచించామని, దానికి నిర్వాహకులు కూడా సమ్మతించి.. ఈవెంట్ ప్లేస్ మార్చుకున్నారన్నారు. మొదట మేము అనుమతి ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నామన్న వార్తలలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. రేపు ఒంగోలు-గుంటూరు రోడ్డు అర్జున్ ఇన్ఫ్రాలో జరిగే వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వారు అడిగిన దాని కన్నా ఎక్కువే భద్రత ఇస్తున్నామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్‌ను కూడా డైవర్ట్ చేస్తున్నామని, ఇటువంటి ఇబ్బంది లేకుండా హీరో బాలకృష్ణ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి సహకరిస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. చదవండి: సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఆయన లేకపోతే.. -
ఏపీలో 40 మంది డీఎస్పీలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది డీఎస్పీ (సివిల్)లకు అదనపు ఎస్పీ (సివిల్)లుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఈ డీఎస్పీల పదోన్నతుల అంశం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్పీలు ఈ విషయం గురించి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 40 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై కోర్టులో లేదా ట్రిబ్యునల్‌లో ఏవైనా కేసులు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై తీర్పుకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన డీఎస్పీలు వీరే.. సి.జయరాంరాజు, ఇ.నాగేంద్రుడు, జి.వెంకటేశ్వరరావు, ఏవీ సుబ్బరాజు, కె.శ్రీలక్ష్మి, జి.రామకృష్ణ, ఆర్.రమణ, ఎ.శ్రీనివాసరావు, లింగాల అజయ్‌ప్రసాద్, ఏవీఆర్ పీవీ ప్రసాద్, బి.నాగభూషణరావు, పి.మహేశ్, జి.స్వరూపరాణి, టి.ప్రభాకర్ బాబు, జేవీ సంతోష్, నడికొండ వెంకట రామాంజనేయులు, డి.శ్రీ భవానీ హర్ష, డి.సూర్య శ్రావణకుమార్, వీబీ రాజ్ కమల్, కె.శ్రావణి, ఎం.చిదానందరెడ్డి, దిలీప్ కిరణ్ వండ్రు, కె.నాగేశ్వరరావు, అనిల్ కుమార్ పులపాటి, కె.సుప్రజ, జి.వెంకట రాముడు, హస్మా ఫరీణ్, పి.సౌమ్యలత, బి.విజయభాస్కర్, డి.ప్రసాద్, జె.కులశేఖర్, కె.శ్రీనివాసరావు, పూజిత నీలం, ఎం.స్నేహిత, జె.వెంకట్రావ్, సీహెచ్ సౌజన్య, ఏటీవీ రవికుమార్, మహేంద్ర మాతే, ఎ.రాజేంద్ర, బి.శ్రీనివాసరావు. -
ఏఎస్పీ దక్షిణ మూర్తి మృతి బాధాకరం: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రంతీ వ్యక్తం చేశారు. దక్షిణమూర్తి మృతి చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణమూర్తి ఎస్సై స్థానం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్పీ స్థాయికి ఎదిగారని కొనియాడారు. అంకితభావంతో పనిచేస్తూ.. పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కృషిచేశారని ప్రశంసించారు. మేడారం స్పెషల్ ఆఫీసర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారని తెలిపారు. ఏఎస్సీ ఆకస్మిక మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. (చదవండి: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి) కాగా, ఇటీవల కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్పీ దక్షిణమూర్తి.. బుధవారం తెల్లవారుజామున కన్నమూసిన సంగతి తెలిసిందే.1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు. -
కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి
సాక్షి, జగిత్యాల : జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణ మూర్తి కరోనాతో మృతి చెందారు. వారం రోజుల కిత్రం కోవిడ్ బారిన పడిన ఆయన.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దక్షిణామూర్తి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. (చదవండి :10 లక్షలు దాటిన కరోనా టెస్టులు) 1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కూడా పని చేశారు.ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది తిరిగి విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.దక్షిణ మూర్తి ఆకస్మిక మృతితో జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. -
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని ముప్పుతిప్పలు పెట్టిన నాగరాజు
సాక్షి, హైదరాబాద్ : కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమాలు తవ్వినకొద్ది బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా పోలీసు అధికారులను సైతం లంచం డిమాండ్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన బాధితుల్లో తాను ఒకడినని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. లీగల్‌గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడని వాపోయారు. (చదవండి : 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) ‘నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 2018లో సర్వేనెంబర్ 614లో నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాను. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. గతంలో నాగరాజుపై చీఫ్ సెక్రెటరీకి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవో కు ఫిర్యాదు చేశాను. అధికారులను మభ్యపెడుతు తన పదవిని కాపాడుకుంటున్నాడు. ఒక పోలీస్ అధికారిగా ఉన్న నన్నే లంచం డిమాండ్ చేశాడంటే.. ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై దందాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయడు.న్యాయస్థానం కూడా నాగరాజు వ్యవహారంలో సీరియస్ అయింది. ఇలాంటి వ్యక్తి ని కఠినంగా శిక్షించాలి’అని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి : నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు) -
పాటతో ప్రజల్లో చైతన్యం నింపుతున్న పోలీసు అధికారిణి
-
రైతుల ఆందోళనకు అనుమతి లేదు
సాక్షి, గుంటూరు: రాజధాని గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. రాజధాని గ్రామాల్లో సెక్షన్30, యాక్ట్ 144 అమల్లో ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుంది కానీ ఎదుటివారికి ఇబ్బంది కల్పించే హక్కు లేదని పేర్కొన్నారు. రైతులు ప్రశాంతంగా నిరసన తెలిపినంత వరకు తాము వారిని అడ్డుకోమని స్పష్టం చేశారు. ప్రజల హక్కులకు ఇబ్బంది కల్పించి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్దండ రాయునిపాలెంలో మీడియా ప్రతినిధులపై దాడి ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎస్పీ చక్రవర్తి తెలిపారు. ఆ సమయంలో పోలీసులు లేకుంటే ప్రాణ నష్టం జరిగేదన్నారు. మీడియాపై దాడి చేసిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేశామని తెలిపారు. మందడంలో జరిగిన ఘటనలో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులే పోలీసులపైకి దాడికి దిగగా ముగ్గురు కానిస్టేబుల్స్ గాయపడ్డారని పేర్కొన్నారు. వెంబడించి మరీ దాడి చేశారు: జర్నలిస్టులు -
పక్కచూపుల నిఘా కన్ను
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారంతో ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అదనపు ఎస్పీ తంగెళ్ల హరికృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో విశాఖలోని ఆశీలుమెట్ట దరి ఫేమ్ హైట్‌లోని ఐదో అంతస్తులో గల హరికృష్ణ నివాసంతోపాటు, రాజమండ్రి, హైదరాబాద్, అమలాపురం, విజయవాడలోని బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ బీవీఎస్ రమణమూర్తి మాట్లాడుతూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారంతో విజిలెన్స్ ఏఎస్పీ హరికృష్ణ ఇంటిలో సోదాలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.74 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించామని, మార్కెట్ ధర ప్రకారం రూ.10కోట్ల పైనే ఉంటాయని అంచనా వేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన హరికృష్ణ 1989లో పోలీస్ శాఖలో ఎస్ఐగా చేరి ఏఎస్పీ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారన్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్‌లో అదనపు ఎస్పీగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేసి నాలుగు నెలల కిందట విశాఖలోని ఏపీ ట్రాన్స్‌కోలో విజిలెన్స్ ఏఎస్పీగా చేరారని తెలిపారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. విజయనగరం డీఎస్పీ డి.వి.ఎస్.నాగేశ్వరరావు, సీఐలు అప్పారావు, భాస్కర్, ఎస్ఐలు, సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. హరికృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలతో పోలీస్ శాఖతోపాటు ఏపీఈపీడీసీఎల్‌లో చర్చనీయంగా మారింది. హరికృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. గుర్తించిన ఆస్తులివీ ►హరికృష్ణ పేరు మీద తూర్పు గోదావరి జిల్లా, తాళ్లరేవు మండలం, చోల్లంగి గ్రామంలో 300 చదరపు గజాల ఇంటి స్థలం. ►విజయవాడలోని గుణదల జయప్రకాష్‌నగర్‌లో శ్రీలక్ష్మి అపార్టుమెంట్ సి – 4లో ఓ ప్లాట్. ►హరికృష్ణ భార్య తంగెళ్ల పద్మారాణి పేరు మీద పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం, మట్టపర్రు గ్రామంలో 25 సెంట్లు స్థలం. ►శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో 3.02 ఎకరాల స్థలం. ►కృష్ణ జిల్లా, మంగళగిరి మండలం, నిడమర్రు గ్రామంలో 72 సెంట్ల స్థలం. ►పశ్చిమ గోదావరి జిల్లా, గవరవరం గ్రామంలో అక్షయ ఎన్‌క్లేవ్‌లో ఓ ప్లాట్. ►విశాఖపట్నం జిల్లా, పరదేశిపాలెంలో ఓ ప్లాట్. ►హరికృష్ణ కుమారుడు రాజహర్ష పేరు మీద విశాఖ జిల్లా పరదేశిపాలెంలో ఓ ప్లాట్. ►కుమార్తె మానవిత పేరు మీద హైదరాబాద్ సరూర్‌నగర్‌లో బిజాయ్ క్యాస్టిల్లో మూడో అంతస్తులో ఓ ప్లాట్. ►సుమారు 6.64 లక్షల విలువ చేసే 260 గ్రాముల బంగారం, 2876 గ్రాముల వెండి వస్తువులు, రూ.19లక్షల విలువ చేసే ఇతర విలువైన వస్తువులను గుర్తించారు. ►అదేవిధంగా బ్యాంకు ఖాతాలో రూ.17లక్షల నగదు గుర్తించారు. -
సెల్‌టవర్ బ్యాటరీ దొంగల అరెస్ట్
విలాసాలకు అలవాటు పడిన ఆరుగురు యువకులు దొంగలుగా మారారు. పగటి పూట సెల్టవర్ల వద్ద రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉండదో వాటిని గుర్తిస్తారు..రాత్రి వేళ ఆటోలో వచ్చి సెల్ టవర్ల వద్ద ఉన్న బ్యాటరీలను అపహరిస్తారు. పలు చోట్ల చోరీ చేసిన బ్యాటరీలను ఆటోలో తీసుకెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇదీ హాలియా పోలీసులకు చిక్కిన దొంగల ముఠా చోరీల తీరు. మంగళవారం హాలియా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పద్మనాభరెడ్డి ఈ ముఠా వివరాలను వెల్లడించారు. త్రిపురారం (నాగార్జునసాగర్) : అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన రమావత్ రాజశేఖర్ సెల్ టవర్ రిపేర్ వర్కర్‌గా హైదరాబాద్‌లోని ఇ.సీ.ఐ.ఎల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌లోనే సెల్ టవర్ రిపేర్ వర్కర్‌గా పనిచేసే సమయంలోనే రమావత్ రాజశేఖర్ తన సైట్లో తీసివేసిన వైర్లు, ఇనుప సామగ్రిని దొంగిలించి తనకు పరిచయం ఉన్న వ్యక్తులకు విక్రయించే వాడు. సెల్ టవర్ రిపేర్ వర్కర్‌గా పనిచేస్తే వచ్చే డబ్బులు అవసరాలకే సరిపోవడం లేదని భావించిన రమావత్ రాజశేఖర్ సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తనకు తెలిసిన దగ్గరి బంధువులు అయిన తిరుమలగిరి(సాగర్) మండలంలోని సుంకిశాలతండాకు చెందిన పాల్తీ అశోక్, అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లికి చెందిన రమావత్ బాలు, తిరుమలగిరి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ నాగరాజు, అడవిదేవులపల్లి మండలం ఏనెమీదితండాకు చెందిన మేరావత్ బాలు, మిర్యాలగూడ మండలంలోని పొట్టిగానితండాకు చెందిన మాలోతు బాలాజీలను కలుపుకుని సెల్ టవర్ బ్యాటరీలనే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇలా ఆరుగురు కలిసి దొంగల ముఠాగా మారి కొంత కాలంగా పలు ప్రాంతాల్లో సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడ్డారు. పట్టుబడింది ఇలా.. హాలియా సమీపంలో సెల్ టవర్ బ్యాటరీలు చోరీ అయిన విషయాన్ని గుర్తించి జేటీఓ టెలికం శాఖ అధికారి గొట్టిపాటి రామారావు 21 ఏప్రిల్ 2019న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు హాలియా సీఐ ధనుంజయగౌడ్ తన సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఈనెల 15వ తేదీన హాలి యా సెంటర్లో పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు వచ్చిన ఆటో వాహనంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆటోలో ఉన్న బ్యాటరీల విషయంపై విచారించగా సరై న సమాధానం చెప్పకపోవడంతో అదుపులోకి తీ సుకుని విచారించడంతో నిందితులు నేరం అంగీకరించారు. పలు ప్రాంతాల్లో చేసిన సెల్ టవర్ బ్యా టరీల చోరీ నేరాలను ఒప్పుకున్నారు. వారి వద్ద సుమారు రూ. 19.61లక్షలు, మూడు ఆటోలు, బ జాబ్ పల్సర్‌తో పాటు 72 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నా రు. -
దళితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది
-
ఇంట్లోకి లాక్కెళ్లి దాడి చేశారు
తాడిపత్రి అర్బన్: కడప టూటౌన్ సీఐ హమీద్, పోలీసు సిబ్బందిని మట్కా మాఫియా సభ్యులు ఇంట్లోకి లాక్కెళ్లి నిర్బంధించి దాడి చేశారని అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు సీఐ సురేంద్రరెడ్డి, ఎస్ఐ శ్రీధర్, రాఘవరెడ్డిలు 11 మంది నిందితులను కొత్త మసీదు టీచర్స్ కాలనీలో సోమవారం అరెస్టు చేశారన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మట్కా కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఐ హమీద్ సిబ్బందితో కలసి ఆదివారం తాడిపత్రికి వచ్చారన్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులు మట్కా కేసుకు సంబంధించి రషీద్ తండ్రి ఉస్మాన్‌ను ఆరాతీస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. పోలీసులపై దాడికి పాల్పడి వారి వాహనానికి నిప్పుపెట్టిన కేసులో ప్రధాన నిందితులైన రషీద్, ఇతని సోదరులు నౌషాద్, బషీర్, అనుచరులు రజాక్, షేక్షావలి అలియాస్ చోటు, జాన్సన్, ఇలియాజ్ బాషా, గజ్జల అర్జున్, వేటూరి శివకుమార్, షేక్‌ఖాజా, ఇండ్ల వంశీకృష్ణ, మసూద్లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో రషీద్‌పై గతంలో రెండు బైండోవర్ కేసులు, రెండు మట్కా కేసులు మరో రెండు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు ఉన్నాయన్నారు. మిగిలిన వారిపైనా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన సీఐ హమీద్ మాట్లాడలేని స్థితిలో ఉండటంతో గాయపడిన మరో కానిస్టేబుల్ నరేంద్రరెడ్డి ఫిర్యాదు మేరకు తాడిపత్రిలో కేసు నమోదు చేశామన్నారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు 11మందిని అరెస్టు చేశామన్నారు. ఈ దాడిలో దాదాపు 15 నుంచి 25మంది వరకు పాల్గొన్నట్లు తెలస్తోందన్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. -
వేధింపుల వీడియోలు తీసి ఏఎస్పీకి షాకిచ్చింది!
సాక్షి, భోపాల్ : మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ అడిషనల్ ఎస్పీపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు. తనకు న్యాయం చేయాలంటూ లైంగిక వేధింపుల వీడియోలను ఉన్నతాధికారుకు పంపడంతో సస్పెండ్ చేస్తామంటూ తొలుత ఆమెను బెదిరించారు. చివరికి ఆమె విషయం మీడియాకు తెలియడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధమయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓ మహిళా కానిస్టేబుల్‌కు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డ్యూటీ వేశారు. అయితే అక్కడ అదనపు ఎస్పీ రాజేంద్రన్ వర్మ ఆ మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో బాధిత మహిళా కానిస్టేబుల్ ఎంతో తెలివిగా.. రాజేంద్రన్ వర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో వీడియో, ఫొటోలు తీశారు. వీటిని ఆధారాలుగా సమర్పిస్తూ.. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేయగా ఆమెకు నిరాశే ఎదురైంది. ఆడియో, వీడియోలు చూసిన తర్వాత.. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ ఆ బాస్ హెచ్చరించారు. అయితే విషయం మీడియా దృష్టికి రావడంతో లాభంలేదని భావించిన ఉన్నతాధికారులు అడిషనల్ ఎస్పీ రాజేంద్రన్ వర్మపై విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
‘పోలీస్ దాదా’పై విచారణకు ఆదేశం
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఎస్.కోట సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ అధికారి ఏడాదిన్నర కాలంగా సాగిస్తున్న అవినీతి దందాపై ‘పోలీస్ దాదా, తవ్వేకొద్దీ వెలుగులోకి, మూర్తీ భవించిన అవినీతి’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాలు జిల్లా పోలీస్ శాఖను కుదిపేశాయి. అధికారి దందాలపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. సాక్ష్యాధారాలతో పాటు బాధితుల వాంగ్మూలతో సహా బయటపెట్టడంతో ఉన్నతాధికారులు చలిం చారు. విచారణ నివేదిక రూపొందించి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. పత్రికలో వచ్చిన కథనాలు ఆధారంగా మరిన్ని వివరాలు సేకరించాల్సిందిగా అడిషనల్ ఎస్పీ అట్టాడ వెంకటరమణను ఆదేశించినట్టు ఎస్పీ పాలరాజు స్వయంగా ‘సాక్షి’కి వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి నివేదిక తయారు చేసి ఆ అధికారిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అవినీతి ఆరోపణల కారణంగా కొందరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఎస్.కోట సర్కిల్లో దందాలపై ‘సాక్షి’ చెప్పింది అక్షరాల వాస్తవమని ఎస్పీ అన్నారు. ఇప్పటికే ఈ సర్కిల్లో అవినీతి ఆరోపణల కారణంగా ఎస్ఐను హెడ్‌క్వార్టర్‌కు పిలిపించగా, ముగ్గురు కానిస్టేబుళ్లను ఆర్మ్డ్ రిజర్వ్‌కు అటాచ్ చేశామని వివరించారు. తాజాగా సర్కిల్ అధికారిపై ఆరోపణలు రావడంతో అతనిపై బహిరంగ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ‘సాక్షి’ కథనాలతో ఎస్.కోట సర్కిల్ పోలీసులో కదలిక కనిపించింది. ఎన్ని అక్రమ వ్యాపా రాలు సాగుతున్నా కేసుల నమోదుకు ముందుకు రాని వారు ఆదివారం పశు అక్రమ రవాణాపై నిఘా పెంచారు. కేసులు నమోదుచేసి పనిచేస్తున్నామ నిపించారు. -
షార్ కాలనీలో హత్యా!?
బెస్ట్ కేస్ (క్రైమ్ స్టోరీ) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కాలనీ. ఆ కాలనీ లోపలికి ఎవరు పడితే వాళ్లు వెళ్లడానికి వీలుండదు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి పంపుతారు. అలాంటి కాలనీలో ముగ్గురిని హత్య చేశారనే విషయం నా చెవినపడగానే ఆశ్చర్యపోయాను. 1996లో నేను నెల్లూరు అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. కట్టుదిట్టమైన భద్రత గల షార్ కాలనీలో జరిగిన ఆ హత్యలు పెను సంచలనం సృష్టించాయి. ఆ కాలనీలో నివసించే ఒక సైంటిస్టు భార్యని, ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా చంపినట్టు తెలియగానే ఆగమేఘాలపై మావాళ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నేను కూడా స్పెషల్టీమ్తో వెళ్లాను. సైంటిస్టు ఇంట్లోలేని సమయంలో హత్యలు జరిగాయి. అతని భార్యని నైలాన్తాడుని గొంతుకి బిగించి చంపారు. ఎనిమిది, పదేళ్ల వయసు అమ్మాయి, అబ్బాయిని గొంతు పిసికి చంపారు. ఆమె ఒంటిపై మాయమైన బంగారం వివరాలను బట్టి ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేసని అర్థమైపోయింది. భర్తని అనుమానించాం... సైంటిస్టు తమిళనాడుకి చెందినవాడు. ముందుగా ఆయన్ని ప్రశ్నించాం. భార్యా పిల్లల్ని పోగొట్టుకున్న షాక్‌లో ఉన్న ఆ సైంటిస్టుకి ఏ పాపం తెలీదని మాకు అర్థమయ్యాక బయటివారిపై దృష్టి పెట్టాం. ఈలోగా పైనుంచి ప్రెజర్ మొదలైంది. శ్రీహరికోట దగ్గర షార్ కాలనీలో హత్యలు జరిగిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఒక పక్క హైదరాబాద్ నుంచి హోమ్ శాఖ అధికారుల నుంచి ఫోన్లు, మరోవైపు కేంద్ర హోంశాఖ దగ్గర నుంచి.. ముందుగా సెక్యురిటీవారి నుంచి ఆ రోజు కాలనీ లోపలికి వెళ్లినవారి సమాచారం సేకరించాం. పర్మిషన్ లేకుండా, పది రకాల ప్రశ్నలడక్కుండా లోపలికి చీమనైనా పంపని షార్ సెక్యురిటీ వాళ్లు కూడా హంతకుడు లోపలికి ఎలా జొరబడ్డాడో తెలియదంటున్నారు. అంత బందోబస్తున్న షార్ కాలనీలో హత్య అనగానే అంత త్వరగా హత్యానేరాన్ని బయటివారికి కనెక్ట్ చేయలేం. ఆ రోజు కాలనీ లోపలికి వచ్చినవారి లిస్టు దగ్గర పెట్టుకుని వివరాలు సేకరించడం మొదలుపెడితే ఒక వ్యక్తి దగ్గర చిన్న అనుమానం వచ్చింది. ఫొటో ఆధారంగా... మాకు అనుమానం వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో సెక్యురిటీవారిని అడిగి నిందితుడి ఊహచిత్రాన్ని గీయించాం. దాన్ని నెల్లూరులోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపించాం. పదిరోజులపాటు అన్నిరకాల దారుల నుంచి ప్రయత్నాలు చేయగా చివరికి పట్టుపట్టాడు. నిందితుడి పేరు బొట్టు వెంకటరెడ్డి అలియాస్ చిరు. దోపిడీలు చేసుకుంటూ బతికేవాడు.మొదట తనకేం తెలియదన్నాడు. చివరికి ఒప్పుకున్నాడు. దొంగతనం చేయడం కోసం షార్ కాలనీకి ఎందుకెళ్లావని అడిగితే ఇంటరెస్టింగ్ లవ్‌స్టోరీ చెప్పుకొచ్చాడు. హత్య చేయడానికి అతను షార్ కాలనీలోకి వెళ్లలేదు, ప్రియురాలిని చూద్దామని వెళ్లాడు. దానికోసం రేషన్‌కార్డులు పంపిణీదారుడి పేరుతో లోపలికి చొరపడ్డాడు. ఒంటిమీద దండిగా బంగారంతో ఉన్న మహిళ కంట్లో పడగానే, బంగారం కోసం హత్యకు పాల్పడ్డాడు. అమ్మాయికోసం... బొట్టు వెంకటరెడ్డిపై అప్పటికే చాలా కేసులున్నాయి. వీడు దోపిడీలు చేయడంతో పాటు చాలాకాలంగా ప్రేమ పేరుతో తన వీధిలో ఉన్న అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె వెంటపడడమే కాకుండా ఆమె ఇంటి చుట్టపక్కలవారితో ఆ అమ్మాయి తనని ప్రేమిస్తుందంటూ ఏవో ప్రచారాలు కూడా చేశాడు. అమ్మాయి ఇంట్లోవాళ్లు చాలాసార్లు వీడికి వార్నింగ్ ఇచ్చారు. అయినా వెంకటరెడ్ది తన తీరు మార్చుకోకపోయేసరికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెని షార్ కాలనీలో ఉన్న బంధువుల ఇంట్లో పెట్టారు. అక్కడికి ఈ దొంగ రాలేడని వాళ్లనుకున్నారు. అయినా వీడు ఆమెను వదల్లేదు. ఆ కాలనీలోకి ఏదో ఒక రూపంలో చొరబడి ఆమెను వేధించాలనుకున్నాడు. వీడికి మండల కార్యాలయంలో తెలిసిన అధికారి ఉన్నాడు. అతని సాయంతో రేషన్‌కార్డులు పంచే అవతారం ఎత్తాడు. ఎంచక్కా పేరు, గెటప్ మార్చుకుని షార్ కాలనీ గేటు దగ్గరికి వచ్చాడు. అక్కడి సెక్యూరిటీవాళ్లు ఇతని చేతిలో ఉన్న రేషన్‌కార్డులు చూసి నమ్మి లోపలికి పంపించారు. నిందితుడి పేరు బొట్టు వెంకటరెడ్డి అలియాస్ చిరు. దోపిడీలు చేసుకుంటూ బతికేవాడు. ఆమె ఇల్లు అనుకుని... వెంకటరెడ్డి అలియాస్ చిరు... షార్ కాలనీలో అడుగుపెట్టగానే తన ప్రియురాలు ఏ ఇంట్లో ఉందో తెలుసుకునే పనిలో భాగంగా అందరి ఇళ్ల తలుపు కొట్టడం మొదలెట్టాడు. ఆ వరుసలోనే సైంటిస్టు ఇంటికి కూడా వెళ్లాడు. తలుపు తెరిచిన మహిళ ఒంటిపై బంగారం బాగా కనిపించడంతో కుటుంబ సభ్యుల వివరాలు కావాలంటూ లోపలికి వెళ్లి కూర్చున్నాడు. దాహంగా ఉంది నీళ్లు కావాలని అడిగాడు. మంచినీళ్ల కోసం ఆమె వంటింట్లోకి వెళ్లింది. అంతే ఇతను కూడా ఆమె వెనకే వెళ్లి వెనక నుంచి నైలాన్‌తాడుతో ఆమె మెడను బిగించి చంపేశాడు. ఆమె కిందపడగానే మెడలో ఉన్న నాలుగు తులాల మంగళసూత్రాల గొలుసు, ఆరు తులాల గాజుల్ని తీసుకుని జేబులో పెట్టుకుని వెనక్కి తిరిగి చూసే సరికి ఆటలాడుకుని అమ్మా... అంటూ వచ్చిన ఇద్దరు పిల్లలూ ఎదురుగా నిలబడ్డారు. తల్లి కిందపడి ఉన్న విషయాన్ని గమనించి ‘అమ్మా...’ అంటూ గట్టిగా అరవబోయారు. వాళ్లిద్దరినీ అలాగే వదిలేస్తే కాలనీగేటు దాటి బయటికెళ్లే పరిస్థితి ఉండదు. పోనీ గదిలో పెట్టి బంధిస్తే మర్నాడు పోలీసులకు సాక్షులుగా మిగిలిపోతారనే భయంతో వెంకటరెడ్డి ఆ ఇద్దరు చిన్నారులను కర్కశంగా గొంతు నులిమి చంపేశాడు. నెలరోజులు పట్టింది... హత్యలు జరిగిన నాటి నుంచి నిందితుడు మా చేతికి చిక్కడానికి దాదాపు నెల రోజులు పట్టింది. మొదట్లో దృష్టి అంతా కాలనీవాసులపైనే ఉంచడం వల్ల సమయం వృథా అయిపోయింది. చివరికి దొంగ దొరికాక కేసుకున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని కేసుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకి తరలించారు. మామూలుగా కోర్టుకి ప్రతిసారి ఎస్ఐ స్థాయి అధికారులు వెళితే సరిపోతుంది. కానీ నేను ఈ కేసుని ప్రత్యేకంగా భావించి ప్రతి వాయిదాకి స్వయంగా వెళ్లేవాణ్ణి. వెంకటరెడ్డి ఈ హత్యకు పాల్పడినట్టు కోర్టుకి సాక్ష్యాలన్నీ పకడ్బందీగా సమర్పించాం. ఏ దశలోనైనా కేసు పక్కదోవ పట్టకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. ఏడాదిలోగానే తీర్పు వచ్చింది. నిందితుణ్ణి హంతకుడిగా నిర్ధారిస్తూ కోర్టు ఉరిశిక్ష విధించింది. అతను తిరిగి హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ అతనికి యావజ్జీవకారాగార శిక్ష పడింది. రిపోర్టింగ్: భువనేశ్వరి