సెల్‌టవర్‌ బ్యాటరీ దొంగల అరెస్ట్‌ | Arrest of Cell Tower Battery Robbers in Nalgonda | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్‌ బ్యాటరీ దొంగల అరెస్ట్‌

Published Wed, Jul 17 2019 11:11 AM | Last Updated on Wed, Jul 17 2019 11:12 AM

Arrest of Cell Tower Battery Robbers in Nalgonda - Sakshi

కేసు వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్‌ ఎస్పీ పద్మనాభరెడ్డి

విలాసాలకు అలవాటు పడిన ఆరుగురు యువకులు దొంగలుగా మారారు. పగటి పూట సెల్‌టవర్ల వద్ద రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ  సెక్యూరిటీ ఉండదో వాటిని గుర్తిస్తారు..రాత్రి వేళ ఆటోలో వచ్చి సెల్‌ టవర్ల వద్ద ఉన్న బ్యాటరీలను అపహరిస్తారు. పలు చోట్ల చోరీ చేసిన బ్యాటరీలను ఆటోలో తీసుకెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. ఇదీ హాలియా పోలీసులకు చిక్కిన దొంగల ముఠా చోరీల తీరు. మంగళవారం హాలియా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ పద్మనాభరెడ్డి  ఈ ముఠా వివరాలను వెల్లడించారు.

 త్రిపురారం (నాగార్జునసాగర్‌) :  అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన రమావత్‌ రాజశేఖర్‌ సెల్‌ టవర్‌ రిపేర్‌ వర్కర్‌గా హైదరాబాద్‌లోని ఇ.సీ.ఐ.ఎల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌లోనే సెల్‌ టవర్‌ రిపేర్‌ వర్కర్‌గా పనిచేసే సమయంలోనే రమావత్‌ రాజశేఖర్‌ తన సైట్‌లో తీసివేసిన వైర్లు, ఇనుప సామగ్రిని దొంగిలించి తనకు పరిచయం ఉన్న వ్యక్తులకు విక్రయించే వాడు. సెల్‌ టవర్‌ రిపేర్‌ వర్కర్‌గా పనిచేస్తే వచ్చే డబ్బులు అవసరాలకే సరిపోవడం లేదని భావించిన రమావత్‌ రాజశేఖర్‌ సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తనకు తెలిసిన దగ్గరి బంధువులు అయిన తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని సుంకిశాలతండాకు చెందిన పాల్తీ అశోక్, అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లికి చెందిన రమావత్‌ బాలు, తిరుమలగిరి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ నాగరాజు, అడవిదేవులపల్లి మండలం ఏనెమీదితండాకు చెందిన మేరావత్‌ బాలు, మిర్యాలగూడ మండలంలోని పొట్టిగానితండాకు చెందిన మాలోతు బాలాజీలను కలుపుకుని సెల్‌ టవర్‌ బ్యాటరీలనే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇలా ఆరుగురు కలిసి దొంగల ముఠాగా మారి కొంత కాలంగా పలు ప్రాంతాల్లో సెల్‌ టవర్‌ బ్యాటరీల చోరీలకు పాల్పడ్డారు.

పట్టుబడింది ఇలా..
హాలియా సమీపంలో సెల్‌ టవర్‌ బ్యాటరీలు చోరీ అయిన విషయాన్ని గుర్తించి  జేటీఓ టెలికం శాఖ అధికారి గొట్టిపాటి రామారావు 21 ఏప్రిల్‌ 2019న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు హాలియా సీఐ ధనుంజయగౌడ్‌ తన సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. ఈనెల 15వ తేదీన హాలి యా సెంటర్‌లో పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు వచ్చిన ఆటో వాహనంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆటోలో ఉన్న బ్యాటరీల విషయంపై విచారించగా సరై న సమాధానం చెప్పకపోవడంతో అదుపులోకి తీ సుకుని విచారించడంతో నిందితులు నేరం అంగీకరించారు. పలు ప్రాంతాల్లో చేసిన సెల్‌ టవర్‌ బ్యా టరీల చోరీ నేరాలను ఒప్పుకున్నారు. వారి వద్ద సుమారు రూ. 19.61లక్షలు, మూడు ఆటోలు, బ జాబ్‌ పల్సర్‌తో పాటు 72 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నా రు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

పోలీసులు స్వాధీనం చేసుకున్న బ్యాటరీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement