Tirupati: Additional SP Meeting With Traffic Police Over Rules On Tirumala Ghat Road - Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్ రోడ్డులో‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

Published Tue, May 30 2023 3:00 PM | Last Updated on Tue, May 30 2023 3:32 PM

Tirupati: Additional Sp Meeting With Traffic Police Over Rules In Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో‌ నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా, తిరుమలకు ఆ వాహనాలను నిషేధిస్తామని తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పారు.

తిరుమల ట్రాఫిక్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిందన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం కారణాల వద్ద స్వల్ప రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఘాట్ రోడ్డులో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని, డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు, సలహాలు ఇచ్చే విదంగా చర్యలు చేపట్టామన్నారు. ఇక ఘాట్ రోడ్డులో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తామని, ఘాట్ రోడ్డులో పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే, ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య అన్నారు.

చదవండి: కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement