
హైదరాబాద్, సాక్షి: పెద్ద అంబర్‌పేటలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చెలరేగింది. చోరీ చేసి పారిపోతున్న దోపిడీ ముఠాను పట్టుకునే నల్లగొండ పోలీసులు ఛేజింగ్‌కు దిగారు. ఈ క్రమంలో ఆ దొంగలు పోలీసులపైకి కత్తులు దూశారు. దీంతో పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చింది.
నల్లగొండలో చోరీలు చేసిన ఓ ముఠా పారిపోతుండగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు వాళ్లను వెంబడి అడ్డగించారు. ఆ టైంలో పోలీసులపై దుండగులు కత్తులు దూశారు. దీంతో వాళ్లను అదుపు చేసేందుకు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం నలుగురు గ్యాంగ్ సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు. వీళ్లను పార్థీ(పార్థ) గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్య వరుసగా పోలీస్ ఫైరింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిలకలగూడలో మొబైల్ ఫోన్ స్నాచర్లపై, సైదాబాద్‌లో చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే తాజా ఘటన మాత్రం నగర శివారులో చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment