అతిథి వస్తున్నారు | Sai Pallavi Next Movie Anukoni Athidhiin | Sakshi
Sakshi News home page

అతిథి వస్తున్నారు

Oct 16 2019 1:11 AM | Updated on Oct 16 2019 1:11 AM

Sai Pallavi Next Movie Anukoni Athidhiin - Sakshi

కేరళలో 1970లలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అధిరన్‌’. సాయిపల్లవి, ఫాహద్‌ ఫాజిల్, ప్రకాష్‌ రాజ్, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో వివేక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ‘అనుకోని అతిథి’ పేరుతో నవంబర్‌ 15న తెలుగులో రిలీజ్‌ కానుంది. ఇన్‌ ట్రూప్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సాయిపల్లవి, ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి నటన సూపర్బ్‌. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. మలయాళంలోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అను మోతే దత్, సంగీతం: పి.ఎస్‌. జయహరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీన్వాస్, సమర్పణ: దీపా సురేందర్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement