
సాక్షి, కరీంనగర్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రంతీ వ్యక్తం చేశారు. దక్షిణమూర్తి మృతి చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణమూర్తి ఎస్సై స్థానం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఏఎస్పీ స్థాయికి ఎదిగారని కొనియాడారు. అంకితభావంతో పనిచేస్తూ.. పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కృషిచేశారని ప్రశంసించారు. మేడారం స్పెషల్ ఆఫీసర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారని తెలిపారు. ఏఎస్సీ ఆకస్మిక మృతికి సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. (చదవండి: కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి)
కాగా, ఇటీవల కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎస్పీ దక్షిణమూర్తి.. బుధవారం తెల్లవారుజామున కన్నమూసిన సంగతి తెలిసిందే.1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు.